అషిమా నర్వాల్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్-2015 & మిస్ ఇండియా గ్లోబల్-2015 టైటిల్స్ ను గెలిచింది. అషిమా 2018లో తెలుగులో వచ్చిన నాటకం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించింది.[1]

అషిమా నర్వాల్
జననం15 సెప్టెంబర్ 1995
పౌరసత్వంఆస్ట్రేలియా
విద్యనర్సింగ్
విద్యాసంస్థసిడ్నీ యూనివర్సిటీ
వృత్తి
  • మోడల్
  • సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం

జననం, విద్యాభాస్యం

మార్చు

అషిమా నర్వాల్ 1995 సెప్టెంబరు 15లో హర్యానాలోని జాట్ కుటుంబంలో పుట్టింది. ఆమె పదవ తరగతివరకు హర్యానాలోని రోహతక్ లో పూర్తి చేసి, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో నర్సింగ్ పూర్తి చేసి అక్కడే కొన్నిరోజులు పనిచేసింది.

సినీ జీవితం

మార్చు

అషిమా నర్వాల్ ఫ్యాషన్ రంగంపై ఇష్టంతో ఆమె కొన్నాళ్ళు మోడల్ గా చేసి 2018లో తెలుగులో వచ్చిన నాటకం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[2]

నటించిన సినిమాలు

మార్చు
Key
Denotes films that have not yet been released
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2018 నాటకం పార్వతి తెలుగు తొలి సినిమా
2019 జెస్సీ జెస్సీ
కోలైగరన్ \ కిల్లర్ (తెలుగు) ధరణి,
ఆరాధనా
తమిళ్
2021 రాజ భీమ తులసి తమిళ్ [3]
2022 సకల గుణాభి రామ తెలుగు
2025 ఒక పథకం ప్రకారం తెలుగు

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర(లు) భాష లభ్యత గమనికలు
2021 పిట్టకథలు ఇందు తెలుగు నెట్‌ఫ్లిక్స్ సెగ్మెంట్ కింద పింకీ

మూలాలు

మార్చు
  1. The Times of India (11 November 2019). "Ashima has a rejuvenating holiday in Goa - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 మార్చి 2020. Retrieved 5 June 2021.
  2. The Times of India (14 October 2020). "Video Talk: Ashima Narwal mouths Balakrishna's Trouble dialogue to perfection - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
  3. The New Indian Express (23 September 2018). "Ashima Narwal to play the lead in Arav-starrer Rajabheema". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.