ఆపరేషన్ పేపర్‌క్లిప్

జర్మను శాస్త్రవేత్తలను అమెరికాకు తీసుకువెళ్ళిన అమెరికా ప్రభుత్వ రహస్య చర్య

ఆపరేషన్ పేపర్‌క్లిప్ అనేది అమెరికాకు చెందిన జాయింట్ ఇంటెలిజెన్స్ ఆబ్జెక్టివ్స్ ఏజెన్సీ (JIOA) చేపట్టిన రహస్య కార్యక్రమం, దీనిని సైనిక సిఐసికి చెందిన ప్రత్యేక ఏజెంట్లు నిర్వహించారు. ఇందులో భాగంగా, 1,600 మందికి పైగా జర్మను శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను, వెర్నర్ వాన్ బ్రాన్, అతని V-2 రాకెట్ బృందాన్నీ, 1945, 1959 ల మధ్య అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీసుకువెళ్లారు. వీరిలో చాలామంది నాజీ పార్టీలో మాజీ సభ్యులు, మరికొందరు మాజీ నాయకులు. [1]

సోవియట్-అమెరికా ప్రచ్ఛన్న యుద్ధంలోను, అంతరిక్ష పోటీలోనూ అమెరికాకు ప్రయోజనం సాధించడమే ఆపరేషన్ పేపర్‌క్లిప్ ప్రాధమిక ఉద్దేశం. 1946 అక్టోబరు 22 న ఒక రాత్రి సమయంలో సోవియట్ యూనియన్, ఆపరేషన్ ఓసోవియాఖిమ్‌ పేరుతో 2,200 మందికి పైగా జర్మను నిపుణులను వారి కుటుంబ సభ్యులతో సహా -మొత్తం 6,000 మందికి పైగా- బలవంతంగా నియమించుకుని దూకుడు ప్రదర్శించింది.[2] జర్మను శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యం సోవియట్ అధీనం లోకి వెళ్తే, వాళ్ళు ఈ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందుతారనే భయంతో అమెరికా శాస్త్రీయ సిబ్బందిని "తరలించే ఆపరేషన్" మొదలుపెట్టింది.

1945 ఫిబ్రవరిలో, సుప్రీం హెడ్ క్వార్టర్స్ అలైడ్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ (SHAEF) టి-ఫోర్స్ లేదా స్పెషల్ సెక్షన్ల సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. ఇది జూన్ నాటికి 2 వేల పైచిలుకు సిబ్బంది స్థాయికి పెరిగింది. సింథటిక్ రబ్బరు, చమురు ఉత్ప్రేరకాలు, కొత్త సాయుధ పరికరాల నమూనాలు, వి -2 (రాకెట్) ఆయుధాలు, జెట్, రాకెట్ చోదక విమానాలు, నావికా పరికరాలు, ఫీల్డ్ రేడియోలు, రహస్య రాత రసాయనాలు, ఏరో మెడిసిన్ పరిశోధన, గ్లైడర్లు మొదలైన అధిక ప్రాధాన్యత కలిగిన 5,000 మంది జర్మను "శాస్త్రీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన వ్యక్తులను" టి-ఫోర్స్ పరిశీలించింది. [3]

1946 సెప్టెంబర్ 3 న జారీ చేసిన రహస్య ఆదేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రూమన్, అధికారికంగా ఆపరేషన్ పేపర్‌క్లిప్‌ను ఆమోదించాడు. వెయ్యి మంది జర్మను శాస్త్రవేత్తలను "తాత్కాలిక, పరిమిత సైనిక అదుపు" లోకి తీసుకునేలా ఆపరేషన్ను విస్తరించాడు. [4] [5] [6]

పట్టుకుని నిర్బంధించారు మార్చు

 
సోవియట్ జోన్ (ఎరుపు), అంతర్గత జర్మను సరిహద్దు (భారీ బ్లాక్ లైన్). జూలై 1945లో బ్రిటిష్, అమెరికన్ దళాలు ఉపసంహరించుకున్న జోన్ (పర్పుల్)ను హైలైట్ చేస్తూ యుద్ధానంతర జర్మనీలో మిత్రరాజ్యాల ఆక్రమణ ప్రదేశాలను చూడవచ్చు. ప్రస్తుత లాండర్ (సమాఖ్య రాష్ట్రాలు) స్థాపించబడక ముందు ప్రాంతీయ సరిహద్దులు నాజీ జర్మనీకి చెందినవి.

