అధికార భాష
ఒక ప్రాంతంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే భాషను అనుసరించి ప్రభుత్వాలు ఆ భాషను ఆ ప్రాంతానికి అధికార భాషగా నిర్ణయిస్తాయి. అనగా, భారతదేశానికి 22 అధికార భాషలు ఉన్నాయి అలాగే భారత ప్రభుత్వం అధికార అవసరాల కొరకు హిందీని, ఆంగ్లంన్ని వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు తెలుగు అధికార భాష. ఒక భాషని అధికార భాషగా నిర్ణయంచిన తర్వాత ఆయా ప్రభుత్వాలు అన్ని విధాలా ఆ భాషను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో సాధ్యమైనంతవరకూ ఆ భాషనే ఉపయోగించాలి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966 మే 14 న అధికారభాషా చట్టం చేసింది. 1974 మార్చి 19న అధికారభాషా సంఘాన్ని ఏర్పరిచింది.[1]
భారతదేశ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు - అధికార భాషలు
మార్చు- అస్సాం - అస్సామీ, బోడో
- ఆంధ్రప్రదేశ్ - తెలుగు, ఉర్దూ
- తెలంగాణ - తెలుగు, ఉర్దు
- తమిళనాడు - తమిళం
- పాండిచ్చేరి - తమిళం, మలయాళం, తెలుగు
- పశ్చిమ బెంగాల్ - బెంగాలీ
- జమ్మూ కాశ్మీర్ - కాశ్మీరీ, ఉర్దూ, డోంగ్రీ
- లడఖ్-ఉర్దూ, కాశ్మీరి, సింధీ
- మేఘాలయ - ఖాసీ, గారో
- గుజరాత్ - గుజరాతీ
- దాద్రా నాగర్ హవేలీ - గుజరాతీ
- రాజస్థాన్-రాజస్థానీ, హిందీ
- డామన్ డయ్యూ - గుజరాతీ
- కర్ణాటక - కన్నడ
- త్రిపుర - కొక్బొరోక్
- గోవా - కొంకణి
- మిజోరాం - మిజో
- మణిపూర్ -మణిపురి లేదా మీథేయ్
- అరుణాచల్ ప్రదేశ్ - ఆంగ్లం
- నాగాలాండ్-నాగామీస్, ఆంగ్లం
- కేరళ - మలయాళం
- లక్షద్వీప్ - మలయాళం
- అండమాన్ నికోబార్ దీవులు-బెంగాలీ, తెలుగు, ఉర్దూ
- బీహార్ - మైథిలి (బీహారి లేదా భోజ్ పురి )
- మహారాష్ట్ర - మరాఠీ
- సిక్కిం - నేపాలీ
- ఒడిషా - ఒరియా
- పంజాబ్ - పంజాబి
- చండీఘర్ - పంజాబి
- హర్యానా - హిందీ, పంజాబీ (రెండవ)
- ఢిల్లీ - ఉర్దూ, పంజాబీ (రెండవ)
- ఉత్తర ప్రదేశ్ -హిందీ, ఉర్దూ
- మధ్యప్రదేశ్-హిందీ
- ఛత్తీస్గఢ్- ఛతిస్గడీ, గోండీ,హిందీ
- ఉత్తరాఖండ్-హిందీ, సంస్కృతం
- హిమాచల్ ప్రదేశ్-హిందీ
- జార్ఖండ్-హిందీ, బిహారి
మూలాలు
మార్చు- ↑ గొడుగు నిర్మలాదేవి. అధికార భాష-తెలుగు చరిత్ర. Retrieved 2018-09-15.