సుందరకాండ వెంకటేష్ కథానాయకునిగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1992లో వచ్చిన చిత్రం.

సుందరకాండ
(1992 తెలుగు సినిమా)
Sundarakanda.jpg
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
తారాగణం వెంకటేష్,
మీనా,
అపర్ణ
సంగీతం యం.యం.కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ సౌదామిని క్రియెషన్స్
భాష తెలుగు

కథసవరించు

వెంకటేశ్వర్లు (వెంకటేష్) తను చదువుకున్న కళాశాలకే తెలుగు లెక్చరర్ గా పనిచేయడానికి వస్తాడు. అక్కడ రోజా (అపర్ణ) అనే అల్లరి పిల్ల తన స్నేహ బృందంతో కలిసి ఆట పట్టిస్తుంది. దాంతో వెంకటేశ్వర్లు ఆ అమ్మాయి ఏ పని చేసినా అందులో తప్పులు వెతుకుతుంటాడు. అయినా సరే రోజా మాత్రం అతన్ని ఆటపట్టించడం మానదు. ఒకరోజు అదే కళాశాలలో చాలా రోజుల నుంచీ చదువుతున్న తుకారాం (బ్రహ్మానందం) మరికొంత మంది విద్యార్థులతో కలిసి రోజా రాసినట్టుగా ఒక ప్రేమలేఖ రాసి అది వెంకటేశ్వర్లు బల్లలో దాస్తారు. వెంకటేశ్వర్లు రోజానే తప్పుపట్టి, మందలించి ఆ లేఖను ఆమెకు ఇచ్చేస్తాడు. కానీ రోజా మాత్రం ఆ లేఖను వెంకటేశ్వర్లే రాశాడని అతన్ని ఆరాధించడం మొదలు పెడుతుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

  1. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే
  2. కోకిలమ్మ కొత్త
  3. సుందరాకాండకు సందడే సందడి