ప్రారంభంలో అమెరికా, కంబైన్డ్ ఇంటెలిజెన్స్ ఆబ్జెక్టివ్స్ సబ్‌కమిటీ (CIOS)ని సృష్టించింది. ఇది T-ఫోర్స్‌ల ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలపై సమాచారాన్ని అందించింది. వాళ్ళు శాస్త్రీయ, సైనిక, పారిశ్రామిక సంస్థాపనలను (వాటిలోని ఉద్యోగులను) లక్ష్యంగా చేసుకుంది. జపాన్‌పై యుద్ధంలో ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఇన్‌ఫ్రారెడ్ వంటి అధునాతన సాంకేతికతలు; గతంలో జపాన్‌కు ఏ సాంకేతికత అందించారో కనుగొనడం; చివరకు అక్కడ జరిగే పరిశోధనలను నిలిపివేయడాలు వారి తొలి ప్రాధాన్యతలు.

పరిశోధనను నిలిపివేసే ప్రాజెక్ట్‌కు "ప్రాజెక్ట్ సేఫ్‌హావెన్" అనే సంకేతనామం పెట్టారు. మొదట్లో దీని లక్ష్యం సోవియట్ యూనియన్‌ వ్యతిరేకత కాదు; నాజీ జర్మనీ పట్ల సానుభూతితో ఉన్న స్పెయిన్, అర్జెంటీనా లేదా ఈజిప్ట్ వంటి దేశాలకు జర్మనీ శాస్త్రవేత్తలు వలస వెళ్లి తమ పరిశోధనలను కొనసాగిస్తారేమోననే ఆందోళన వారికి ఉండేది.[7][8] జర్మను శాస్త్రవేత్తలు ఇతర దేశాలకు వలస వెళ్ళడం వలన ఎదురయ్యే సమస్యలను నివారించడానికి, ఆయా దేశాల్లో సాంకేతిక పురోగతిని నిలువరించడానికీ ఉన్నత స్థాయి వ్యక్తులను వెతికి వారిని కిడ్నాప్ చేయడమే CIOS కర్తవ్యంగా ఉండేది. [9]

1945 జూలై 1 నాటికి సోవియట్ ఆక్రమిత ప్రాంతంలో భాగమైన సాక్సోనీ, తురింగియాపై అమెరికా దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా బెర్లిన్ ప్రాంతం నుండి అనేక జర్మను పరిశోధనా సంస్థలను, సిబ్బందినీ ఈ రాష్ట్రాలకు తరలించారు. జర్మను శాస్త్రీయ, సాంకేతిక నైపుణ్యం సోవియట్ అధీనం లోకి వెళ్తే, వారిని అమెరికా ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గిపోతుందనే భయంతోను, సోవియట్ యూనియన్ ఈ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందకూడదనుకోవడంతోనూ, యునైటెడ్ స్టేట్స్ సాక్సోనీ తురింగియాల నుండి శాస్త్రీయ సిబ్బందిని "తరలించే ఆపరేషన్"ని మొదలుపెట్టింది.

1947 నాటికి ఈ తరలింపు ఆపరేషన్ ద్వారా 1,800 మంది సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలను, వారి కుటుంబ సభ్యులు 3,700 మందితో సహా సమీకరించింది. [10] ప్రత్యేక నైపుణ్యాలు లేదా పరిజ్ఞానం ఉన్నవారిని నిర్బంధ, విచారణ కేంద్రాలకు తీసుకెళ్లారు. కొన్ని సందర్భాల్లోనైతే వారిని కొన్ని నెలల పాటు అదుపులోకి తీసుకుని విచారించారు.

