ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

ఆడమ్ గిల్‌క్రిస్ట్ విశ్రాంత ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపరు. అతను తన కెరీర్‌లో 33 సెంచరీలు చేశాడు. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లలో అతను సెంచరీలు సాధించాడు. అతని బ్యాటింగ్ ఫిలాసఫీని "బంతి ఉన్నది కొట్టడానికే" అని వివరిస్తూ,[1] అతన్ని "క్రీడ ఇప్పటివరకు చూడని అత్యంత విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు" అని అభివర్ణించారు.[2]

A man in a white cricket shirt and a baggy green cap, with his left hand on his chin, looking to his right
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్

ఆస్ట్రేలియా వన్‌డే జట్టుకు ఎంపికైన గిల్‌క్రిస్ట్ 1996 అక్టోబరులో ఫరీదాబాద్‌లో జరిగిన టైటాన్ కప్‌లో దక్షిణాఫ్రికాపై రంగప్రవేశం చేశాడు.[1] అతని మొదటి సెంచరీ 1998 జనవరిలో అదే జట్టుపై ఈసారి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) లో చేసాడు. బ్యాటింగ్ ప్రారంభించి, అతను 104 బంతుల్లో 100 పరుగులు చేసి, ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల విజయానికి నడిపించాడు.[3] గిల్‌క్రిస్ట్ మూడవ వన్‌డే సెంచరీ ఆస్ట్రేలియా అత్యధిక వన్‌డే రన్‌ఛేజ్‌గా ప్రపంచ రికార్డును సమం చేయడంలో సహాయపడింది.[4] 1999లో శ్రీలంకపై అతని నాల్గవది, ఆ సమయంలో SCGలో వన్‌డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన పరుగుల వేటను సాధించడంలో ఆస్ట్రేలియాకు సహాయపడింది.[5] ఆ తర్వాత ఆ టోర్నమెంట్‌లో అదే జట్టుపై చేసిన 154 పరుగులు, అతని ఐదవ వన్‌డే సెంచరీ. డీన్ జోన్స్ రికీ పాంటింగ్‌ల ఆస్ట్రేలియా రికార్డు స్కోరును అధిగమించింది.[6] గిల్‌క్రిస్ట్ ఆరవ వన్‌డే సెంచరీ, న్యూజిలాండ్‌పై 98 బంతుల్లో 128 పరుగులు. ఆస్ట్రేలియా అత్యధిక వన్‌డే స్కోరు సాధించడంలో తోడ్పడింది.[7] అతను 78 బంతుల్లో సంచరీ చేసి, వన్డేల్లో వేగవంతమైన సెంచరీతో అలన్ బోర్డర్ చేసిన ఆస్ట్రేలియా రికార్డును సమం చేశాడు.[8] గిల్‌క్రిస్ట్ ఎనిమిదో సెంచరీలో భాగంగా, అతను పాంటింగ్‌తో కలిసి ఆస్ట్రేలియా రెండవ వికెట్ రికార్డు భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.[9] అతను 2003, 2004 రెండింటిలోనూ ఆస్ట్రేలియన్ వన్-డే ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.[1] వన్‌డే క్రికెట్‌లో గిల్‌క్రిస్ట్ అత్యధిక స్కోరు 172, 2004 జనవరిలో జింబాబ్వేపై సాధించాడు వరల్డ్ XIకి వ్యతిరేకంగా గిల్‌క్రిస్ట్ 73 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఐదు బంతుల తేడాతో తన స్వంత ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టాడు. [10] అతను తన 14వ సెంచరీతో మళ్లీ ఈ మార్క్‌ను బద్దలు కొట్టాడు. ఈసారి 67 బంతుల్లో మూడు అంకెలను చేరుకున్నాడు.[11] అతని చివరి వన్‌డే సెంచరీ 2007 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో చేసాడు. ఇది అతని ఏకైక ప్రపంచ కప్ సెంచరీ. 104 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, పదమూడు ఫోర్లతో సహా 149 పరుగులు చేశాడు, గిల్‌క్రిస్ట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరు, వేగవంతమైన సెంచరీ చేశాడు.[12] గిల్‌క్రిస్ట్ సెంచరీ చేసిన ప్రతి వన్‌డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.

