రికీ పాంటింగ్

ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు


రికీ పాంటింగ్ (ఆంగ్లం: Ricky Ponting; 1974 డిసెంబరు 19) ఒక ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్. బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌, క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత.

రికీ పాంటింగ్
AO (ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా)
Ricky Ponting 2015.jpg
2015లో రికీ పాంటింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు రికీ థామస్ పాంటింగ్
జననం (1974-12-19) 1974 డిసెంబరు 19 (వయసు 48)[1]
లాన్సెస్టన్, టాస్మానియా, ఆస్ట్రేలియా[1]
ఇతర పేర్లు పంటర్
ఎత్తు 1.73[1] మీ. (5 అ. 8 అం.)
బ్యాటింగ్ శైలి కుడిచేతి వాటం
బౌలింగ్ శైలి కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్ర బ్యాట్స్‌మాన్
సంబంధాలు క్రికెటర్ గ్రెగ్ కాంప్‌బెల్ (అంకుల్)
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు Australia
టెస్టు అరంగ్రేటం(cap 366) 8 December 1995 v Sri Lanka
చివరి టెస్టు 3 December 2012 v South Africa
వన్డే లలో ప్రవేశం(cap 123) 15 February 1995 v South Africa
చివరి వన్డే 19 February 2012 v India
ఒ.డి.ఐ. షర్టు నెం. 14
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1992/93–2012/13 Tasmania
2004 Somerset
2008 Kolkata Knight Riders
2011/12–2012/13 Hobart Hurricanes
2013 Mumbai Indians (squad no. 14)
2013 Surrey
2013 Antigua Hawksbills
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 168 375 289 456
సాధించిన పరుగులు 13,378 13,704 24,150 16,363
బ్యాటింగ్ సగటు 51.85 42.03 55.90 41.74
100s/50s 41/62 30/82 82/106 34/99
ఉత్తమ స్కోరు 257 164 257 164
బాల్స్ వేసినవి 575 150 1,506 349
వికెట్లు 5 3 14 8
బౌలింగ్ సగటు 54.60 34.66 58.07 33.62
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0 0 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 0 0 0
ఉత్తమ బౌలింగ్ 1/0 1/12 2/10 3/34
క్యాచులు/స్టంపింగులు 195/– 160/– 309/– 195/–
Source: ESPNcricinfo, 11 July 2013

ప్రస్తుతం భారత టీ20 మెగా లీగ్‌లో ఢిల్లీ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ 1999 నుంచి 2007 వరకు ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జట్టులో భాగస్వామి. 2006, 2009లో ఆయన నేతృత్వంలో ఆసీస్‌ వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌ ట్రోఫీ సాధించింది.[2]

రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 2004 నుండి 2011 మధ్య టెస్ట్ క్రికెట్‌లో, 2002 నుండి 2011 మధ్య వన్డే ఇంటర్నేషనల్స్ లో కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 324 మ్యాచ్‌లలో 220 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఆయన నిలిచాడు. 67.91% గెలుపు రేటుతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఆయన రికార్డు సాధించాడు. 2006 డిసెంబరులో 50 సంవత్సరాల పాటు టెస్ట్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక రేటింగ్‌ను రికీ పాంటింగ్ చేరుకున్నాడు. అయితే 2017 డిసెంబరులో స్టీవ్ స్మిత్ దీనిని అధిగమించాడు.[3] అంతర్జాతీయ సెంచరీల సంఖ్య ప్రకారం క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో ఆయన నిలిచాడు.

వ్యక్తిగత జీవితంసవరించు

1974 డిసెంబరు 19న టాస్మానియాలోని లాన్సెస్టన్‌లో రికీ పాంటింగ్ జన్మించాడు. గ్రేమ్, లోరైన్ పాంటింగ్‌ల నలుగురు పిల్లలలో అతను పెద్దవాడు. గ్రేమ్ క్లబ్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ ఆటగాడు. లోరైన్ స్టేట్ వైగోరో (Vigoro) ఛాంపియన్.[4] అతని మేనమామ గ్రెగ్ కాంప్‌బెల్ 1989, 1990లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు.

