కొత్తగూడెం రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం

కొత్తగూడెం రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 15 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కొత్తగూడెం పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం, కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

కొత్తగూడెం రెవెన్యూ డివిజను
జిల్లా కలెక్టరేట్
జిల్లా కలెక్టరేట్
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాభద్రాద్రి కొత్తగూడెం

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన మార్చు

కొత్తగూడెం డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం కొత్తగూడెం రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 కొత్తగూడెం మండలం 2 రెవెన్యూ గ్రామాలు
2 పాల్వంచ మండలం 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
3 టేకులపల్లి మండలం 6 రెవెన్యూ గ్రామాలు
4 ఇల్లెందు మండలం 7 రెవెన్యూ గ్రామాలు
5 చండ్రుగొండ మండలం 10 రెవెన్యూ గ్రామాలు
6 అశ్వారావుపేట మండలం 20 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
7 ములకలపల్లి మండలం 14 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
8 దమ్మపేట మండలం 22 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
9 గుండాల మండలం 13 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
10 జూలురుపాడు మండలం 8 రెవెన్యూ గ్రామాలు
11 సుజాతనగర్ మండలం 6 రెవెన్యూ గ్రామాలు
12 చుంచుపల్లి మండలం 4 రెవెన్యూ గ్రామాలు
13 లక్ష్మిదేవిపల్లి మండలం 9 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
14 ఆళ్లపల్లి మండలం 8 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
15 అన్నపురెడ్డిపల్లి మండలం 10 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-06-28.
  3. "ABOUT DISTRICT | BHADRADRI KOTHAGUDEM DISTRICT | India". Archived from the original on 2022-01-30. Retrieved 2022-06-28.
  4. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-06-28. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)