గిల్‌క్రిస్ట్ 1999 నవంబరులో పాకిస్తాన్‌పై తన తొలి టెస్టు ఆడాడు. [1] సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో అతని మొదటి అంతర్జాతీయ సెంచరీ సాధించాడు.[13] మ్యాచ్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో అజేయంగా 149 పరుగులు చేసి, అతను హోబర్ట్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల విజయానికి నడిపించాడు. ఇది టెస్టు చరిత్రలో మూడో అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్ కాగా, ఆస్ట్రేలియా గడ్డపై అత్యధికం.[14] అతని రెండవ టెస్టు సెంచరీతో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు వరుస వరుస టెస్టు విజయాలను 16 కు తీసుకెళ్ళింది.[15] భారతదేశపు స్కోరు 171కి సమాధానంగా ఆస్ట్రేలియన్లు 5/99కి పడిపోయిన తర్వాత, గిల్‌క్రిస్ట్ 112 బంతుల్లో 122 పరుగులు సాధించాడు. మాథ్యూ హేడెన్‌తో 32 ఓవర్లలో 197 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.[16] అతని అత్యధిక టెస్టు స్కోరు, 204 నాటౌట్, 2002 ఫిబ్రవరిలో న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై చేశాడు. డామియన్ మార్టిన్‌తో 317 పరుగుల భాగస్వామ్యం సాధించాడు. [17] ఎదుర్కొన్న బంతుల పరంగా ఇది ఆ సమయంలో టెస్టు చరిత్రలో వేగవంతమైన డబుల్ సెంచరీ.[18] తర్వాతి మ్యాచ్‌లో 108 బంతుల్లో 138 పరుగులు చేశాడు.[17] 157.66 బ్యాటింగ్ సగటుతో 474 బంతుల్లో 473 పరుగులతో మూడు టెస్టుల సిరీస్‌ను ముగించాడు.[17][19] అదే సంవత్సరంలో, అతను విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా ఎంపికయ్యాడు.[2] 2006లో, అతను ఇంగ్లిష్ బౌలర్ మాంటీ పనేసర్‌పై ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లతో సహా 57 బంతుల్లో 100 పరుగులు చేసి, టెస్టు చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీని చేశాడు.[2] సాధారణంగా టెస్టు జట్టులో ఏడవ స్థానంలో బ్యాటింగ్ చేసే గిల్‌క్రిస్ట్ మొత్తం తొమ్మిది టెస్టు దేశాలపై సెంచరీలు చేశాడు. 2008 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయ్యే సమయానికి, అతను 17 టెస్టు సెంచరీలు చేశాడు.[2]

 
శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ఫిబ్రవరి 2006లో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కి బౌలింగ్ చేస్తూ. గిల్‌క్రిస్ట్ 67 బంతుల్లో సెంచరీ చేసి, మొత్తం 122 పరుగులు చేసి మురళీధరన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.[20]
చిహ్నం అర్థం
* నాటౌట్‌గా మిగిలాడు
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్
టెస్టు ఆ సిరీస్‌లో ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య
స్థా బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్నిం మ్యాచ్ లోని ఇన్నింగ్స్
స్ట్రైరే ఇన్నింగ్స్ సమయంలో స్ట్రైక్ రేట్ .
H/A/N వేదిక ఇంట్లో (ఆస్ట్రేలియా), దూరంగా లేదా తటస్థంగా ఉంది.
ఓడింది ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది.
గెలిచింది ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
డ్రా అయింది మ్యాచ్ డ్రా అయింది.

టెస్టు సెంచరీలు

మార్చు
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 149*   పాకిస్తాన్ 7 4 2/3 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ స్వదేశం 1999 నవంబరు 18 గెలిచింది[13]
2 122♠   భారతదేశం 7 2 1/3 వాంఖడే స్టేడియం, ముంబై విదేశం 2001 ఫిబ్రవరి 27 గెలిచింది[21]
3 152♠   ఇంగ్లాండు 7 2 1/5 ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ విదేశం 2001 జూలై 5 గెలిచింది[22]
4 118   న్యూజీలాండ్ 7 1 1/3 బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, వూలూంగబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2001 నవంబరు 8 డ్రా అయింది[23]
5 204*♠   దక్షిణాఫ్రికా 7 1 1/3 న్యూ వాండరర్స్ స్టేడియం, జోహన్నెస్‌బర్గ్ విదేశం 2002 ఫిబ్రవరి 22 గెలిచింది[24]
6 138*   దక్షిణాఫ్రికా 7 2 2/3 న్యూలాండ్స్, కేప్ టౌన్ విదేశం 2002 మార్చి 8 గెలిచింది[25]
7 133   ఇంగ్లాండు 7 2 5/5 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2003 జనవరి 2 ఓడింది[26]
8 101*   వెస్ట్ ఇండీస్ 5 1 2/4 క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ విదేశం 2003 ఏప్రిల్ 19 గెలిచింది[27]
9 113*   జింబాబ్వే 7 1 1/2 వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2003 అక్టోబరు 9 గెలిచింది[28]
10 144   శ్రీలంక 3 3 2/3 అస్గిరియా స్టేడియం, క్యాండీ విదేశం 2004 మార్చి 16 గెలిచింది[29]
11 104   భారతదేశం 7 1 1/4 ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు విదేశం 2004 అక్టోబరు 6 గెలిచింది[30]
12 126   న్యూజీలాండ్ 7 2 1/2 బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, వూలూంగబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2004 నవంబరు 18 గెలిచింది[31]
13 113   పాకిస్తాన్ 6 1 3/3 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 2005 జనవరి 2 గెలిచింది[32]
14 121♠   న్యూజీలాండ్ 8 2 1/3 జేడ్ స్టేడియం, క్రైస్ట్‌చర్చ్ విదేశం 2005 మార్చి 10 గెలిచింది[33]
15 162♠   న్యూజీలాండ్ 7 1 2/3 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 2005 మార్చి 18 డ్రా అయింది[34]
16 144♠   బంగ్లాదేశ్ 6 2 1/2 ఫతుల్లా ఉస్మానీ స్టేడియం, ఫతుల్లా విదేశం 2006 ఏప్రిల్ 9 గెలిచింది[35]
17 102*   ఇంగ్లాండు 7 3 3/5 వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2006 డిసెంబరు 14 గెలిచింది[36]

