ఆంధ్రప్రదేశ్ - మద్రాసు సరిహద్దు మార్పు చట్టం

ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రాల సరిహద్దుల మార్పు చట్టం, 1959, భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 నిబంధనల ప్రకారం భారత పార్లమెంటు ఆమోదించింది, ఇది 1960 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని తిరుత్తణి తాలూకా మరియు పల్లిపట్టు ఉప-తాలూకా మద్రాసు రాష్ట్రానికి బదిలీ చేయబడ్డాయి. బదులుగా చెంగల్పట్టు, సేలం జిల్లాల నుండి భూభాగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేశారు.[1][2]

చిత్తూరు జిల్లాలోని మూడు వేర్వేరు తాలూకా నుండి మొత్తం 319 గ్రామాలతో పాటు ఒక చిన్న అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు రాష్ట్రానికి తరలించబడ్డాయి. దీనికి బదులుగా చెంగల్పట్టు జిల్లాలోని 148 గ్రామాలు, సేలం జిల్లా నుండి మూడు గ్రామాలు, కొన్ని అటవీ ప్రాంతాలతో పాటు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ కు తరలించారు.

ఈ భూభాగాల మార్పిడి ద్వారా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, మద్రాసులోని చెంగల్పట్టు, తిరువళ్ళూర్ పార్లమెంటరీ నియోజకవర్గాలు గణనీయంగా మార్చబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుత్తణి, రామకృష్ణరాజపేట శాసనసభ నియోజకవర్గాలలోని ఎక్కువ శాతం భూభాగాన్ని, చిన్న ప్రాంతానికి బదులుగా మద్రాసుకు బదిలీ చేయడంతో, ఈ రెండు నియోజకవర్గాలు (తిరుత్తణి ద్విసభ్య నియోజకవర్గం, రామకృష్ణరాజపేట ఏకసభ్య నియోజకవర్గం) బదులుగా సత్యవేడు అనే ద్విసభ్య శాసనసభ నియోజకవర్గంతో భర్తీ చేయబడ్డాయి. పర్యవసానంగా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం స్థానాల సంఖ్య 301 నుండి 300కి తగ్గింది. దీనితో మద్రాసు శాసనసభ ఒక అధిక స్థానాన్ని పొంది, మొత్తం స్థానాల సంఖ్య 205 నుండి 206 కి పెరిగింది. తిరుత్తణి శాసనసభ నియోజకవర్గం తిరిగి మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. అంతే కాకుండా, పొన్నేరి, గుమ్మడిపూండి, తిరువళ్ళూర్ శాసనసభ నియోజకవర్గాల పరిధి, సరిహద్దులు గణనీయంగా మార్చబడ్డాయి.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Government of Tamil Nadu — Tamil Nadu Secretariat — Brief History Archived 2007-01-06 at Archive.today
  2. Historical Importance of Kanchipuram Archived 18 మే 2006 at the Wayback Machine
  3. "Election Commission of India - Report on the Third General Elections in India, 1962" (PDF). Archived from the original (PDF) on 30 September 2007. Retrieved 2 June 2006.