కొంతమంది శాస్త్రవేత్తలను ఆపరేషన్ ఓవర్‌కాస్ట్‌లో భాగంగా సమీకరించి, వారిలో చాలా మందిని పరిశోధనా సౌకర్యాలు గానీ, పని గానీ లేని గ్రామీణ ప్రాంతాలకు తరలించారు; వారికి స్టైపెండ్‌లు ఇచ్చి, వారిని విడిచిపెట్టకుండా నిరోధించడానికి వారానికి రెండుసార్లు పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్ళి హాజరవ్వాలని నిర్బంధించారు. పరిశోధన, బోధనల కోసం, సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలను "అవసరమైన ఇంటెలిజెన్స్ సమాచారమంతా వారి నుండి పొందినట్లు అన్ని ఏజెన్సీలు సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే" విడుదల చేయాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదేశించారు.

ఆక్రమిత జర్మనీ లోని పశ్చిమ భాగంపై అధికార పరిధిని కలిగి ఉన్న అమెరికా మిలిటరీ గవర్నమెంట్ కార్యాలయం (OMGUS), తరలింపుదారుల స్థితిని పరిశీలించడానికి 1947 నవంబరు 5 న ఒక సమావేశాన్ని నిర్వహించింది. అమెరికాకు వ్యతిరేకంగా తరలింపుదారులు చేసిన ఆర్థిక పరమైన ఫిర్యాదులు, అమెరికా వారి "యుద్ధ చట్టాలు లేదా ల్యాండ్ వార్‌ఫేర్ నియమాల ఉల్లంఘన"లపై అది విచారించింది. OMGUS ఇంటెలిజెన్స్ డైరెక్టర్ RL వాల్ష్ తరలింపుదారులను మూడవ ప్రపంచంలో పునరావాసం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దీనిని జర్మన్లు జనరల్ వాల్ష్ యొక్క "ఉర్వాల్డ్-ప్రోగ్రామ్" (ఆటవిక కార్యక్రమం)గా పేర్కొన్నారు; అయితే, ఈ కార్యక్రమం అమల్లోకి రాలేదు. 1948లో నిర్వాసితులు అమెరికా నుండి 69.5 మిలియన్ల రీచ్‌మార్క్‌ల సెటిల్‌మెంట్‌లను పొందారు. తరువాతి కాలంలో పశ్చిమ జర్మనీ అధికారిక కరెన్సీగా డ్యూయిష్ మార్క్‌ను ప్రవేశపెట్టినపుడు జరిగిన కరెన్సీ సంస్కరణలో ఈ సొమ్ము విలువ తీవ్రంగా తగ్గించబడింది. [11]

మూడు సంవత్సరాల పాటు అమెరికా, జర్మనీకి చెందిన అత్యుత్తమ మేధావులలో కొందరిని బంధ్జించి ఉంచిందని జాన్ గింబెల్ అన్నాడు. తద్వారా జర్మనీ వారి నైపుణ్యాలను పొందలేకపోయింది. [12]

అమెరికా లోకి రాక మార్చు

 
టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్‌లో 104 మంది రాకెట్ శాస్త్రవేత్తల (ఏరోస్పేస్ ఇంజనీర్లు) బృందం

1945 మేలో, అమెరికా నౌకాదళం Hs 293 క్షిపణిని కనుగొన్న హెర్బర్ట్ A. వాగ్నెర్‌ను "నిర్బంధంలో తెచ్చుకుంది"; రెండు సంవత్సరాల పాటు అతను, మొదట కాజిల్ గౌల్డ్‌లోని స్పెషల్ డివైసెస్ సెంటర్‌లోను, న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని హెంప్‌స్టెడ్ హౌస్‌లోనూ పనిచేశాడు; 1947లో, అతను నావల్ ఎయిర్ స్టేషన్ పాయింట్ ముగూకి మారాడు. [13]

