ఆచమనము

(ఆచమనం నుండి దారిమార్పు చెందింది)

ఆచమనము అనే పదానికి ఉపస్పర్శం అంటే అరచేతిలో నీరు పోసుకొని నోటితో గ్రహించడమని అర్ధం. ఏదైనా ఒక పవిత్రమైన పనిచేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనస్సు, వాక్కు, శరీరం - అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడింది. సంధ్యావందనం మొదలైన సమయాలలో ఆచమనానికి చాలా ప్రాముఖ్యమున్నది. ఆచమనం అంటే కేవలం ఒక ఉద్ధరణి నీళ్లు చేతిలో పోసుకొని లోపలికి పుచ్చుకోవడం మాత్రమే కాదు, మంత్ర పూత జలంతో శరీరాన్ని స్పర్శించడం, స్నానం చేయడం కూడా ఆచమనమే. ఆచమనం నాలుగు విధాలు. అవి : 1. శ్రుత్యాచమనం : స్వాధ్యాయ బ్రాహ్మణంలోని శ్రుతి ‘‘హస్తా వవవిజ్య రతిరాచమేత్‌...’’ అంటూ చేతులు కడుగుకొని, ‘‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా’’ ఆని ఆచమనం చేయాలి. తరువాత రెండు చేతులను శుద్ధి చేసుకొని, ఉదకాన్ని స్పృశించి, కుడి చేతితో ఎడమ చేతిమీద, పాదాల మీద నీళ్లు చల్లుకోవాలి. శిరస్సు, నేత్రాలు, ముక్కు, చెవులు, హృదయ స్థానాలను తాకాలి. 2. శ్రౌతాచమనం : గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలను విడివిడిగా స్వాహాకారంతో పఠిస్తూ, అంటే ఓమ్‌ తత్సవితుర్వరేణ్యగ్‌ స్వాహా, భర్గోదేవస్య ధీమహి స్వాహా, ధియో యోనః ప్రచోదయాత్‌ స్వాహా అని పలుకుతూ ఆచమించడం మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. 3. స్మృత్యాచమనం/ స్మార్తాచమనం : పీట/ కృష్ణాజినం మీద కూర్చుని, పాదాలను నేలపై ఉంచి, ఆపస్తంబ సూత్ర సంప్రదాయంలో ఆచమించే పద్ధతి. బొటన వ్రేలితో పెదవులను తుడుచుకోవడం లాంటి క్రియలు ఇంకా ఉన్నాయి. 4. పురాణాచమనం : ముమ్మారు కేశవ నామాలతో ఆచమించడం, గోవిందాది నామాలతో అవయవ శుద్ధి మొదలైన క్రియలు ఇందులో ఉన్నాయి. శ్రుత్యాచమనం, శ్రౌతాచమనం ఒక్కటేనని కొందరి భావనగా దువ్వూరి రామకృష్ణారావుగారి సంపాద కత్వంలో వెలువడిన సంధ్యావందనం గ్రంథంలో వ్రాశారు. కావచ్చు. శ్రుతి, శ్రౌతం వేరు కావు.

పంచపాత్ర, ఉద్ధరిణి
ఆచమనము

రకాలు

మార్చు

శ్రుతి, స్మృతి, పురాణాలలో 3 రకాల ఆచమనాలు చెప్పబడ్డాయి.

  • శ్రుత్యాచమనం: గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ చేసే ఆచమనం.
  • స్మృత్యాచమనం: ఆపస్తంబాది ఋషులు చెప్పిన విధానాన్ని అనుసరించి చేసే ఆచమనం.
  • పురాణాచమనం: కేశవాది నామోచ్ఛారణ చేస్తూ కావించే ఆచమనం.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆచమనము&oldid=3318839" నుండి వెలికితీశారు