వన్డే సెంచరీలు

మార్చు
సం. స్కోరు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 100♠   దక్షిణాఫ్రికా 1 2 96.15 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 1998 జనవరి 26 గెలిచింది[3]
2 118♠   న్యూజీలాండ్ 1 2 100.85 లాంకాస్టర్ పార్క్, క్రైస్ట్‌చర్చ్ విదేశం 1998 ఫిబ్రవరి 8 గెలిచింది[37]
3 103   పాకిస్తాన్ 1 2 99.03 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ విదేశం 1998 నవంబరు 10 గెలిచింది[38]
4 131♠   శ్రీలంక 1 2 111.01 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ స్వదేశం 1999 జనవరి 13 గెలిచింది[39]
5 154♠   శ్రీలంక 1 1 119.37 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 1999 ఫిబ్రవరి 7 గెలిచింది[40]
6 128♠   న్యూజీలాండ్ 2 1 130.61 జేడ్ స్టేడియం, క్రైస్ట్‌చర్చ్ విదేశం 2000 ఫిబ్రవరి 26 గెలిచింది[41]
7 105♠   దక్షిణాఫ్రికా 1 2 100.96 కింగ్స్‌మీడ్, డర్బన్ విదేశం 2002 ఏప్రిల్ 3 గెలిచింది[42]
8 124♠   ఇంగ్లాండు 1 1 119.23 మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్ స్వదేశం 2002 డిసెంబరు 15 గెలిచింది[43]
9 111♠   భారతదేశం 1 1 106.73 ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు విదేశం 2003 నవంబరు 12 గెలిచింది[44]
10 172♠   జింబాబ్వే 1 1 136.50 బెల్లెరివ్ ఓవల్, హోబర్ట్ స్వదేశం 2004 జనవరి 16 గెలిచింది[45]
11 121*♠   ఇంగ్లాండు 1 2 119.80 కెన్నింగ్టన్ ఓవల్, లండన్ విదేశం 2005 జూలై 12 గెలిచింది[46]
12 103♠ ICC World XI 1 1 130.37 డాక్లాండ్స్ స్టేడియం, మెల్బోర్న్ స్వదేశం 2005 అక్టోబరు 7 గెలిచింది[47]
13 116♠   శ్రీలంక 1 2 110.47 వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2006 జనవరి 29 గెలిచింది[48]
14 122♠   శ్రీలంక 1 2 134.06 బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, వూలూంగబ్బా, బ్రిస్బేన్ స్వదేశం 2006 ఫిబ్రవరి 14 గెలిచింది[20]
15 149♠   శ్రీలంక 1 1 143.26 కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్ Neutral 2007 ఏప్రిల్ 28 గెలిచింది[49]
16 118♠   శ్రీలంక 1 1 89.39 వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, పెర్త్ స్వదేశం 2008 ఫిబ్రవరి 15 గెలిచింది[50]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Adam Gilchrist". Cricinfo. Retrieved 29 October 2009.
  2. 2.0 2.1 2.2 2.3 "Gilchrist ends Australia career". BBC Sport. 26 January 2008. Retrieved 29 October 2009. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "retire" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 "Carlton & United Series – 2nd final". Cricinfo. Retrieved 29 October 2009.
  4. "Pakistan v Australia 1998–99". Wisden Cricketers' Almanack. Wisden. 1999. Retrieved 9 November 2009.
  5. "Statistics – Statsguru – Sydney Cricket Ground – One-Day Internationals". Cricinfo. Archived from the original on 17 July 2012. Retrieved 30 October 2009.
  6. "Carlton & United Series 1998–99, 15th match". Wisden Cricketers' Almanack. Wisden. 1999. Retrieved 9 November 2009.
  7. "New Zealand v Australia 1999–2000". Wisden Cricketers' Almanack. Wisden. 2000. Retrieved 3 November 2009.
  8. "Records / One-Day Internationals / Batting records / Fastest hundreds". Cricinfo. Retrieved 30 October 2009.
  9. "Australia v England". Wisden Cricketers' Almanack. Wisden. 2003. Retrieved 9 November 2009.
  10. Hobson, Richard (2006). "The ICC Super Series, 2005–06". Wisden Cricketers' Almanack. Wisden. Retrieved 9 November 2009.
  11. Brettig, Daniel (2007). "Third Final, Australia v Sri Lanka VB Series, 2005–06". Wisden Cricketers' Almanack. Wisden. Retrieved 9 November 2009.
