కిల్లర్ (2019) సినిమా

కిల్లర్ 2019లో తెలుగులో విడుదలైన థ్లిలర్‌ సినిమా. పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్ పై టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో ‘కొలైగార‌న్’ పేరుతో విడుదలైంది. అర్జున్, విజయ్ ఆంటోనీ, ఆశిమా నర్వాల్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 జూన్ 2019న విడుదలైంది.[1][2]

కిల్లర్
దర్శకత్వంఆండ్రూ లూయిస్
రచనఆండ్రూ లూయిస్
నిర్మాతటి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
తారాగణంవిజయ్ ఆంటోనీ
అర్జున్
అషిమా నర్వాల్
నాజర్
సీత
ఛాయాగ్రహణంమాక్స్
కూర్పురిచర్డ్ కెవిన్
సంగీతంసైమన్ కె. కింగ్
నిర్మాణ
సంస్థ
పారిజాత మూవీ క్రియేషన్స్‌
విడుదల తేదీ
7 జూన్ 2019 (2019-06-07)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ లో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. హత్యకు గురైన వ్యక్తి మంత్రి సత్యానంద్ కొడుకు వంశీ అని పోలీసులు కనుగొంటారు . ఆ హత్యని సీరియస్ గా తీసుకొని ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి కేసుని విచారణ చేపడుతాడు డీసీపి కార్తికేయ (అర్జున్). ఈ కేసులో డీసీపి కార్తికేయ జయతి (అషిమా నర్వాల్) ఆమె తల్లి(సీత) అనుమానించి వారిని అరెస్ట్ చేసే క్రమంలో ఆ హత్య చేసింది తనేనని, చేసింది జయతి కోసమే అని పోలీసులకు లొంగిపోతాడు ప్రభాకర్ (విజయ్ ఆంటొని). ఇంతకీ ప్రభాకర్ ఎవరు ? అతనికి జయతికి సంబంధం ఏమిటి ? జయతి కోసం ప్రభాకర్ హత్య ఎందుకు చేశాడు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్‌
  • నిర్మాత: టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆండ్రూ లూయిస్
  • సంగీతం: సైమన్ కె. కింగ్
  • సినిమాటోగ్రఫీ:మాక్స్
  • ఎడిటర్: రిచర్డ్ కెవిన్
  • మాటలు, పాటలు: భాష్యశ్రీ

మూలాలు

మార్చు
  1. The Times of India (7 June 2019). "Killer Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
  2. Sakshi (15 June 2019). "కిల్లర్‌ రియల్‌ సక్సెస్‌". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
  3. Zee News Telugu (7 June 2019). "'కిల్లర్' హిట్టా ఫట్టా..మూవీ రివ్యూ కోసం". Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.
  4. The Hans India (6 June 2019). "I am playing a serial killer, says Vijay Antony" (in ఇంగ్లీష్). Archived from the original on 9 September 2021. Retrieved 9 September 2021.