ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి (పాట)

(ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే నుండి దారిమార్పు చెందింది)

ఆకాశంలో సూర్యుడుండడు సంధ్యవేళకి పాట 1992లో విడుదలైన సుందరకాండ చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]

"ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి"
ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి పాటలోని దృశ్యం
రచయితవేటూరి సుందరరామమూర్తి
సంగీతంఎం. ఎం. కీరవాణి
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణసుందరకాండ (1992)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రికార్డు చేసినవారు (స్టుడియో)భాను ఆర్ట్ క్రియెషన్స్
చిత్రంలో ప్రదర్శించినవారుదగ్గుబాటి వెంకటేష్, మీనా, అపర్ణ

పాట నేపథ్యం

మార్చు

కథానాయకుడు దగ్గర విద్య నేర్చుకున్న అమ్మాయి చనిపోయనపుడు, మరణం గురించి కథానాయకుడు పాడే సందర్భం.

పాటలోని సాహిత్యం

మార్చు

పల్లవి:
ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల IIనవ్వవేII

పురస్కారాలు

మార్చు
  1. వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం, మనస్విని పురస్కారం - 1992.

మూలాలు

మార్చు
  1. సితార, పాటల పల్లకి. "వాగ్దేవి వర పారిజాతాలు...వేటూరి గీతాలు". www.sitara.net. Archived from the original on 22 డిసెంబరు 2020. Retrieved 22 డిసెంబరు 2020.

ఇతర లంకెలు

మార్చు
  1. యూట్యూబ్ లో పాట వీడియో