1945 ఆగస్టులో అమెరికా ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ కు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగానికి చెందిన రాకెట్ బ్రాంచ్ అధిపతి కల్నల్ హోల్గర్ టోఫ్టోయ్, రాకెట్ శాస్త్రవేత్తలకు ఒక-సంవత్సర ఒప్పందాలను అందించాడు; 127 మంది వాటిని ఆమోదించారు. 1945 సెప్టెంబరులో, ఏడుగురు రాకెట్ శాస్త్రవేత్తల (ఏరోస్పేస్ ఇంజనీర్లు) మొదటి బృందం బోస్టన్ నౌకాశ్రయంలోని లాంగ్ ఐలాండ్‌లో ఉన్న ఫోర్ట్ స్ట్రాంగ్‌కు చేరుకుంది: వెర్నర్ వాన్ బ్రాన్, ఎరిచ్ డబ్ల్యూ. న్యూబెర్ట్, థియోడర్ ఎ. పాపెల్, విలియం ఆగస్ట్ షుల్జ్, ఎబర్‌హార్డ్ రీస్, జంగెర్ట్, వాల్టర్ ష్విడెట్జ్కీ -ఈ ఏడుగురు ఆ బృంద సభ్యులు. [14]

1945 చివరిలో మొదలుపెట్టి మూడు రాకెట్ - శాస్త్రవేత్తల బృందాలను టెక్సాస్ లోని ఫోర్ట్ బ్లిస్, న్యూ మెక్సికో లోని వైట్ సాండ్స్ ప్రోవింగ్ గ్రౌండ్స్ వద్ద "యుద్ధ విభాగపు ప్రత్యేక ఉద్యోగులు" గా విధులు నిర్వర్తించడానికి నియమించారు.[15][16]

1949 జూన్ 1 న అలబామాలోని హంట్స్‌విల్లే లోని రెడ్‌స్టోన్ ఆర్సెనల్‌ను రాకెట్ పరిశోధన, అభివృద్ధి కోసం దాని ఆర్డినెన్స్ రాకెట్ కేంద్రంగా నియమించారు. 1950 ఏప్రిల్ 1న వాన్ బ్రాన్‌ను, అతని 130 మంది పేపర్‌క్లిప్ సభ్యులతో కూడిన బృందంతో సహా రెడ్‌స్టోన్ ఆర్సెనల్‌కు బదిలీ చేసారు.

1945, 1952 మధ్యకాలంలో అమెరికా వైమానిక దళం 260 మంది పేపర్‌క్లిప్ శాస్త్రవేత్తలను దిగుమతి చేసుకోవడానికి స్పాన్సర్ చేసింది. వీరిలో 36 మంది జర్మనీకి తిరిగి వెళ్ళిపోగా, ఒకరు (వాల్టర్ ష్రైబర్) అర్జెంటీనాకు వలస వెళ్ళాడు.[17]

ఎనభై ఆరుగురు ఏరోనాటికల్ ఇంజనీర్లను రైట్ ఫీల్డ్ ఓహియోకు బదిలీ చేసారు. అక్కడ ఆపరేషన్ లస్టీ (లుఫ్ట్వాఫ సీక్రెట్ టెక్నాలజీ) కింద స్వాధీనం చేసుకున్న జర్మనీకి చెందిన లుఫ్ట్వాఫ్ విమానాలు పరికరాలు ఉన్నాయి.[18]

మొత్తంమీద 1990 వరకు జరిపిన కార్యకలాపాల ద్వారా ఆపరేషన్ పేపర్‌క్లిప్ 1,600 మందిని దిగుమతి చేసుకుంది. ఇది అమెరికా, బ్రిటన్‌లకు చెల్లించాల్సిన మేధో నష్టపరిహారంలో భాగం. పేటెంట్లు, పారిశ్రామిక ప్రక్రియల రూపంలో ఉన్న దీని విలువ $ 10 బిలియన్లు అని అంచనా.[13][19]

