ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 మహమ్మారి

(ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ వ్యాప్తి 2020 నుండి దారిమార్పు చెందింది)

చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్ 19) తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదనట్టు అధికారులు ప్రకటించారు.ఇటలీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తిరుపతి వైరాలజీ ల్యాబులో జరిగిన పరీక్షల్లో ధ్రువీకరించారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి
Map of districts with confirmed cases (as of 30 April)
  100+ confirmed cases
  50-99 confirmed cases
  10–49 confirmed cases
  1–9 confirmed cases
వ్యాధికోవిడ్ -19
వైరస్ స్ట్రెయిన్SARS-COV-2
ప్రదేశంఆంధ్రప్రదేశ్
మొదటి కేసునెల్లూరు
ప్రవేశించిన తేదీ12 మార్చి 2020
(4 సంవత్సరాలు, 1 నెల , 1 వారం)
మూల స్థానంచైనా
కేసులు నిర్ధారించబడిందిNegative increase 150,209 As of 1 ఆగస్టు 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]
బాగైనవారు76,614 As of 1 ఆగస్టు 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]
క్రియాశీలక బాధితులుNegative increase72,188 As of 1 ఆగస్టు 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]
మరణాలు
Negative increase1,407 As of 1 ఆగస్టు 2020[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]]

పాజిటివ్ కేసులు మార్చు

రాష్ట్ర ప్రభుత్వ చర్యలు మార్చు

  • కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి గ్రామ వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించింది.
  • విశాఖలో పాజిటివ్ కేసు వచ్చిన చోట, ఆ ఇంటి నుంచి ౩ కిమీ వరకూ చర్యలు తీసుకున్నారు. 335 బృందాలు 25,950 ఇళ్లు సర్వే చేశాయి. ఆ ప్రాంతంలో మరెవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు. నెల్లూరు, ప్రకాశంలో జిల్లాలో పాజిటివ్ కేసుల నివాస స్థలం నుంచి ౩ కిమీ పరిధిలో సర్వే పూర్తి చేసి, అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచారు.
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల క్వారంటైన్ సౌకర్యం ఏర్పాటు చేశారు.ప్రతి జిల్లా కేంద్రంలో 200 నుంచి 300 వందల పడకల కరోనా వైద్య చికిత్స ఏర్పాటు చేశారు.
  • నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
  • మార్చి 29 నాటికి రేషన్‌ సరుకులు,కేజీ పప్పు ప రేషన్‌ సరుకును ఉచితంగా పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్‌ 4న ₹1000 గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు.
  • కరోనా బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 474 క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో 46,872 పడకలను సిద్ధం చేసింది.ఇప్పటికే, దాదాపు 24,537 మందిని ఈ కేంద్రాలలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
  • 2020 ఏప్రిల్ 27 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి టీవీలో మాట్లాడుతూ, ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనాను పూర్తిగా కట్టడి చేయలేమనీ, రాబోయే రోజుల్లో మనమంతా దానితో కలసి జీవించాల్సిన పరిస్థితే ఉంటుందనీ అన్నాడు. కోవిడ్‌ కూడా జ్వరం లాంటిదేనని, వచ్చినప్పుడు కాస్త మందులు వేసుకుని, కొంచెం జాగ్రత్తగా ఉంటే నయమైపోతుందనీ ముఖ్యమంత్రి చెప్పాడు.[1][2]

సహాయ కేంద్రాలు మార్చు

  • కేంద్రీయ సహాయత ఫోన్ నంబర్ (Toll free) 1075+91-11-23978043
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయ ఫోన్ నంబర్ 0866-2410978

లాక్ డౌన్ మార్చు

మార్చి 23: న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈనెల 31వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు.నిత్యావసర వస్తువులు అందరికి అందుబాటులోనే ఉంటాయని, ఏ వస్తువు ఎంతకు అమ్మాలి అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.[3]

మినహాయింపు మార్చు

  • పోలీసు
  • వైద్య
  • స్థానిక సంస్థలు
  • అగ్నిమాపక సిబ్బంది
  • మీడియా
  • నిత్యావసరాల సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో జోన్ల జాబితా మార్చు

ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాలు రెడ్ జోన్ లో, 7 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో, 1 జిల్లా గ్రీన్ జోన్ లో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

  రెడ్‌జోన్‌
  • రెడ్‌జోన్‌ జిల్లాలు : కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు
  ‌ఆరెంజ్‌ జోన్
  • ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ
  ‌గ్రీన్ జోన్
  • గ్రీన్‌ జోన్‌ జిల్లా: విజయనగరం
  • గమనిక: 2020 మే 1 న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం.

విద్యా వ్యవస్థపై ప్రభావం మార్చు

  • మార్చి 24:కరోనా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలు రెండు వారాల పాటు వాయిదా వేశారు. [4]అలాగే ఐసెట్‌,ఎంసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువుతేదీని పొడిగించారు.
  • మర్చి 26:కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశాలు జారీ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా మార్చు

కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు.[5]

దేవాలయాలు మూసివేత మార్చు

తెలుగు రాష్ట్రాలతో కరోనా ప్రభావం వల్ల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం 31 వరకు మూసివేశారు.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఏకాంతంగా శ్రీవారి సేవలు నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

ప్రజల్లో అపోహలు మార్చు

  • కరోనా కాకపోయినా దాని లక్షణాలైన దగ్గు, జ్వరం లాంటివి ఉన్నపుడు, అలాంటి వారిని నిర్ధారణ కోసం తీసుకెళ్ళినా ఆ ప్రాంతాల్లో వ్యాధి వ్యాపించినట్టుగా అలజడి రేగి ప్రజలు భయబ్రాంతులు చెందటం జరుగుతున్నది.
  • మాంసం తినడం వలన కరోనా వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతున్నది.[6]

ఇంకా చదవండి మార్చు

మరింతగా తెలుసుకునేందుకు మార్చు

కరోనా వైరస్, కోవిడ్-19 ల గురించి ఐక్యరాజ్యసమితి వారి ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ వెబ్‌సైటులో ఉంచిన వివరాలు చూడండి.

మూలాలు మార్చు

  1. "కరోనాతో కలిసి జీవించాల్సిందే". www.eenadu.net. Archived from the original on 2020-04-29. Retrieved 2020-04-29.
  2. "Sakshi Telugu Daily Andhra Pradesh epaper dated Tue, 28 Apr 20". epaper.sakshi.com. Archived from the original on 2020-04-29. Retrieved 2020-04-29.
  3. "Coronavirus update: Andhra Pradesh govt orders lockdown". Livemint (in ఇంగ్లీష్). 2020-03-23. Retrieved 2020-03-26.
  4. DelhiMarch 24, India Today Web Desk New; March 24, 2020UPDATED:; Ist, 2020 14:11. "Coronavirus Outbreak: AP SSC Board Exam 2020 postponed". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-03-26. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  5. "ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా". Sakshi. 2020-03-15. Retrieved 2020-03-26.
  6. శంకర్, వి (2020-02-19). "మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు". BBC News తెలుగు. Retrieved 2020-03-26.