అల్లంరాజు ఉషారాణి

అల్లంరాజు ఉషారాణి ఆకాశవాణి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ (ప్రోగ్రామ్స్)

అల్లంరాజు ఉషారాణి
అల్లంరాజు ఉషారాణి చిత్రం
జననం
అల్లంరాజు ఉషారాణి

జూలై 2 1958
ఇతర పేర్లుఅల్లంరాజు ఉషారాణి
విద్యబి.యస్సీ, ఎం.ఎ (ఇంగ్లీషు)
విద్యాసంస్థఆంధ్రవిశ్వవిద్యాలయం
వృత్తిఆకాశవాణి కేంద్రం ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్.అనంతరం ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా శిక్షణాసంస్థ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆకాశవాణి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్
జీవిత భాగస్వామిఅల్లంరాజు వెంకటరావు](సుధామ)
పిల్లలుఅల్లంరాజు స్నేహిత్ (కుమారుడు)

అల్లంరాజు (దువ్వూరి) లక్ష్మీ స్రవంతి (కోడలు)

అల్లంరాజు ఆథర్వ్ (జున్ను)-(మనుమడు)
తల్లిదండ్రులుసూకూరు రాధాదేవి, హనుమంతరావు
బంధువులుమీనాక్షీ నాభి (అక్క) సూకూరు రామారావు (అన్న)

జీవిత విశేషాలు

మార్చు

ఆమె తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ లో సూకూరు రాధాదేవి, హనుమంతరావు దంపతులకు మూడవ సంతానంగా జూలై 2 1958 న జన్మించారు. ఆమె అక్క మీనాక్షి, అన్నయ్య సూకూరు రామారావు. కానీ ఉషారాణి పెంపకానికి వెళ్ళి సూకూరు లక్ష్మీబాయి, ఎస్.ఎల్.నరసింహం గార్ల మూడవ కుమార్తెగా పెరిగి వారివద్దే విద్యాబుద్ధులు నేర్చారు. శ్రీ నరసింహంగారు తెలుగుప్రేమప్రచారక్ పత్రికా సంపాదకులుగా కాకినాడ లో పనిచేశారు .పెంపువెళ్లిన తరువాత ఉషారాణి గారి పెద్దక్క మొసలికంటి రాధామోహన్. రెండవ అక్క శ్రీమతి ఘనగం ప్రేమప్యారీ.పెద్ద బావగారు శ్రీ ఎం.ఎస్.రావు గారు వయొలినిస్టుగా మద్రాస్ లో వెంపటి చినసత్యంగారి నాట్య సంస్థలో ,సినిమారంగంలో రాణించారు.చిన్నబావగారు శ్రీ ఘనగం సుబ్బారావు గారు ఇండస్ట్రియల్ రంగంలో అధికారి గా పనిచేశారు

ఉషారాణి చిన్ననాటనుండే నాట్యశిక్షణ సత్యనారాయణరావు గారి వద్ద అభ్యసించి కాకినాడలోనే కాక పలు నగరాలలో జంషెడ్ పూర్ లో ప్రదర్శనలిచ్చారు. కూచిపూడి భారతనాట్య కళాకారిణిగా రాణించారు. బి.ఎస్సీ ప్యాసయ్యి పి.ఆర్.కళాశాలలో[1] పి.జి.సెంటర్ నుండి ఎం.ఏ.ఇంగ్లీష్ లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి గోల్డు మెడల్ సాధించారు. 1983 లో మద్రాస్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా ఎంపికై ఆకాశవాణి కడపకేంద్రంలో ట్రాన్స్ మిషన్ ఎక్సిక్యూటివ్ గా చేరారు. అనంతరం విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి బదిలీపై వెళ్ళారు. క్రియశీలక అధికారిగా మంచి పేరు పొందారు.

1985 జనవరి 26 న వీరి వివాహం ప్రముఖ కవి,రచయిత సుధామ గా పేరొందిన అల్లంరాజు వెంకటరావు గారితో జరిగింది.సుధామ ఆకాశవాణి హైదరాబాద్ కేద్రంలో పనిచేస్తూవుండడంతో నాటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ లీలాబవుడేకర్ విజయవాడ డైరెక్టర్ పి.ఆర్.రెడ్డి గారిని ఆదేశించి ఉషారాణి ని హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయించారు . అటుపై ఉషారాణి 1990 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ప్రోగ్రాంఎక్సిక్యూటివ్ గా తెలుగువారిలో ప్రధములుగా ఎంపికై విజయవాడ ఆకాశవాణి కేంద్రం స్త్రీలు పిల్లల కార్యక్రమాల విభాగ అధిపతిగా నియమితులయ్యారు..అక్కడ నుండి 1995 లో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి బదిలీ అయ్యి భక్తిరంజని,యువవాణి ,స్త్రీలు ,పిల్లలకార్యక్రమాలు,కర్ణాటక సంగీతం వంటి పలువిభాగాలకు అధికారిణిగా పనిచేశారు. తురగా జానకీరాణి గారి తరువాత రేడియో అక్కయ్యగా పేరుపొందారు.పిల్లల బృందగాన కార్యక్రమాల ద్వారా కేంద్రానికి పలు అవార్డులు తెచ్చిపెట్టారు. స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై బీబీసి ట్రైనింగ్ చేసి 2000సంవత్సరంలో ఉద్యోగరీత్యా కొన్నాళ్లు లండన్ పర్యటించి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వరంగల్ కేంద్ర అధిపతిగా రెండు సంవత్సరాలు పనిచేసి పేరు తెచ్చుకున్నారు.వరంగల్ నుండి హైదరాబాద్ తిరిగివచ్చాక ఆకాశవాణి వివిధభారతి హైదారాబాద్ కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గాకొన్నాళ్లపాటు పదోన్నతి తో పనిచేసి ఆపై రీజనల్ అకాడమీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మల్టీమీడియా శిక్షణాసంస్థ అధికారిణిగా ఎంతో పేరుపొందారు.2017లో స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు .

ఆమెకు ఒక కుమారుడు.స్నేహిత్ అల్లంరాజు.ప్రస్తుతం ఆర్.ఏం.సి.సంస్థ డిజిటల్ అనాల్సిస్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.కోడలు స్రవంతి లక్స్ సాఫ్ట్ సంస్థలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉషారాణి గారి మనుమడు చి.ఆథర్వ్ (జున్ను)

ప్రస్తుతం ఉషారాణి గారు విశ్రాంత జీవనం గడుపుతూ దయాల్బాగ్ రాధాస్వామి సత్సంగి గా అధ్యాత్మిక మార్గంలో వున్నారు.

మూలాలు

మార్చు