అశోక్‌నగర్

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

అశోక్‌నగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, అశోక్‌నగర్ జిల్లా లోని పట్టణం. [5] ఇది అశోక్‌నగర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. పూర్వం ఇది గుణ జిల్లాలో భాగంగా ఉండేది. అశోక్ నగర్ ధాన్యం మార్కెట్టుకు, "షర్బతి గైహు" అనే గోధుమ రకానికీ ప్రసిద్ధి. [6] సమీప పట్టణం గుణ నుండి 45 కి.మీ. దూరంలో ఉంది. అశోక్ నగర్ ను గతంలో పచార్ అని పిలిచేవారు. రైలు మార్గం పట్టణం మధ్య నుండి వెళుతుంది. అశోక్ నగర్ లో రైల్వే స్టేషను, రెండు బస్ స్టేషన్లు ఉన్నాయి. అశోక్‌నగర్ నుండి మధ్యప్రదేశ్ లోని ప్రధాన నగరాలకు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.

అశోక్‌నగర్[1]
పట్టణం
అశోక్‌నగర్[1] is located in Madhya Pradesh
అశోక్‌నగర్[1]
అశోక్‌నగర్[1]
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°34′48″N 77°43′48″E / 24.58000°N 77.73000°E / 24.58000; 77.73000
దేశశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
ప్రాంతంబుందేల్‌ఖండ్
జిల్లాఅశోక్‌నగర్
Area
 • Total57.3 km2 (22.1 sq mi)
Elevation
499 మీ (1,637 అ.)
Population
 (2011)
 • Total81,828[2]
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్MP-67[3]
Websitehttp://ashoknagar.nic.in/

జనాభా మార్చు

అశోక్‌నగర్ లో మతం (2011)[7]
మతం శాతం
హిందూ మతం
  
81.59%
ఇస్లాం
  
8.07%
జైన మతం
  
9.65%
సిక్కు మతం
  
0.65%

శీతోష్ణస్థితి మార్చు

అశోక్‌నగర్‌లో ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత 47°C కి చేరుకుంటుంది. శీతాకాలంలో 4°C కి పడిపోతుంది.

రవాణా సౌకర్యాలు మార్చు

అశోక్‌నగర్ నుండి రాష్ట్రం లోని, దేశంలోని ప్రధాన నగరాలకు రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయి. అశోక్‌నగర్ రైల్వే స్టేషన్ పశ్చిమ మధ్య రైల్వేలోని కోట-బీనా రైల్వే విభాగంలో భాగంగా ఉంది. అశోక్‌నగర్‌కు సమీప విమానాశ్రయాలు భోపాల్ విమానాశ్రయం, గ్వాలియర్ విమానాశ్రయం .

అశోక్ నగర్ రాష్ట్ర రహదారి 20 పై ఉంది.రాష్ట్ర రహదారి 19 కూడా పట్టణం నుండి పోతుంది.

అశోక్‌నగర్ ఆగ్రా బొంబాయి జాతీయ రహదారి 3 నుండి 44 కి.మీ దూరంలో ఉంది.

మూలాలు మార్చు