నాటకం 2018లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శాంక్ చక్ర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీ సాయిదీప్‌ చాట్ల, రాధికా శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆశీష్‌ గాంధీ, అషిమా నర్వాల్ హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా 2018, సెప్టెంబర్ 28న విడుదలైంది.[1][2]

నాటకం
దర్శకత్వంకళ్యాణ్‌జీ గోగన
రచనకళ్యాణ్‌జీ గోగన
స్క్రీన్ ప్లేకళ్యాణ్‌జీ గోగన
కథకళ్యాణ్‌జీ గోగన
నిర్మాత
 • రాధికా శ్రీనివాస్‌
 • శ్రీ సాయిదీప్‌ చాట్ల
 • ప్రవీణ్‌ గాంధీ
 • ఉమ కూచిపూడి
తారాగణం
ఛాయాగ్రహణంఅంజి
కూర్పుతెల్లగూటి మణికాంత్
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
శాంక్ చక్ర క్రియేషన్స్
పంపిణీదార్లురిజ్వాన్ ఎంటర్టైన్మెంట్
శాంక్ చక్ర క్రియేషన్స్
విడుదల తేదీ
28 సెప్టెంబరు 2018 (2018-09-28)
సినిమా నిడివి
139 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చింతలపూడి ఊరులో ఖాళీగా తిరిగే కుర్రాడు బాల‌ కోటేశ్వ‌ర‌రావు (ఆశీష్ గాంధీ) పార్వతి(అషిమా నర్వాల్‌)ని చూసి ఇష్టపడతాడు. పార్వతి కూడా కోటిని ప్రేమిస్తుంది. ప్రేమలో ఎదురయ్యే కొన్ని పరిస్థితుల కారణంగా కోటి, పార్వతిని వివాహం చేసుకుంటాడు. పెళ్లి అయ్యాక పార్వతి గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు పార్వతి ఎవరు? ఆమె అసలు ఆమె గతం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కల్యాణ్‌జీ గోగన
 • నిర్మాతలు: శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ఉమ కూచిపూడి, ప్రవీణ్‌ గాంధీ
 • సంగీతం: సాయి కార్తీక్
 • సినిమాటోగ్రఫర్: గరుడ వేగ అంజి
 • ఎడిటింగ్: తెల్లగూటి మణికాంత్

మూలాలు

మార్చు
 1. The Hans India (24 September 2018). "Natakam a village-centric entertainer". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
 2. "'Natakam' to release on September 28". Telangana Today.
 3. The Times of India (28 September 2018). "Natakam Movie Review {1/5/5}: A pointless ride". Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 4 అక్టోబరు 2018 suggested (help)