అల్తమస్ కబీర్
అల్తమస్ కబీర్, (జననం 1948 జూలై 19, కలకత్తా), భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి.[1] ఇతను 2012 సెప్టెంబరు 29 నుండి 2013 జూలై 18 వరకు భారత 39వ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించాడు.
అల్తమస్ కబీర్ | |
---|---|
భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 29 సెప్టెంబరు 2012 – 18 జూలై 2013 | |
Appointed by | ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతి |
అంతకు ముందు వారు | ఎస్. హెచ్. కపాడియా |
తరువాత వారు | పి. సతాశివం |
ప్రధాన న్యాయమూర్తి, జార్ఖండ్ హైకోర్టు | |
In office 1 మార్చి 2005 – 8 సెప్టెంబరు 2005 | |
అంతకు ముందు వారు | జస్టిస్ పి. కె. బాలసుబ్రమణియణ్ |
తరువాత వారు | జస్టిస్ ఎన్. దినకర్ |
న్యాయమూర్తి, కలకత్తా హైకోర్టు | |
In office 6 ఆగస్టు 1990 – 28 ఫిబ్రవరి 2004 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1948 జూలై 19
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | మీనా కబీర్ |
కళాశాల | కలకత్తా విశ్వవిద్యాలయం, కలకత్తా |
నేపథ్యం
మార్చుపశ్చిమ బెంగాల్ లోని బెంగాలీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు.[2] కలకత్తా లోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్య అభ్యసించాడు.[3] తండ్రి జెహంగీర్ కబీర్, పశ్చిమ బెంగాలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు, కార్మిక నాయకుడు. ఇతను అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు బి. సి. రాయ్, ప్రఫుల్ల చంద్ర సేన్ ల మంత్రివర్గాలలో పనిచేశాడు. అంతేకాకుండా 1967 లో పశ్చిమ బెంగాల్ లో అజోయ్ కుమార్ ముఖర్జీ నాయకత్వంలో ఎన్నుకోబడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[4] అల్తమస్ డార్జిలింగ్ లోని ప్రసిద్ధ ఎమినెంట్ మౌంత్ హెర్మన్ పాఠశాలలో, కలకత్తా లోని కలకత్తా బాలుర పాఠశాలలో విద్యనభ్యసించాడు. విద్యార్థిగా ఉన్నపుడు సామాజిక సమస్యలపై ఇతను రచించిన ఒక రచనను చదివిన కలకత్తా బాలుర పాఠశాలలోని ఒక ఉపాధ్యాయుడు ఇతడిని న్యాయశాస్త్రం చదవమని ప్రోత్సహించాడు. కలకత్తా విశ్వవిద్యాలయం నకు అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కళాశాల నుండి చరిత్ర ప్రధానాంశంగా పట్టభద్రుడైన తర్వాత అల్తమస్ న్యాయవిద్యను అభ్యసించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Justice Altamas Kabir takes oath as CJI". Zee News. 29 September 2012. Retrieved 29 September 2012.
- ↑ Mahapatra, Dhananjay (30 సెప్టెంబరు 2012). "Justice Altamas Kabir takes oath as 39th CJI". Times of India. Archived from the original on 2013-05-06. Retrieved 26 డిసెంబరు 2012.
- ↑ IANS (సెప్టెంబరు 13, 2012). "Justice Altamas Kabir to be next Chief Justice of India". IBN Live. Archived from the original on 2012-09-16. Retrieved 26 డిసెంబరు 2012.
- ↑ 4.0 4.1 Swamy, V. Kumara (సెప్టెంబరు 12, 2012). "Batting for the underdog". The Telegraph. Retrieved 26 డిసెంబరు 2012.