ఆదిలాబాద్ పురపాలకసంఘం
ఆదిలాబాద్ పురపాలక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది మొదటి తరగతికి చెందిన మునిసిపాలిటీ [1] ఆదిలాబాద్ పట్టణం జిల్లా పరిపాలనా కేంద్రం.
ఆదిలాబాద్ | |
స్థాపన | మొదటి తరగతి, 1956, |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | municipality.in/.అధికారిక వెబ్ సైట్ |
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఆదిలాబాద్ మునిసిపాలిటీలో 117,167 జనాభాతో 20.76 చ.కి.లో విస్తరించి ఉంది.పట్టణంలో మగవారి సంఖ్య 59,448, మహిళలు సంఖ్య 57,719. [2] మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య 12993. ఇది ఆదిలాబాద్ మండలం మొత్తం జనాభాలో 11.09%. ఆదిలాబాద్ మునిసిపాలిటీలో ఆడ వారి నిష్పత్తి రాష్ట్ర సగటు 993కు వ్యతిరేకంగా 971గా ఉంది. అంతేకాక ఆదిలాబాద్‌లో బాలల నిష్పత్తి 932 గా ఉంది,అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే. ఆదిలాబాద్ నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కన్నా 78.74% ఎక్కువ. ఆదిలాబాద్‌లో పురుషుల అక్షరాస్యత 85.84% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.46%.వీటికి మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను సమకూరుస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోని రహదారులను నిర్మించడానికి, నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించే అధికారం పురపాలక సంఘానికి చట్టం ద్వారా అధికారాలు సంక్రమించబడ్డాయి.
పురపాలక సంఘంలో మొత్తం 26,047 ఇళ్లు, 36 ఎన్నికల వార్డులు, నాలుగు రెవెన్యూ వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 60%లో 30 నోటిఫైడ్, 05 నోటిఫైడ్ మురికివాడలు 274 కి.మీటర్ల పొడవు కలిగిన కచ్చా, పక్కా రోడ్లు,212 కి.మీటర్లు పొడవు కలిగిన కచ్చా, పక్కా మురుగు నీటి పారుదల కాలువలు ఉన్నాయి.[3]
మూలాలు
మార్చు- ↑ "Adilabad Municipality". adilabadmunicipality.telangana.gov.in. Retrieved 2024-08-17.
- ↑ "Adilabad City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-01-29.
- ↑ "Adilabad Municipality". adilabadmunicipality.telangana.gov.in. Archived from the original on 2020-01-29. Retrieved 2020-01-29.