ఆత్మకూరు (వనపర్తి జిల్లా)
ఆత్మకూరు, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం లోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఆత్మకూరు గ్రామాన్ని, కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఆత్మకూరు ప్రధాన కేంద్రంగా ఉన్న ఆత్మకూరు మండలంలో చేర్చుతూ 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న ఆత్మకూరు పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] ఆత్మకూరు పట్టణానికి 29 కి.మీ.దూరంలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్ట్ ఉంది.
ఆత్మకూరు | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మకూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°20′11″N 77°48′20″E / 16.336389°N 77.805556°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండలం | ఆత్మకూరు |
జనాభా (2011) | |
- మొత్తం | 12,297 |
- పురుషుల సంఖ్య | 6,194 |
- స్త్రీల సంఖ్య | 6,103 |
- గృహాల సంఖ్య | 2,636 |
పిన్ కోడ్ | 509131 |
ఎస్.టి.డి కోడ్ | 08504 |
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 12,297, ఇందులో 6,194 మంది పురుషులు కాగా, 6,103 మంది మహిళలు ఉన్నారు. 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1495 మంది ఉన్నారు.[4] ఇది ఆత్మకూరు (సిటి) మొత్తం జనాభాలో 12.16%గా ఉంది. స్రీల సెక్స్ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 తో పోలిస్తే 985 గా ఉంది.అంతేగాక పట్టణంలో బాలల లైంగిక నిష్పత్తి 927 గా ఉంది.ఆత్మకూరు పట్టణ అక్షరాస్యత 72.39%గా ఉంది. పురుషుల అక్షరాస్యత 81.91% కాగా, మహిళా అక్షరాస్యత 62.82%.[4] ఆత్మకూరు జనణగణన పట్టణం మొత్తం 2,636 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను ఆత్మకూరు పురపాలకసంఘం అందిస్తుంది. పట్టణ పరిధిలో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి అధికారం ఉంది.
ఆత్మకూరు సంస్థానం చరిత్ర
మార్చుఆత్మకూరు సంస్థానానికి అమరచింత సంస్థానం అనే పేరుకూడా ఉంది.సా.శ.1268లో గోపాల్ రెడ్డితో ప్రారంభమైన ఆత్మకూరు ప్రస్థానం 1948లో సంస్థానం విలీనం అయ్యేవరకూ పరిపాలన కొనసాగింది. రాజా శ్రీరామభూపాల్ చివరి పరిపాలనా బాధ్యతలను నిర్వహించిన చివరి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆత్మకూరు (అమరచింత) సంస్థానం ఎందరో కవులను, రచయితలను పోషించి, సాహితీ సౌరభాలను పెంపొందింపచేసింది.ఈ సంస్థానాధీశులు అప్పటి కాలంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు చక్కటి ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడం వల్ల అవి నేటికీ సత్ఫలితాలనిస్తూ కొందరికి ప్రత్యక్షంగా మరి కొందరికి పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆత్మకూరు సంస్థానానికి రాజధానిగా తిపుడంపల్లి గ్రామం ఉండేది.ఆ గ్రామాన్ని పరిశీలిస్తే నాటి అప్పటి రాజుల ముందుచూపు ఎంత గొప్పదో తెలుస్తుంది.ఆత్మకూరు సంస్థానాధీశులు తిపుడంపల్లితో పాటు పలు గ్రామాలలో తవ్వించిన చెరువులు నేటికీ రైతన్నలకు ఆదెరువుగా మారాయి.ఆత్మకూరు సంస్థానం రాజధానిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన తిపుడంపల్లి కోట నేడు శిథిలావస్థకు చేరుకుంది.తూర్పు, ఉత్తర, దక్షిణం వైపున్న కోట ప్రాకారాలు, బురుజులు మాత్రమే గత చరిత్రకు సాక్షీభూతంగా నిలిచాయి.చంద్రారెడ్డి పరిపాలనా కాలంలో రాజధానిని తిపుడంపల్లి నుండి ఆత్మకూరుకు మార్చాడు.[5]
విద్యాసంస్థలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Wanaparthy.pdf
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 April 2021.
- ↑ 4.0 4.1 "Atmakur Census Town City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-23.
- ↑ Blog, My (2012-08-30). "జై తెలంగాణ... : తిపుడంపల్లి కోట". జై తెలంగాణ... Retrieved 2020-06-25.