ఆకుల వీర్రాజు
ఆకుల వీర్రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]
ఆకుల వీర్రాజు | |||
తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 జులై 2021- ప్రస్తుతం | |||
నియోజకవర్గం | రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 రాజమండ్రి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | బాపిరాజు | ||
నివాసం | రాజమండ్రి |
రాజకీయ జీవితం
మార్చుఆకుల వీర్రాజు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు సన్నిహితునిగా ఉంటూ, నగర కాంగ్రెస్ బ్లాక్ –1 కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేశాడు. ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చేతిలో 18,282 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా రెండుసార్లు వ్యవహరించాడు. రాజమహేంద్రవరం నగరంతో పాటు, పరిసర ప్రాంతాలలో పలు యూనియన్లకు గౌరవాధ్యక్షునిగా పని చేశాడు.[2]
ఆకుల వీర్రాజు 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుండి రెండోసారి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. ఆయనను 17 జులై 2021న తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[3]
మూలాలు
మార్చు- ↑ Eenadu (18 July 2021). "పదవుల సందడి". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
- ↑ Andhrajyothy (18 July 2021). "'నామినేటెడ్' మాయ!". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.