  12. Brett, Oliver (28 April 2007). "Final: Australia v Sri Lanka". BBC Sport. Retrieved 29 October 2009.
  13. 13.0 13.1 "Pakistan in Australia Test Series – 2nd Test". Cricinfo. Retrieved 28 October 2009.
  14. "By hook or by crook". BBC Sport. 23 June 2001. Retrieved 29 October 2009.
  15. "India v Australia, 2000–01". Wisden Cricketers' Almanack. Wisden. 2001. Retrieved 3 November 2009.
  16. "1st Test: India v Australia at Mumbai, 27 Feb-3 Mar 2001 Ball-by-Ball commentary". Cricinfo. Retrieved 28 February 2007.
  17. 17.0 17.1 17.2 Harte, p. 752.
  18. Crutcher, Michael (24 February 2002). "Gilchrist downplays record after remarkable double century". Cricinfo. Retrieved 20 February 2007.
  19. "Australia in South Africa, 2001–02 Test Series Averages". Cricinfo. Retrieved 7 March 2007.
  20. 20.0 20.1 "VB Series – 3rd final". Cricinfo. Retrieved 29 October 2009.
  21. "Border—Gavaskar Trophy – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  22. "The Ashes – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  23. "Trans-Tasman Trophy – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  24. "Australia in South Africa Test Series – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  25. "Australia in South Africa Test Series – 2nd Test". Cricinfo. Retrieved 29 October 2009.
  26. "The Ashes – 5th Test". Cricinfo. Retrieved 29 October 2009.
  27. "The Frank Worrell Trophy – 2nd Test". Cricinfo. Retrieved 29 October 2009.
  28. "Southern Cross Trophy – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  29. "Australia in Sri Lanka Test Series – 2nd Test". Cricinfo. Retrieved 29 October 2009.
  30. "Border—Gavaskar Trophy – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  31. "Trans-Tasman Trophy – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  32. "Pakistan in Australia Test Series – 3rd Test". Cricinfo. Retrieved 29 October 2009.
  33. "Trans-Tasman Trophy – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  34. "Trans-Tasman Trophy – 2nd Test". Cricinfo. Retrieved 29 October 2009.
  35. "Australia in Bangladesh Test Series – 1st Test". Cricinfo. Retrieved 29 October 2009.
  36. "The Ashes – 3rd Test". Cricinfo. Retrieved 29 October 2009.
  37. "Australia in New Zealand ODI Series – 1st ODI". Cricinfo. Retrieved 29 October 2009.
  38. "Australia in Pakistan ODI Series – 3rd ODI". Cricinfo. Retrieved 29 October 2009.
  39. "Carlton & United Series – 3rd match". Cricinfo. Retrieved 29 October 2009.
  40. "Carlton & United Series – 15th match". Cricinfo. Retrieved 29 October 2009.
  41. "Australia in New Zealand ODI Series – 4th ODI". Cricinfo. Retrieved 29 October 2009.
  42. "Australia in South Africa ODI Series – 5th ODI". Cricinfo. Retrieved 29 October 2009.
  43. "VB Series – 2nd match". Cricinfo. Retrieved 29 October 2009.
  44. "TVS Cup (India) – 8th match". Cricinfo. Retrieved 29 October 2009.
  45. "VB Series – 4th match". Cricinfo. Retrieved 29 October 2009.
  46. "NatWest Challenge – 3rd match". Cricinfo. Retrieved 29 October 2009.
  47. "ICC Super Series ODIs – 2nd match". Cricinfo. Retrieved 29 October 2009.
  48. "VB Series – 8th match". Cricinfo. Retrieved 29 October 2009.
  49. "ICC World Cup – final". Cricinfo. Retrieved 29 October 2009.
  50. "Commonwealth Bank Series – 6th match". Cricinfo. Retrieved 29 October 2009.