ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కళాశాల

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల (Andhra University Vollege of Pharmaceutical Sciences) 1951లో స్థాపించబడిన ఆంధ్రా యూనివర్శిటీ లోని అంతర్గత కళాశాల.

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాల
రకంకాలేజీ
స్థాపితం1951
ప్రధానాధ్యాపకుడుప్రొ.ఎన్ రాజేంద్ర ప్రసాద్
స్థానంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాలగూడుhttp://www.andhrauniversity.info/pharmacy/

చరిత్ర మార్చు

కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ 1951లో బి.ఫార్మ్ కోర్సుతో ప్రత్యేక విభాగంగా ఏర్పడింది. దివంగత ప్రొఫెసర్. ఎస్. రంగస్వామి ఈ శాఖకు వ్యవస్థాపక అధిపతి. 1930లలో యూనివర్శిటీ స్థాయిలో ఫార్మసీ కోర్సులను ప్రారంభించి, ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశంలోనే రెండో సంస్థగా నిలిచింది. ఫార్మసీ కోర్సులు B.Sc లో భాగంగా ఉండేవి. ఆనర్స్ డిగ్రీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, M.Scలో స్పెషలైజేషన్‌గా ఉండేవి. ఎమ్.ఫార్మ్ కోర్సు 1954లో ప్రారంభమైంది. 1975లో ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌ను ప్రత్యేక ఫ్యాకల్టీగా ఏర్పరచారు,


ఈ శాఖ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అండ్ ఫుడ్ అనాలిసిస్, ఫార్మకాలజీ, ఫార్మాకాగ్నోసీ అండ్ ఫైటోకెమిస్ట్రీలో బి.ఫార్మ్ కోర్సుతో పాటు, పోస్ట్ గ్రాడ్యుయేట్, Ph.D. ప్రోగ్రామ్‌లు కూడా అందిస్తోంది. దేశంలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ విభాగాన్ని ప్రారంభించిన మొదటి విభాగం ఇది. శాఖ వ్యవస్థాపక అధ్యాపకులు - ప్రొఫెసర్ ఎస్.రంగస్వామి, ప్రొఫెసర్ వి.సుబ్బారావు, ప్రొఫెసర్ ఎన్.విశ్వనాధం, ప్రొఫెసర్ కె.సాంబమూర్తి, ప్రొఫెసర్ ఇ.వెంకటరావు.

గతంలో విభాగాధిపతులుగా పనిచేసిన ఉపాధ్యాయులు, పరిశోధకులు దివంగత ప్రొఫెసర్ ఎస్. రంగస్వామి (1951–1963), దివంగత ప్రొఫెసర్ వి. సుబ్బారావు (1963–1979), ప్రొఫెసర్ ఎన్. విశ్వనాధం (1979–1982), దివంగత ప్రొఫెసర్ కె. సాంబమూర్తి (1982–1985), ప్రొఫెసర్ ఇ. వెంకటరావు (1985–1988), ప్రొఫెసర్ డి.విశ్వేశ్వరం (1988–1991), ప్రొఫెసర్ ఆర్వీ కృష్ణారావు (1991–1992), ప్రొఫెసర్ ఎం. విమలా దేవి (1993-1995), ప్రొ. డి. వెంకటరావు (1996-1998), ప్రొఫెసర్. పి. ఎల్లయ్య (1999-2001), ప్రొఫెసర్. కె.పి.ఆర్. చౌదరి (2002-2005).

2023లో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ఇచ్చిన ఫార్మసీ ర్యాంకింగుల్లో ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు 22వ స్థానం లభించింది.

మూలాలు మార్చు