ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం

సర్వోత్తమ భవనం అనేది గ్రంథాలయ ఉద్యమానికి కేంద్రం. తరువాత దీనిని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మార్చారు. ప్రభుత్వ పరంగా నడుస్తున్న శాఖా గ్రంథాలయాలకు కేంద్రంగా ఈ సర్వీత్తమ భవనం ఉంది. ఇది విజయవాడ తూర్పుప్రాంతంలో మచిలీపట్నం మార్గంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం
స్థాపనఏప్రిల్ 10, 1914; 109 సంవత్సరాల క్రితం (1914-04-10)
రకంసేవా సంస్థ
కేంద్రీకరణగ్రంథాలయాల విస్తరణ, గ్రంథపఠణంపై ఆశక్తులు కలిగించడం
ప్రధాన
కార్యాలయాలు
విజయవాడ, అంధ్రప్రదేశ్
కార్యస్థానం
  • విజయవాడ
సేవాఆంధ్రప్రదేశ్, భారతదేశం
అధికారిక భాషతెలుగు
అద్యక్షులు, జనరల్ సెక్రటరీకాళ్ళకూరి (రావి) శారద

ఉద్యమ పూర్వరంగం మార్చు

గ్రంథాలయాలను ఊరూరా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కొందరు జాతీయవాదులు, స్వతంత్ర సమరయోదులు ఒక ఉద్యమంగా మార్చారు. ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన అయ్యంకి వెంకటరమణయ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా భారత స్వాతంత్ర్య, తెలంగాణా సాయుధ పోరాటం ఉద్యమాలలో భాగం వహించింది.

ఎందరో గ్రంథాలయోద్యమ నేతలు ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారు. కొందరు యువకులు గ్రంథాలయాల ద్వారా పుస్తక విజ్ఞానాన్ని తద్వారా జరుగుతున్న అన్యాయాలను అర్థం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యమాలలో నాయకులుగానూ ఎదిగారు.

సంఘం ఏర్పాటు మార్చు

1914లో ఆంధ్రదేశంలోని గ్రంథాలయాల ఏర్పాటును, నిర్వహణను ప్రోత్సహించేందుకు ఆంధ్రదేశ గ్రంథభాండాగార సంఘం ఏర్పాటుచేశారు. సంఘానికి తొలి అధ్యక్షునిగా మోచర్ల రామచంద్రరావు పంతులు వ్యవహరించారు. కార్యదర్శులుగా అయ్యంకి వెంకటరమణయ్య ఉన్నారు.

భవన ఏర్పాటు మార్చు

కార్యక్రమాలు మార్చు

  1. గ్రంథాలయ వార్షికోత్సవాల నిర్వహణ
  2. గ్రంథాలయాల నిర్వహణ పై శిక్షణ
  3. ఉత్తమ పుస్తకాల ఎంపిక, ప్రచురణ
  4. పిల్లలకు బాల సాహిత్యంపై అవగాహన కార్యక్రమాలు

గ్రంథాలయ భవన చిత్రాలు. మార్చు

మూలాలు మార్చు

  1. . http://www.andhrabhoomi.net/content/utharayanam-335
  1. . http://godaavari.blogspot.com/2015/09/blog-post.html
  1. . https://www.eenadu.net/districts/mainnews/amaravati/701/220016684 Archived 2020-01-28 at the Wayback Machine