ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ లేదా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (Andhra Pradesh Union of Working Journalists or APUWJ) ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ కు అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. ఇది 1957 సంవత్సరంలో స్థాపించబడినది (రిజిస్టర్డ్ నెం. బి-451) .[1] జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, పత్రికా ప్రమాణాలు-విలువల కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది. ఈ సంస్థ 2007 సంవత్సరంలో తమ స్వర్ణోత్సవాలను జరుపుకొన్నది.

చరిత్ర

మార్చు

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని జూబిలీ హాలులో 1957 ఆగస్టు 17 తేదీన ఆవిర్భావ సభ జరిగింది. భారత వర్కింగ్ జర్మలిస్టు ఉద్యమ పితామహుడు, నేషనల్ హెరాల్డ్ సంపాదకుడు అయిన మానికొండ చలపతిరావు ఈ సభను ప్రారంభించారు. ఆనాడు కేవలం 35 మంది సభ్యులతో ఏర్పడిన సంస్థ నేడు 15 వేల మంది సభ్యులతో దేశంలోంనే అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా రూపుదిదుకున్నది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోను, విజయవాడ, విశాఖపట్నం అర్బన్ జిల్లా శాఖలతో కలసి యూనియన్ కు మొత్తం 25 శాఖలున్నాయి.

మొదట రేకుల షెడ్డు నుండి ప్రారంభమైన సంస్థ తమ కోసం హైదరాబాదులో మూడు అంతస్థుల భవనాన్ని నిర్మించుకున్నారు. 1969లో అప్పటి ముఖ్యమంత్ర్రి కాసు బ్రహ్మానందరెడ్డి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసారు. ఆంధ్రపత్రిక, భారతి పత్రిక సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారి స్మృతి చిహ్నంగా యూనియన్ కార్యాలయానికి "దేశోద్ధారక భవన్" అని పేరు పెట్టుకున్నారు. అనేకమంది దాతల, సభ్యుల సహకారం, యూనియన్ నాయకత్వ కృషి ఫలితంగా దేశోద్ధారక భవన్ రూపుదిద్దుకున్నది. ఇందులో సురవరం ప్రతాపరెడ్డి పేరున 200 మంది కూర్చోవడానికి అనువైన ఆడిటోరియం, ప్రెస్ మీట్ల నిర్వహణకు ప్రత్యేకమైన హాలు ఉన్నాయి.

సంఘాన్ని నడిపించిన ప్రధానమైన సారథులు

మార్చు
సంవత్సరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సంవత్సరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు
1957-58 ఎం. చంద్రశేఖర్ జి. రామారావు 1980-81 జి.ఎస్. వరదాచారి జి. రామారావు
1958-59 ఆర్. ఎస్. సంపత్ జి. రామారావు 1981-82 పి. వి. వి. గోపాలస్వామి జి. రామారావు
శ్రీకాంత్ విఠల్
1959-60 టి. వి. కృష్ణ జి. రామారావు 1983-85 బి. నాగేశ్వరరావు కె. పూర్ణచంద్రరావు
1960-61` ఎం. చంద్రశేఖర్ జి. రామారావు 1985-86 జి. ఉపేంద్ర బాబు కె. శ్రీనివాసరెడ్డి
1961-62 ఎం. చంద్రశేఖర్ జి. రామారావు 1987-88 కె. పూర్ణచంద్రరావు కె. శ్రీనివాసరెడ్డి
పి. ఎ. రామారావు
1963-64 ఎం. చంద్రశేఖర్ వి. హనుమంతరావు 1988-90 టి. పి. విఠల్ కె. శ్రీనివాసరెడ్డి
1964-65 బి. నాగేశ్వరరావు జి.ఎస్. వరదాచారి 1990-92 కె. శ్రీనివాసరెడ్డి ఎ. ఆంజనేయులు
1965-66 బి. నాగేశ్వరరావు జి.ఎస్. వరదాచారి 1992-94 కె. శ్రీనివాసరెడ్డి ఎ. ఆంజనేయులు
1966-67 బి. సోమయాజులు బి. నాగేశ్వరరావు 1994-96 ఎ. ఆంజనేయులు ఎస్. నగేష్ కుమార్
డి. కృష్ణారెడ్డి
1967-69 ఎ. వి. శ్రీనివాసన్ కె. వి. యం. డి. శ్రీనివాసరావు 1996-98 ఎన్. దుర్గాప్రసాద్
పి. కరుణాకర్
కె. సత్యనారాయణ
1969-70 వి. హనుమంతరావు కె. వి. యం. డి. శ్రీనివాసరావు 1999-2001 డి. అమర్ కె. సత్యనారాయణ
1970-71 బి. నాగేశ్వరరావు సి. రాఘవాచారి 2002-04 డి. అమర్ ఎ. ఆంజనేయులు
1971-72 బి. నాగేశ్వరరావు పి. ఎస్. సుందరం 2004-06 కె. అమరనాథ్ జి. ఆంజనేయులు
డి. అమర్
1972-73 బి. నాగేశ్వరరావు పి. ఎస్. సుందరం 2007-09 డి. సోమసుందర్ వై. నరేందర్ రెడ్డి
1973-74 వి. జి. బాలకృష్ణ కె. పార్థసారథి 2010-12 డి. సోమసుందర్ వై. నరేందర్ రెడ్డి
1974-76 బి. నాగేశ్వరరావు వై. శేఖర్
1976-77 జి. ఉపేంద్ర బాబు వై. శేఖర్
1977-78 జి. ఉపేంద్ర బాబు ఎ. ప్రభాకరరావు
1978-80 పి. వి. వి. గోపాలస్వామి జి. రామారావు

ప్ర్రతిస్పందన పత్రిక

మార్చు

ప్రతిస్పందన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 1987 నుండి ప్రతినెల వెలువరిస్తున్న పత్రిక. దీనికి శ్రీ. కె. శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన సంపాదకులు. ఈ పత్రిక ద్వారా సంస్థ కార్యకలాపాలను సభ్యులందరికీ తెలియజేస్తారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. పోరాటాలే మన చరిత్ర. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్.

బయటి లింకులు

మార్చు