అశోక్ కుమార్ అరోరా

అశోక్ కుమార్ అరోరా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తానేసర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

అశోక్ కుమార్ అరోరా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
నియోజకవర్గం తానేసర్
పదవీ కాలం
2009 – 2014
తరువాత సుభాష్ సుధ
నియోజకవర్గం తానేసర్
పదవీ కాలం
1996 – 2005
తరువాత రమేష్ గుప్తా
నియోజకవర్గం తానేసర్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్

రాజకీయ జీవితం

మార్చు

అశోక్ కుమార్ అరోరా జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1991లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో తానేసర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రామ్ ప్రకాష్ చేతిలో 6,013 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1996 సమతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి రమేష్ కుమార్ పై 4,975 ఓట్ల మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

అశోక్ కుమార్ అరోరా 2000లో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి శశి సైనీపై 13,801 ఓట్ల మెజారిటీ గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2005లో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ చేతిలో 14,786 ఓట్ల తేడాతోఓడిపోయి, 2009లో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ గుప్తాపై 8,285 ఓట్ల మెజారిటీ గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

అశోక్ కుమార్ అరోరా 2014లో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ సుధ చేతిలో 25,638 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ సుధ చేతిలో 842 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. అశోక్ అరోరా 2024 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ సుధపై 3,243 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. Financialexpress (18 October 2019). "Haryana Assembly election 2019: Tough poll battle on cards for BJP in Thanesar after Ashok Arora joins Congress" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
  2. Jagran (28 July 2018). "अशोक अराेड़ा सातवीं बार बने इनेलो के प्रदेश प्रधान, पार्टी ने संविधान बदला -". Retrieved 26 October 2024.
  3. The Times of India (8 October 2024). "Congress wins Pehowa, Thanesar, Shahabad in Kurukshetra, BJP snatches Ladwa with CM face Saini". Retrieved 26 October 2024.
  4. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  5. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  6. The Times of India (8 October 2024). "Congress wins Pehowa, Thanesar, Shahabad in Kurukshetra, BJP snatches Ladwa with CM face Saini". Retrieved 26 October 2024.
  7. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.