ఆజీజ్ వజీర్ సయ్యద్

ఆజీజ్‌ వజీర్‌ సయ్యద్‌ ... శతాధిక కథలరచయిత. అంతేగాక వీరు నవలా రచయిత, నాటక రచయిత, రేడియో నాటికల రచయిత, పత్రికా సంపాధకుడు.

బాల్యము

మార్చు

ఆజీజ్‌ వజీర్‌ సయ్యద్‌:కర్నూలు జిల్లా కర్నూలులో 1964 ఆగస్టు 11న జననం. తల్లితండ్రులు: మైమున్నీసా, సయ్యద్‌ బాబూ సాహెబ్‌. చదువు:బి.ఎ.వ్యాపకం: రచన. పద్నాల్గవయేట నుండి రచనలు చేయడం ఆరంభించగా 1983లో 'ఎర్ర కాగితాలు'(కథ) రచయితగా నిలబెట్టింది. కలంపేరు: ఎస్‌డివి అజీజ్‌.

రచనా వ్యాసంగము

మార్చు

వీరు తన పద్నాల్గవయేట నుండే రచనలు చేయడం ఆరంభించగా 1983లో ప్రచురించ బడిన 'ఎర్ర కాగితాలు'(కథ) ఇతడిని రచయితగా నిలబెట్టింది. కలంపేరు: ఎస్‌డివి అజీజ్‌. ఇతడి సుమారు వందకథలు వివిధ తెలుగుపత్రికలలో ప్రచురితం. పలునాటికలు, స్టేజి నాటికలు, రేడియోనాటికలు రాశారు. అన్ని రేడియోనాటికలు, రూపకాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి. ఈ నాటికలలో 'సామా' అన్ని భారతీయ భాషల్లోకి అనువదించబడి జాతీయస్థాయిలో ప్రసారమై, జాతీయఅవార్డును, మంచి గుర్తింపును తెచ్చిపెట్టినది.

ప్రచురణలు

మార్చు

1.వనజ, 2. శిథిల శిల్పాలు, 3. కావేరి, 4. ప్రేమ, 5. వాహిని, 6. అలల వాలున, 7. హరిణి (సాంఫిుక నవలలు) 8. వీరనారి, 9. తెరిణెకిం ముట్టడి, 10. పాలెగాడు, 11. మహాదాత బుడ్డ వెంగళ రెడ్డి (చారిత్రక నవలలు) 12. ఆంధ్ర కేసరి, 13. ది గైడ్‌, 14. మనిషి (రేడియో నాటికలు), 15. మనిషి (కథల సంపుటి,2010). ఈ గ్రంథాలలో 'పాలెగాడు' 'శిధిలశిల్పాలు' ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. కర్నూలు నుండి 'సాహితి' సాహిత్య మాసపత్రిక కొన్నేళ్ళపాటు నడిపారు. లక్ష్యం: ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం.

మూలాలు

మార్చు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010 ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 48


మూలాల జాబితా

మార్చు