ఆంధ్ర నాట్యం (పుస్తకం)

అరుదైన, అపురూపమైన పరిశోధన గ్రంథాల్లో నటరాజ రామకృష్ణ రచించిన ఆంధ్ర నాట్యం ఒకటి. దేవాలయాల్లో, రాజాస్థానాల్లో శతాబ్దాలకు పూర్వం సాగిన నాట్యాన్ని ఈ పరిశోధన ద్వారానే నటరాజ రామకృష్ణ ప్రాణం పోసి ప్రజల ముందుకు తీసుకువచ్చారు. వివిధ ఆలయాలు, చారిత్రిక అవశేషాల్లో నాట్య విగ్రహాల్లో ఉన్న భంగిమలను ఆధారం చేసుకుని, లక్షణాలు రచించి స్వయంగా నేర్చి తుదకు పలువురు ఔత్సాహికులకు నేర్పారు. ఈ గ్రంథంలో ఆ పరిశోధన ఫలాలు దొరుకుతాయి.

రామకృష్ణ ఆంధ్ర నాట్యం రచనలో అనేక అంశాలను వెలుగు లోకి తీసుకు వచ్చాడు. గిరిజన, జానపద నృత్యాలు లో పగటి వేషాలు, పగటి వేషగాళ్ళు (బహురూపులు), జంగమ దేవర వేషం, మాయల ఫకీరు, భట్టి విక్రమార్క, మొదలైన వేషాల గురించి వర్ణించాడు. విప్రవినోధులు, సాధన శూరులు, సయ్యం వారు - ఇంద్రజాల మహేంద్ర జాలాలతో అలరించే వారని విశదపరిచాడు. దొమ్మరిసాని గెడ ఎక్కి గిర గిరా తిరుగుతూ చేతినున్న వేప కొమ్మ విసిరితే, అది పడిన దిక్కున పంటలు బాగా పండుతాయి అన్న అంశాన్ని వెలికి తీసారు. అందు వల్ల పల్లెలలో వీరిని ఆదరిస్తారు అని వ్రాశాడు. గారడీ విద్య తూర్పు గోదావరి జిల్లా జానపద కళారూపం. మైదానం లో భేరి మోగిస్తూ, లయ ప్రకారం చేస్తున్న అందెల మోత మైలు దూరం వరకూ వినిపిస్తాయి అని విశ్లేషించాడు.

ఉరుములు (అనంతపురం ప్రాంత నృత్యం), గురువయ్యలు, జముకులవారు, కడ్డీ వాయిద్యం, పులి వేషం, బుర్ర కథ దళాలు, గొబ్బి, సప్తతాళ భజన, బతకమ్మ, గుసాడీ నర్తనం, కోలాటం, చిరుతల రామాయణం, జోగు ఆట, ఉగ్గు గొల్లలు, కీలు గుర్రాలు, తప్పెట గుళ్ళు, డప్పుల నాట్యం, తోలు బొమ్మలాట, కీలు బొమ్మలు, గరగలు, సవరలు, గొండు, కోయ వివరాలను ఆంధ్ర నాట్యం రచనలో పొందుపరిచాడు. [1]

మూలాలు మార్చు

  1. ఈరంకి, వెంకట కామేశ్వర్. "తెలుగు తేజోమూర్తులు". www.siliconandhra.org. siliconandhra. Retrieved 16 June 2016.