అల్కా కౌశల్

భారతీయ సినిమా నటి, నిర్మాత

అల్కా బడోలా కౌశల్ భారతీయ సినిమా నటి, నిర్మాత. హిందీ సినిమారంగంలో ప్రసిద్ధి చెందింది. కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్, కుబూల్ హై వంటి టీవీ షోలలో, టీవీ సీరియల్స్‌లో సహాయక పాత్రలలో నటించింది.[1][2][3][4] మోస్ ఛల్ కియే జాయేలో సుష్మా ఒబెరాయ్ పాత్రను పోషించింది.

అల్కా కౌశల్
జననం
అల్కా బడోలా

వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరవి జి. కౌశల్‌
పిల్లలు1
బంధువులువరుణ్ బడోలా (సోదరుడు)

అల్కా బడోలా కౌశల్ ఢిల్లీలో రంగస్థల కళాకారుడు విశ్వ మోహన్ ఎస్. బడోలా, సుశీల బడోలా దంపతులకు జన్మించింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రిపర్టరీలో చేరి నటనలో శిక్షణ పొందింది. టెలివిజన్‌ సీరియళ్ళలో నటించడానికి ముంబైకి వెళ్ళింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

టివి నిర్మాత, దర్శకుడు రవి జి. కౌశల్‌తో అల్కా బడోలా కౌశల్ వివాహం జరిగింది. వీరు తమ సొంత నిర్మాణ సంస్థ మంగళం ఆర్ట్స్‌ని ప్రారంభించారు.

కళారంగం

మార్చు

నటిగా:

టెలివిజన్

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్ర
2002–2007 కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ సుకన్య వాధ్వా
2002–2003 కమ్మల్
2004–2005 ప్రతిమ ఆశా ధర్మేష్ ఠాకూర్
2009–2010 జ్యోతి చోటీ మా
2011–2012 డోంట్ వర్రీ చచ్చు
2012–2015 ఖుబూల్ హై రజియా గఫూర్ అహ్మద్ సిద్ధిఖీ
2014 హమారీ సోదరి దీదీ శ్రీమతి. కపూర్
2015–2016 స్వరాగిణి పార్వతి దీనదయాళ్ గడోడియా
2016 సరోజిని తారకేశ్వరి సింగ్
2017 సంతోషి మా క్రాంతి మా
2018 వో అప్నా సా అంబికా ఖన్నా
2019 బహు బేగం గజాలా మీర్జా
షాదీ కే సియాపే ఫ్యాన్సీ
2020 యే రిష్తా క్యా కెహ్లతా హై సీతా చౌదరి
నాజర్ 2 నర్మదా చౌదరి
బారిస్టర్ బాబు తారా బాయి
2020–2021 శౌర్య ఔర్ అనోఖి కి కహానీ దేవి సబర్వాల్
2021 చోటి సర్దార్ని రింపుల్ బబ్బర్
2022 మోసే ఛల్ కియే జాయే సుష్మా హర్షవర్ధన్ ఒబెరాయ్

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ితర వివరాలు
2014 రాణి శ్రీమతి మెహ్రా
2015 ధరమ్ సంకట్ మే ధరమ్ పాల్ భార్య
2015 బజరంగీ భాయిజాన్ కరీనా కపూర్ తల్లి
2018 వీరే ది వెడ్డింగ్ శ్రీమతి సంతోష్ భండారి
2018 సూర్మ తాప్సీ తల్లి
2018 బధాయి హో ఆయుష్మాన్ ఖురానా అత్త (గుడాన్ భువా)
2020 ఇందూ కీ జవానీ ఇండో తల్లి

నిర్మాతగా

మార్చు
  • మీట్ మిలా డి రబ్బా
  • ఖో గయీ మంజిలీన్... ఖో గయీ
  • నయా దౌర్
  • సాటర్ డే సస్పెన్స్
  • థ్రిల్లర్ @ 10

మూలాలు

మార్చు
  1. Harneet Singh (20 November 2002). "Kumkum's Sukanya bua is in town ... and so is Shanti's Ayesha". The Times of India. Retrieved 22 October 2014.
  2. "Alka Kaushal, Shubhangi Gokhale & Rajendra Chawla in DJ's A Creative Unit's show". The Times of India. 22 July 2014. Retrieved 22 October 2014.
  3. Ano Patel (27 April 2013). "The new showstealers". The Times of India. Retrieved 22 October 2014.
  4. "Characters of vamps are very interesting, says Alka Kaushal". The Times of India. 20 April 2013. Retrieved 22 October 2014.

బయటి లింకులు

మార్చు