ఆచార్య మసన చెన్నప్ప

ఆచార్య మసన చెన్నప్ప మహబూబ్ నగర్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గంలోని కొలుకులపల్లి గ్రామానికి చెందిన కవి. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.

ఆచార్య మసన చెన్నప్ప
జననంమసన చెన్నప్ప
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిమండలం కొలుకులపల్లి గ్రామం
వృత్తిఆచార్యులు
ప్రసిద్ధికవి
మతంహిందూ

ఉన్నత విద్య మార్చు

మసన చెన్నప్ప ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం. ఏ.లో ప్రప్రథమ స్థానం పొంది గురజాడ అప్పారావు స్వర్ణపతకం అందుకున్నారు. 'వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙమయ సూచిక ' అను అంశంపై ఎం. ఫిల్. ను, ' ప్రాచీన కావ్యాలు - జీవన చిత్రణ ' అనే అంశంపై పి. హెచ్.డి.ని చేశారు.

వృత్తి జీవితం మార్చు

వీరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు.

రచనలు మార్చు

  • మల్లి పదాలు
  • నేత్రోదయం ( ఈ కవితా సంపుటి ' ఐరైజ్ ' పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడింది.)
  • బృహద్గీత
  • సమాలోచనం
  • బ్రహ్మచర్యం
  • అమృత స్వరాలు
  • అగ్ని స్వరాలు
  • ప్రకృతి పురుష వివేకం
  • సారస్వత లోచనం
  • ఈశావ్యాసం.[1]

పురస్కారాలు మార్చు

  • సూర్యశక్తి సాహితీ పురస్కారం అందుకున్నారు.
  • 2000 సం.లో నిర్మల సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు.

మూలాలు మార్చు

  1. పాలమూరు కవిత, సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-159