అశ్వారావుపేట మండలం

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం

అశ్వారావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం అశ్వారావుపేట

అశ్వారావుపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వారావుపేట స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వారావుపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°14′28″N 81°6′38″E / 17.24111°N 81.11056°E / 17.24111; 81.11056
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం అశ్వారావుపేట
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 582 km² (224.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 59,652
 - పురుషులు 29,963
 - స్త్రీలు 29,689
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.06%
 - పురుషులు 56.94%
 - స్త్రీలు 45.10%
పిన్‌కోడ్ 507301

గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 59,652 - పురుషులు 29,963 - స్త్రీలు 29,689.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 582 చ.కి.మీ. కాగా, జనాభా 59,652. జనాభాలో పురుషులు 29,963 కాగా, స్త్రీల సంఖ్య 29,689. మండలంలో 15,775 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.సవరించు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అశ్వారావుపేట మండలం ఖమ్మం జిల్లా నుండి (1+19) ఇరువై గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. తిరుమలకుంట
 2. నందిపాడు
 3. గుమ్మదవల్లి
 4. బచువారిగూడెం
 5. కావిడిగుండ్ల
 6. కన్నైగూడెం
 7. అనంతారం
 8. నారాయణపురం
 9. ఖమ్మంపాడు
 10. గుంటిమడుగు
 11. ఆసుపాక
 12. రామన్నగూడెం
 13. వేదాంతపురం
 14. జమ్మిగూడెం
 15. మద్దికొండ
 16. అచ్యుతాపురం
 17. నారమువారిగూడెం
 18. అశ్వారావుపేట
 19. దురదపాడు

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
 4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.

వెలుపలి లంకెలుసవరించు