అస్గర్ అలీ

భారత మాజీ క్రికెటర్.

సయ్యద్ అస్గర్ అలీ (11 జూన్ 1924 - 19 ఏప్రిల్ 1979) తెలంగాణకు చెందిన భారత మాజీ క్రికెటర్. 1943 నుండి 1949 వరకు భారతదేశం తరపున, 1949 నుండి 1957 వరకు పాకిస్తాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

అస్గర్ అలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయ్యద్ అస్గర్ అలీ
పుట్టిన తేదీ(1924-06-11)1924 జూన్ 11
హైదరాబాదు, తెలంగాణ
మరణించిన తేదీ1979 ఏప్రిల్ 19(1979-04-19) (వయసు 54)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1942-43 to 1948-49హైదరాబాదు క్రికెట్ జట్టు
1953-54 to 1956-57కరాచీ క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్
మ్యాచ్‌లు 32
చేసిన పరుగులు 1355
బ్యాటింగు సగటు 28.22
100లు/50లు 1/8
అత్యుత్తమ స్కోరు 103 *
వేసిన బంతులు 24
వికెట్లు 1
బౌలింగు సగటు 12.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/3
క్యాచ్‌లు/స్టంపింగులు 15/–
మూలం: క్రిక్ ఇన్ఫో, 17 జనవరి 2018

అలీ 1924, జూన్ 11న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

భారతదేశం తరపున

మార్చు

1947-48 రంజీ ట్రోఫీలో హైదరాబాదు జట్టు - ప్రావిన్స్ అండ్ బెరార్‌ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో మొత్తం 182 పరుగులలో అస్గర్ అలీ 103 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంకెవ్వరూ 50 పరుగులకి చేరువకాలేదు.[1]

పాకిస్తాన్ తరపున

మార్చు

1949-50లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు - టూరింగ్ సిలోన్ జట్టు మధ్య రెండు మ్యాచ్‌లు ఆడాడు.1952-53లో భారతదేశంలో పర్యటించిన పాకిస్తాన్ జట్టులో 12వ ఆటగాడిగా వచ్చాడు. ఒక దశలో భారతదేశానికి తీసుకురాబడ్డాడు, కానీ దేశం తరపున మ్యాచ్ లు ఆడలేదు.[2]

అలీ 1979, ఏప్రిల్ 19న పాక్తిస్తాన్ లోని కరాచీలో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Central Provinces and Berar v Hyderabad 1947-48". CricketArchive. Archived from the original on 2021-07-24. Retrieved 2021-07-24.
  2. "పాకిస్తాన్ to India 1952-53". Test Cricket Tours. Archived from the original on మే 25 2019. Retrieved 2021-07-24. {{cite web}}: Check date values in: |archive-date= (help)

బయటి లింకులు

మార్చు