ఆంఫన్ తుఫాను
ఆంఫన్ తుఫాను చాలా శక్తివంతమైన , ప్రాణాంతకమైన ఉష్ణమండల తుఫాను, ఇది మే 2020 లో తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్ లపై విస్తారంగా నష్టాన్ని కలిగించింది,[1] ఇది 2007తరువాత గంగా డెల్టాను తాకినబలమైన ఉష్ణమండల తుఫాను ఇంకా 1999 ఒడిశా తుఫాను తరువాత బెంగాల్ బేలో సంభవించిన మొదటి సూపర్ తుఫాను తుఫాను. ఇది బంగాళా ఖాతంలో పెను తుఫాన్ గా ఎర్పడి ఆ తరువాత ప్రచండ తుఫాన్(సూపర్ సైక్లోన్)గా మారింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్ మీద ఈ తుఫాన్ పెను ప్రభావాన్ని చుపినది. ఇది 2020 మే 20 బుధవారం మధ్యాహ్నం కోల్‌కతా సమీపంలో తీరం దాటినది . తుఫాన్ తీరం దాటిన సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో భీకర గాలులు వీశాయి. దీంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ వృక్షాలు కూకటి వేర్లు సహా పెకిలించుకొని కుప్పకూలిపోయాయి. విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలాయి. కోల్‌కతాలోని డమ్ డమ్ విమానాశ్రయం నీటితో నిండిపోయింది.
Super cyclonic storm (IMD scale) | |
---|---|
Category 5 tropical cyclone (SSHWS) | |
చలనం | తుపాను స్థితి |
ఏర్పడిన తేదీ | 16 మె 2020 |
సమసిపోయిన తేదీ | 21 మే 2020 |
అత్యధిక గాలులు | 3-minute sustained: 240 km/h (150 mph) 1-minute sustained: 260 km/h (160 mph) |
అత్యల్ప పీడనం | 920 hPa (mbar); 27.17 inHg |
మరణాలు | 128 total |
నష్టం | $13.7 billion (2020 USD) (Costliest on record in the North Indian Ocean) |
ప్రభావిత ప్రాంతాలు | భారతదేశం, పశ్చిమబెంగాల్, ఒడిశా, అండమాన్ ద్వీపాలు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ |
Part of the 2020 ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫానులు |
అంఫన్ తుఫాన్ వలన ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రచండ గాలులు, భారీ వర్షాలకు మొత్తం 84 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.