ఆగ్నేయ ఢిల్లీ జిల్లా

ఢిల్లీ లోని జిల్లా
(ఆగ్నేయ ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)

సౌత్ ఈస్ట్ జిల్లా, భారతదేశ, జాతీయ రాజధాని ఢిల్లీ పరిపాలనా భూభాగానికి చెందిన జిల్లా.ఈ జిల్లాను షాదారాజిల్లాతో పాటు 2012లో రూపొందించారు.[1] దీనితో డిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం జిల్లాల సంఖ్య 11 పరిపాలనా జిల్లాలకు పెరిగింది.[2]

ఆగ్నేయ ఢిల్లీ
ఆగ్నేయ ఢిల్లీ is located in ఢిల్లీ
ఆగ్నేయ ఢిల్లీ
ఆగ్నేయ ఢిల్లీ
Location in Delhi, India
Coordinates: 28°36′34″N 77°08′23″E / 28.60955°N 77.13967°E / 28.60955; 77.13967
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
స్థాపన2012
ప్రధాన కార్యాలయండిఫెన్సు కాలనీ
భాషలు
 • అధికారహిందీ, ఆంగ్లం
Time zoneUTC+5:30
Vehicle registrationDL
లోక్‌సభ నియోజకవర్గం ఆగ్నేయ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం , కొత్త ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం
WebsiteOfficial website

ఆగ్నేయ ఢిల్లీ జిల్లాకు పశ్చిమాన దక్షిణ ఢిల్లీ జిల్లా, దక్షిణాన హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా, తూర్పున యమునా నది, న్యూ ఢిల్లీ జిల్లా, తూర్పు ఢిల్లీ జిల్లాలు వరుసగా వాయవ్య, ఈశాన్యంలో ఉన్నాయి.

ఆగ్నేయ ఢిల్లీ జిల్లా జోర్ బాగ్, లోధి రోడ్, ఖాన్ మార్కెట్ సుందర్ నగర్ నుండి డిఫెన్స్ కాలనీ వరకు, లాజ్‌పత్ నగర్, బదర్‌పూర్, ఆశ్రమం, జైత్‌పూర్, నిజాముద్దీన్, సారాయ్ కాలే ఖాన్, న్యూ ఫ్రెండ్సు కాలనీ, నెహ్రూ ప్లేస్, జామియా నగర్, కల్కాజీ, చిత్తరంజన్ పార్కు గోవింద్‌పురి, ఓఖ్లా ఫేజ్- II, గ్రేటర్ కైలాష్ పార్ట్ II, అలకానంద, సరితా విహార్ ప్రాంతాల వరకు విస్తరించి ఉంది.

పరిపాలన

మార్చు

పరిపాలనాపరంగా, ఈ జిల్లాను డిఫెన్స్ కాలనీ, కల్కాజీ, సరితా విహార్ అనే మూడు ఉపవిభాగాలుగా విభజించారు. డిఫెన్స్ కాలనీలో జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం ఉంది.

జనాభా

మార్చు

2011లో భారత జనాభా లెక్కలు పూర్తయిన తరువాత ఈ జిల్లా సృష్టించబడినందున, సౌత్ ఈస్ట్ ఢిల్లీకి ప్రత్యేకంగా స్వతంత్ర గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు.

మూలాలు

మార్చు
  1. Gupta, Lalit; Dwivedi, Gaurav; Bhadoria, Poonam (2015). "Neurocysticercosis: An Unusual Incidental Diagnosis of Postdural Puncture Headache". Indian Journal of Anaesthesia and Analgesia. 2 (1): 53–56. doi:10.21088/ijaa.2349.8471.2115.7. ISSN 2349-8471.
  2. "Delhi gets two more revenue districts: Southeast, Shahdara - Indian Express". archive.indianexpress.com. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

మార్చు