ఆత్మాహుతి
అగ్నిని ఉపయోగించి ఆత్మహత్య చేసుకోడాన్ని సాధారణంగా ఆత్మాహుతి అంటారు. దీనిని నిరసన వ్యక్తం చేయడానికి ఒక తంత్రంగా ఉపయోగిస్తారు, 1963లో ముఖ్యంగా సౌత్ వియెత్నామీ ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేయడానికి థిచ్ క్వాంగ్ బుక్; ఇంకా 2006లో ఇరాక్ యుధ్ధంలో యునైటెడ్ స్టేట్స్ యొక్క జోక్యాన్ని నిరసిస్తూ మలాచి రిట్షర్ దీనిని ఉపయోగించారు.
భారతదేశం లాంటి కొన్ని భాగాలలో, ఆత్మాహుతిని ఒక ఆచారకర్మగా ఉపయోగించారు, దానిని సతి అని గుర్తిస్తారు; ఇందులో ఒక భార్య "తనకుతానుగా" తన భర్త యొక్క చితిమంటల మీద ఆత్మాహుతి చేసుకుంటుంది.
"ఇమ్మొలేట్" అనే పదానికి లాటిన్ మూలం "త్యాగం", సాధారణంగా ప్రసార మాధ్యమాల ఉపయోగం ఇమ్మొలేషన్ అంటే ఆత్మాహుతి అన్నప్పటికీ, అది మంటలకు పరిమితం కాదు.
ఈ రకమయిన ఆత్మహత్య సాపేక్షంగా చాలా అరుదు ఎందుకంటే, బాధితుడు చనిపోయేముందు చాలా బాధాకరమయిన అనుభూతిని ఎక్కువసేపు భరించాల్సి ఉంటుంది. దీనికి తోడు చనిపోయే ముందు మంటలను ఆపివేస్తే, బాధితుడు తీవ్రమయిన గాయాలతో, మచ్చలతో, భయంకరమయిన గాయాలు మనసు మీద కలిగించిన ఉద్వేగపూరితమయిన ప్రభావంతో గడపవలసిన ముప్పుకు ఇది దోహదం చేస్తుంది.
ఆత్మాహుతి దాడి
మార్చుఆత్మాహుతి దాడి Suicide attack అనే దాడిలో దాడిచేయు మనిషి (దాడిచేయువారు ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక దళం కావచ్చు), ఇతరులను చంపాలన్న తలంపుతో దాడి చేసి ఆ ప్రక్రియలో తానూ మృతి చెందుతాడు (ఉదాహరణకి కొలంబైన్, వర్జీనియా టెక్). అతి నిక్కచ్చిగా చెప్పాలంటే, దాడి చేయు వ్యక్తి ఆ దాడిలోనే మృతి చెందుతాడు, ఉదాహరణకి ఒక ప్రేలుడులో లేదా దాడి చేసిన మనిషి కారణంగా జరిగిన ప్రమాద ఘటనలో. ఈ పదాన్ని కొన్నిసార్లు దాడిచేయు వ్యక్తి యొక్క ఉద్దేశం స్పష్టంగా లేకపోయినా అతను దాడిచేస్తోన్న వ్యక్తి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో లేదా దాడి చేసిన వాడిని ఎదుర్కునే ప్రయత్నంలో దాడి చేసినవాడు చావడం ఖాయం అయినప్పటికీ ఆ సంఘతనకు స్వేచ్ఛగా వర్తిస్తారు, ఉదాహరణకి "పోలీసు అధికారి చేత ఆత్మహత్య", అంటే, సాయుధుడయిన ఒక పోలీసు అధికారిని బెదిరింప చూసినా, దాడి చేయచూసినా అది ఆ పోలీసు అధికారిని ప్రాణాంతకమయిన ప్రతిదాడి చేయడానికి ప్రోత్సహిస్తుంది. దీనిని హత్య/ఆత్మహత్య అని కూడా సూచించవచ్చు.
అలాంటి దాడులు విలక్షణంగా మతపరమయిన లేదా రాజకీయమైన సిధ్ధాంతాల చేత ప్రేరేపించబడి, అనేక పధ్ధతుల ద్వారా సాధించడం జరుగుతుంది. ఉదాహరణకి, దాడిచేయువాళ్ళు తమ లక్ష్యానికి దగ్గర కాగానే పెద్ద ధ్వనితో తమను తాము పేల్చివేసుకునే ముందు తమ శరీరానికే ప్రేలుడు పదార్ధాలను అంటించుకోవచ్చు. దీనిని ఆత్మాహుతి దాడి అనికూడా అంటారు. వాళ్ళు ఒక కారు బాంబుని లేదా ఇతర యంత్రసామగ్రిని గరిష్ఠ స్థాయిలో వినాశనం కలిగించేందుకు ఉపయోగించవచ్చు (ఉదాహరణకి రెండవ ప్రపంచ యుధ్ధంలో జపనీస్ కామికేజ్ పైలట్లు). అదనంగా, కౌమార దశలో ఉన్న విద్యార్థులు (చాలా తరచుగా US,, ఇటీవల ఫిన్‌లాండ్, జర్మనీలలో) పాఠశాలలలో కాల్పులు జరిపి మారణహోమం జరిపే రూపంలో ఇటీవలి కాలంలో అనేక గుర్తించదగ్గ ఆత్మాహుతి దాడులు చేసారు. తరచూ, ఈ ఆత్మాహుతి దాడులలో తుపాకులు లేదా ఇంట్లో తయారు చేసిన నాటు బాంబులు ఉంటాయి, వాటిని పాఠశాలలలోకి లేదా కళాశాల కాంపస్‌లలోకి తీసుకుని వస్తారు. దాడి తర్వాత, దాడిచేసిన మనిషి పట్టుబడే లోపు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది.