ఆంధ్రనాట్యం చాలా ప్రాచీనమయిన నృత్య రీతి. ఈ నృత్యం బౌద్ధ కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇది గుడిలో దేవాంగనలు ఆడే నృత్యంగా మొదలయి ఒక పూర్తి స్థాయి నృత్యశాస్త్రంగా వికసించింది.

చరిత్ర

మార్చు

ఆంధ్రనాట ఎంతో కాలం ప్రాచుర్యంలో ఉన్న ఈ నాట్యం దేవాలయాలకే కాక ఉత్సవాలలో కూడా ప్రదర్శించబడేది. 3000 యేళ్ళ క్రితం ఈ నాట్యాన్ని సామాజిక, ఆర్థిక కారణాల వల్ల నిలిపివేశారు. కానీ 50 యేళ్ళ క్రితం ఆంధ్రనాట్యమని నామకరణం చేసి కొందరు ఔత్సాహికులు ఈ నాట్యాన్ని పునరుద్ధరించారు. వీరిలో డా॥ నటరాజ రామకృష్ణ ప్రముఖులు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ నాట్యాన్ని పూర్తి స్థాయి నృత్య సాంప్రదాయంగా ప్రవేశపెట్టారు. ఆంధ్రనాట్యం అని నామకరణ చేయక ముందు ఈ నృత్యాన్ని వ్యవహారంలో కచేరీ, కేళిక దర్బారు, మేజువాణి మొ॥పేర్లతో పిలిచేవారు. నృత్యం, ఇంకా అభినయం, రెండూ ఈ ప్రాచీన నృత్యంలో కనిపిస్తాయి.

సాధారణంగా నృత్యరీతులను రెండు విభాగాలుగా చూడొచ్చు

  1. నాట్యమేళం - ఇది మగవారు మాత్రమే చేసేది (అభినయించే పాత్రలు పురుషులవే ఉంటాయి)
  1. నట్టువమేళం - ఇది స్త్రీలు ఒంటరిగా చేసేది.

భరతనాట్యం, మోహినియాట్టం, ఒడిస్సీ మొదలగునవి నట్టువమేళం సాంప్రదాయానికి చెందినవి. కథకళి, యక్షగానం నాట్యమేళానికి సంబంధించినవి. కూచిపూడి కూడా కొంత వరకూ నాట్యమేళానికి సంబంధించినదిగానే కనిపిస్తుంది. నట్టువ మేళం శైలి ప్రధానంగా ఆడవారు చేసేది - ఇదే కాలక్రమంలో ఆంధ్రనాట్యంగా పరిణమించింది.

ఈ నృత్యం మూడు విధాలుగా అభివృద్ధి చెందింది:

  1. ఆరాధన నృత్యం- షోడశోపచార పూజలో ఒక ఉపచారం నృత్యం కూడా! దేవాలయాలలో పూజా సమయాలలో నర్తకి ఒక నిర్దిష్ట స్థానం నుండి ఆరాధ్య దేవతనుద్దేశించి నృత్యం చేయటం ఈ ఆరాధన నృత్యంలో భాగం.
  2. ఆస్థాన నృత్యం - రాజనర్తకులూ, ఆస్థాన నర్తకులూ సాహిత్యం, కవిత్వం, రాజనీతిశాస్త్రం, ఇంకా సాంప్రదాయ సంగీత నృత్యాలలో ఆరితేరే వారు. పండితులు, కవులు, రాజపూజ్యులు, అతిథులు అందరూ పరీక్షించి, యుక్తితో నృత్యం చేయించే వారు. ఆయా వ్యక్తులను రంజింపచేసేందుకు ఈ నర్తకులు నిత్యం సిద్ధంగా ఉండేవారు. రాజులంతరించడంతో ఈ నృత్య రీతి కనుమరుగయినా, ఆ నర్తకుల కుటుంబాలు చాలా వరకూ ఈ శైలిని భద్రపరుచుకుంటూ వచ్చారు.
  3. ప్రబంధ నృత్యం - ఇవి సాధారణ జనం మధ్య ప్రదర్శించేందుకు రూపొందించబడినవి. ఆరాధన, ఆస్థాన శైలిలతో పోల్చితే, ఇది జన సాధారణానికి సులువుగా అర్ధమయ్యే రీతిలో చేయబడేవి. సామాజిక స్థితిగతులు-సమస్యలు వంటి విషయాలపై ఈ నృత్య రీతి అంశాలు ఆధారపది ఉండేవి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి భామా కలాపం, గొల్ల కలాపం. భామా కలపాన్నే నవ జనార్ధన పారిజాతం అని కూడా వ్యవహరిస్తారు.

ఆంధ్ర నాట్య కళాకారులు:

మార్చు

వెలుపలి లింకులు

మార్చు