ప్రెస్ క్లబ్ హైదరాబాద్
ప్రెస్ క్లబ్, హైదరాబాద్ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మీడియా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రెస్ క్లబ్ 1965లో స్థాపించారు.[1] జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ఈ క్లబ్ లో పాత్రికేయులకు సభ్యత్వం ఉంటుంది.
అవతరణ | 1965 |
---|---|
కేంద్రస్థానం | సోమాజిగూడ, హైదరాబాద్, తెలంగాణ |
చరిత్ర
మార్చుహైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఫతే మైదాన్ లో కేటాయించింది. అనంతర పరిణామాల క్రమంలో సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తుండటంతో 1996లో ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేటలో జరిగిన నాటి ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించాలనే జర్నలిస్ట్ సంఘాల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో సోమాజిగూడలోని ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలాన్ని, భవనాన్ని కేటాయించారు.
కార్యకలాపాలు
మార్చుప్రెస్ క్లబ్ కార్యకలాపాలలో ప్రభుత్వానికి మీడియా సంబంధిత కన్సల్టెన్సీ సేవలను అందించడం, సెమినార్లు నిర్వహించడం, అభివృద్ధి, మాస్ మీడియా సంబంధిత సమస్యలపై మీట్-ది-ప్రెస్ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌ల నిర్వహణ, సాంఘిక సేవా కార్యక్రమాలు, పాస్ పోర్ట్ మేళాలు, కోవిడ్ నియంత్రణ, ఉచిత వైద్య శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఎన్నికలు
మార్చుహైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వివిధ ప్యానల్ లుగా ఏర్పడి జర్నలిస్టులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఈ క్లబ్‌లో అన్ని టీవీ చానెల్స్, పత్రికల ఎడిటర్లు, స్టేట్ బ్యూరో రిపోర్టర్లు, సీనియర్ పాత్రికేయులు అందరికీ సభ్యత్వం ఉంటుంది. ప్రెస్‌క్లబ్‌లో దాదాపు 1300 పైగా యాక్టివ్ ఓటర్లు ఉన్నారు.
అధ్యక్షులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ The Hans India (13 November 2015). "Press Club Hyderabad turns 50 this month" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ Sakshi (23 May 2016). "ప్రెస్‌క్లబ్ అధ్యక్షునిగా రాజమౌళి". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ Sakshi (25 June 2018). "ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా విజయకుమార్‌రెడ్డి". Sakshi. Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
- ↑ Sakshi (14 March 2022). "హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా వేణుగోపాలనాయుడు". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.