అవంతిక శెట్టి
అవంతిక శెట్టి (జననం 1986 ఆగస్టు 1) భారతీయ నటి, ప్రకటనకర్త. ప్రధానంగా కన్నడ సినిమాలలో నటించే ఆమె రంగితరంగ (2015)తో తన సినీ రంగ ప్రవేశం చేసింది.[1] ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఫిలింఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటిగా ఆమె నామినేట్ చేయబడింది.[2]
అవంతిక శెట్టి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, మోడల్, డ్యాన్సర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
సినిమాలకు ముందు, ఆమె ముంబైలో కొన్ని టెలివిజన్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది.
బాల్యం
మార్చుమంగళూరులోని తుళు మాట్లాడే తుళువ బంట్ కుటుంబంలో 1986 ఆగస్టు 1న అవంతిక శెట్టి జన్మించింది.
కెరీర్
మార్చుఅనూప్ భండారి దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా చిత్రం రంగితరంగ (2015)తో ఆమె పెద్ద తెరపైకి అడుగుపెట్టింది. ఈ చిత్రం అనేక దేశాల్లో విడుదలై మంచి సమీక్షలను అందుకుంది. అలాగే, ఇది కన్నడ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో నామినేషన్ పొందింది. ఈ విజయవంతమైన అరంగేట్రం తరువాత, ఆమె ఆర్. అనంతరాజు దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం కల్పన 2లో ఉపేంద్ర సరసన నటించింది.[3] రాఘవ లారెన్స్ నటించి, రూపొందించిన విజయవంతమైన తమిళ చిత్రం, కాంచన 2 రీమేక్, ఒరిజినల్‌లో తాప్సీ పన్ను పోషించిన పాత్రను పోషించింది. నటుడు వి. రవిచంద్రన్ ఆవిష్కరించిన రియాల్టీ షో డ్యాన్సింగ్ స్టార్స్ 3లో పాల్గొన్నది. ఆమె రాజరథ చిత్రంలో నటించింది. ఇది రాజరథం (2018) అనే పేరుతో తెలుగులోనూ విడుదలైంది.
టెలివిజన్
మార్చుసంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | ఛానల్ |
---|---|---|---|---|
2008 | ధరమ్ వీర్ | సాక్షి | హిందీ | ఎన్డీటీవి ఇమాజిన్ |
2009-10 | సజన్ ఘర్ జానా హై | గౌరీ సుమేర్ రఘువంశీ | హిందీ | స్టార్ ప్లస్ |
2012-15 | నా ఆనా ఈజ్ దేస్ లాడో | రాగిణి | హిందీ | కలర్స్ టీవీ |
2019-2020 | మేరే డాడ్ కీ దుల్హన్ | అంజలి అంబరు శర్మ | హిందీ | సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ |
మూలాలు
మార్చు- ↑ "Mangaluru beauty readies for Kannada debut". The Times of India. 24 June 2015.
- ↑ "Nominations for the 63rd Britannia Filmfare Awards (South)". Filmfare. 7 June 2016.
- ↑ "Uppi is Very Large- Hearted, Says Rangitaranga Actress". The New Indian Express. 13 January 2016. Archived from the original on 9 జూన్ 2016. Retrieved 23 అక్టోబరు 2023.