2002 జూన్లో తన చిరకాల స్నేహితురాలు, న్యాయ విద్యార్థి రియాన్నా కాంటర్‌ని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.[5][6][7]

కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలుసవరించు

Batting
Score Fixture Venue Season
Test 257 Australia v India MCG, Melbourne 2003[8]
ODI 164 South Africa v Australia Wanderers Stadium, Johannesburg 2006[9]
T20I 98* New Zealand v Australia Eden Park, Auckland 2005[10]
FC 257 Australia v India MCG, Melbourne 2003[8]
LA 164 South Africa v Australia Wanderers Stadium, Johannesburg 2006[9]
T20 98* New Zealand v Australia Eden Park, Auckland 2005[10]

రికార్డులుసవరించు

  • 2003లో ప్రపంచంలోని విస్డెన్ లీడింగ్ క్రికెటర్, అలాగే 2006లో ఐదుగురు విస్డెన్ క్రికెటర్లలో రికీ పాంటింగ్ ఒకడు.[11]
  • మైకేల్ క్లార్క్‌తో కలిసి 2004, 2006, 2007, 2009 నాలుగు సార్లు అలన్ బోర్డర్ మెడలిస్ట్‌గా రికీ పాంటింగ్ రికార్డు సృష్టించాడు.
  • 2003, 2004, 2007లలో ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ ఆటగాడిగా, 2002, 2007లలో ఆస్ట్రేలియా ఉత్తమ వన్డే అంతర్జాతీయ ఆటగాడిగా అవార్డును ఆయన గెలుచుకున్నాడు.[12]
  • అప్పటికి ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్‌లకు టెస్ట్ హోదా రాని కారణంగా మినహాయిస్తే అన్ని టెస్ట్ ఆడే దేశాలపై ODI క్రికెట్‌లో సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్ అతడు.[13]
  • షేన్ వాట్సన్‌తో కలిసి రికీ పాంటింగ్ ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం (రెండో వికెట్‌కు 252 నాటౌట్) గా నిలిచాడు.[14][15]
  • భారత్‌పై రికీ పాంటింగ్ సాధించిన 242 పరుగుల స్కోరు ఓడిపోయిన కారణంగా అత్యధిక వ్యక్తిగత టెస్ట్ ఇన్నింగ్స్.[16][17]
  • ఆయన 2004, 2006, 2007, 2009లో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) చేత అలన్ బోర్డర్ మెడల్‌ను అందుకున్నాడు.[18]
  • ఆయన 2021లో ఆస్ట్రేలియా పోస్ట్ లెజెండ్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపికయ్యాడు.[19]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Ricky Ponting". cricket.com.au. Cricket Australia. Archived from the original on 11 ఫిబ్రవరి 2014. Retrieved 19 జూలై 2014.
  2. "Ricky Ponting: రికీ పాంటింగ్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక". web.archive.org. 3 డిసెంబరు 2022. Archived from the original on 3 డిసెంబరు 2022. Retrieved 3 డిసెంబరు 2022.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Smith closes in on Bradman, reaches joint-second highest batting points ever". Retrieved 22 నవంబరు 2018.
  4. Richardson (2002), pp. 18–20.
  5. "Baby Emmy a cure for Ponting's trophy woes". The Sydney Morning Herald. 27 జూలై 2008. Retrieved 13 ఆగస్టు 2009.
  6. "Former Australian captain Ricky Ponting and his wife Rianna welcome baby daughter Matisse Ellie". The Daily Telegraph. 8 సెప్టెంబరు 2011. Retrieved 9 అక్టోబరు 2011.
  7. "DSEG on Twitter". 24 సెప్టెంబరు 2014. Retrieved 25 సెప్టెంబరు 2014.
  8. 8.0 8.1 "India tour of Australia, 2003/04 – Australia v India Scorecard". ESPNcricinfo. 30 డిసెంబరు 2003. Retrieved 29 డిసెంబరు 2014.
  9. 9.0 9.1 "Australia tour of South Africa, 2005/06 – South Africa v Australia Scorecard". ESPNcricinfo. 12 మార్చి 2006. Retrieved 29 డిసెంబరు 2014.
  10. 10.0 10.1 "Australia tour of New Zealand, 2004/05 – New Zealand v Australia Scorecard". ESPNcricinfo. 17 ఫిబ్రవరి 2005. Retrieved 29 డిసెంబరు 2014.
  11. "Wisden's Five Cricketers of the Year" (Press release). Cricinfo. Retrieved 27 జనవరి 2008.
  12. "Ponting scoops Allan Border Medal" (Press release). Cricinfo. 14 ఫిబ్రవరి 2004. Retrieved 27 జనవరి 2008.
  13. "Ponting becomes first to score centuries v all test playing nations". sportskeeda. 25 నవంబరు 2015.
  14. "Highest partnership by runs in ICC Champions Trophy". cricinfo.
  15. "Highest partnership for each wicket in ICC Champions Trophy". cricinfo.
  16. "2nd Test: Australia v India at Adelaide, Dec 12–16, 2003 – Cricket Scorecard – ESPN Cricinfo". Cricinfo.
  17. "Records – Test matches – Batting records – Most runs in a match on the losing side – ESPN Cricinfo". Cricinfo.
  18. "Australian Cricket Awards | Cricket Australia". Cricketaustralia.com.au. Retrieved 16 నవంబరు 2021.
  19. "Australia Post honours Australian Living Legends of Cricket". Australia Post Collectables. Retrieved 16 ఫిబ్రవరి 2021.