పాదము (ఆంగ్లం: Foot) అనేది మనుష్యులు, జంతువులలో కాలి చివరన ఉండి నడవడానికి ఉపయోగపడే నిర్మాణం. దీనిలో చీలమండ (Ankle), ప్రపాదం (Forefoot), కాలివేళ్ళు (Toes) ఉంటాయి. చాలా జంతువులలో పాదంలో భాగంగా గోళ్ళు, డెక్కలు కూడా ఉంటాయి. కాళ్ళు నడవడానికి ఉపయోగపడే అవయవాలు.

పాదము
మానవుని పాదము
లాటిన్ pes
ధమని dorsalis pedis, medial plantar, lateral plantar
నాడి medial plantar, lateral plantar, deep fibular, superficial fibular
MeSH Foot

మనుషులు పాదాల రక్షణ, అందం కోసం రకరకాల పాదరక్షలు ధరిస్తారు.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో పాదము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] పాదము నామవాచకంగా A foot. అడుగు. A root, వేరు. A quarter, పాతిక. A foot or line of verse being a quarter of a stanza. పద్యములో నాలుగవ భాగము. A ray of light, కిరణము. A small hill at the foot of a mountain. కొండదరి దిబ్బ అని అర్ధాలున్నాయి. ఉదా: తమ పాదాలనే నమ్మి వచ్చినాను I came in reliance on your honor as my protector. This is a mere conversational compliment, like 'I kiss your hands' in Spanish. తమ పాదాల సముఖానకు నా కుమారుణ్ని తెచ్చి అప్పగిస్తున్నాను permit me to introduce my son to your honor's protection. వాడు తండ్రి పాదాలమీద పడెను he fell on his father's feet. తమ పాదాల వద్ద before your honor, in your presence. తమ పాదాల శరణుచొచ్చినాను I throw myself on your goodness. పాదతీర్థము water made holy by washing a saint's feet. పాదపద్మములు lotus-like feet. పాదలాక్ష red paint for the feet of women, పారాణి. పాదచారి n. A foot passenger. కాలిబంటు. One who goes walking, నడచి పోవువాడు. పాదజుడు n. A Sudra, because born from the feet of Brahma శూద్రుడు. పాదత్రాణము n. A shoe or boot. పైజారు. పాదపము n. A tree. పాదపూర్ణము n. An unnecessary word inserted in verse, to fill up the measure, such as in Sanskrit the words తు, హి, చ, స్మ, హి, వై, or, in Telugu poetry the words, ఒగి, తగ, మరి, ఇల, మహి, or verbs, చెలగు, ఒప్పు, &c. పాదరసము n. Quick-silver, mercury. పాదలి n. A base or low man, అధముడు. ఉదా: "పాపపు విప్రుని పనికిగా మున్ను, తాపికాడైన పాదలి మందడీడు." పాదలేపనము n. అనగా A salve or unguent for the feet. పాదామగడము n. An ornament for the feet or toes. పాదపట్టము or పాయపట్టము n. An anklet. అందె, కాలి అందె, బిరుదు పెండేరము, పాగడము.

జంతువులలో పాదాలు

మార్చు

భూమి మీద సంచరించే సకశేరుకాల పాదాలు మూడు రకాలు: ప్లాంటిగ్రేడ్ (Plantigrade), డిజిగ్రేడ్ (digitigrade), లేదా అన్గ్యులిగ్రేడ్ (unguligrade). మనుషులు, కప్పలు లేదా ఎలుగుబంట్ల వంటి ప్లాంటిగ్రేడ్ జంతువులలో పాదం అడుగుభాగం శరీరభారమంతా మోస్తుంది. పిల్లులు, తోడేళ్ళు, పక్షులు మొదలైన డిజిగ్రేడ్ జంతువులలో కాలివ్రేళ్ళమీద మొత్తం భారం పడుతుంది. చివరి రకం జీవులలో కాలి గిట్టల మీద శరీరమంతా నిలబడుతుంది. వీటిని ఖురిత జంతువులు (Ungulates) అంటారు.

పాదచారులు

మార్చు

పాదచారులు అనగా అనిని జ౦తువుల వలెనే తన అవసారాల కొరకు ఒక చోటు ను౦డి మరో చోటుకు తన కాళళతో నడిచే మనుషుౢలు పూరవ౦ అడవి దారిలో ముళళు గుచచు కోకు౦డా కాళళకుతాటిజగగలనుకటటుకొని నడిచివెళళేవాళళు

పాద ముద్రలు

మార్చు
 
Footprint left at crime scene.

పాద ముద్రలు (Footprint) మానవుల లేదా జంతువుల అడుగులు వేసే పాదాల లేదా డెక్కల ముద్రలు. జంతువుల అడుగు జాడల ఆధారంగా అడవిలో వాటి కదలికల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. నేర పరిశోధనలో నేరస్తుల్ని పట్టుకోడానికి పాదాల లేదా వారు ధరించే పాదరక్షల గుర్తుల్ని వివిధ సందర్భాలలో పోలీసులకు తోడ్పడతాయి. ఆసుపత్రిలో పిల్లలు పుట్టిన వెంటనే మారిపోకుండా వారి పాదాల గుర్తుల్ని జన్మ నమోదు చిట్టాలో ముద్రిస్తారు.

వ్యాధులు

మార్చు
  • చదును పాదము (Flat foot) : పాదములో నిలువులోను, అడ్డములోను ఉండే చాపము లేకుండా చదునుగా అవుతుంది.

మధుమేహం వల్ల సమస్యలు

మార్చు

మధుమేహం వల్ల పాదాలకు వఛ్ఛే సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా మధుమేహవ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. ప్రస్తుతం 28.5 కోట్ల మంది మధుమేహ రోగుల్లో 5 కోట్ల 8 లక్షల మంది భారదేశంలోనే ఉండం గమనార్హం. మధుమేహ వ్యాధితో ఉన్న రోగి ఆసుపత్రిలో చేరడానికి దారితీస్తున్న అతిసాధారణ కారణం పాదాల సమస్య. చిన్న పుండుగా మొదలై పాదం తొలగింపునకు దారితీసే ప్రమాదకర పాదాల సమస్యను మధుమేహరోగులు సరైన అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించి నివారించుకోవాలి. అందుకే మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కల్గిఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పాదము&oldid=2935584" నుండి వెలికితీశారు