పురస్కారాలు మార్చు

నాసా విశిష్ట సేవా పతకం అనేది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం. నాసా లో రెండు దశాబ్దాలకు పైగా చేసిన సేవ, నాయకత్వాలకు గుర్తింపుగా ఆపరేషన్ పేపర్‌క్లిప్ లోని నలుగురు సభ్యులకు 1969 లో నాసా విశిష్ట సేవా పతకాన్ని ప్రదానం చేశారు. వారు: కర్ట్ డెబుస్, ఎబెర్హార్డ్ రీస్, ఆర్థర్ రుడోల్ఫ్, వెర్న్హర్ వాన్ బ్రాన్. ఎర్నెస్ట్ గీస్లర్‌కు ఈ పతకాన్ని 1973లో ప్రదానం చేశారు.

చంద్రుడిపై ఉన్న రెండు క్రేటర్లకు పేపర్‌క్లిప్ శాస్త్రవేత్తల పేరు పెట్టారు. వారు నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ మొదటి డైరెక్టర్ కర్ట్ డెబస్ పేరిట ఒకటి, వాన్ బ్రాన్ పేరిట రెండవది.

శాస్త్రీయ విజయాలు మార్చు

వెర్న్హెర్ వాన్ బ్రాన్, సాటర్న్ V అంతరిక్ష వాహక నౌక ప్రధాన రూపశిల్పి. చంద్రుడికి మానవ యాత్రలు చేసేందుకు దీన్నే వాడారు.[20]

అధిక వేగాల వద్ద విమానాల పనితీరును మెరుగుపరిచే స్వెప్ట్ వింగ్ డిజైన్ను అడాల్ఫ్ బుసెమాన్ అభివృద్ధి చేసాడు.[21][22]

కీలక నియామకాలు మార్చు

అమెరికా లోకి తీసుకువచ్చిన సలహాదారులు
హెర్మన్ ఒబెర్త్
ఏరోనాటిక్స్, రాకెట్రీ రంగం 

హాన్స్ అమ్ట్మాన్ హెర్బర్ట్ ఆక్స్టర్

ఎరిచ్ బాల్

ఆస్కార్ బౌషింగర్

హెర్మన్ బెడ్యూర్ఫ్టిగ్

రూడీ బీచెల్

అంటోన్ బీర్

హెర్బర్ట్ బెర్గెలర్

మాగ్నస్ వాన్ బ్రాన్

వెర్నర్ వాన్ బ్రాన్

థియోడర్ బుచ్హోల్డ్ [de]

వాల్టర్ బురోస్

అడాల్ఫ్ బుస్మాన్

GN కాన్స్టాన్

వెర్నర్ దామ్

కొన్రాడ్ డాన్నెన్‌బర్గ్

కర్ట్ హెచ్. డెబస్

గెర్డ్ డి బీక్

వాల్టర్ డోర్న్‌బెర్గర్

గెర్హార్డ్ డ్రా

ఫ్రెడరిక్ డ్యూయర్

ఎర్నెస్ట్ R. G. ఎకెర్ట్

ఒట్టో ఐసెన్‌హార్డ్ట్

క్రాఫ్ట్ ఆర్నాల్డ్ ఎహ్రికే

ఆల్ఫ్రెడ్ ఫింజెల్

ఎడ్వర్డ్ ఫిషెల్

కార్ల్ ఫ్లీషర్

అంటోన్ ఫ్లెట్నర్

అన్సెల్మ్ ఫ్రాంజ్

హెర్బర్ట్ ఫుర్మాన్

ఎర్నెస్ట్ గీస్లర్

వెర్నర్ గెంగెల్‌బాచ్

డైటర్ గ్రౌ

హన్స్ గ్రూనే

హెర్బర్ట్ గుండెల్

ఫ్రిట్జ్ హేబర్

హీన్జ్ హేబర్

కార్ల్ హేగర్

గుంథర్ హౌకోల్

కార్ల్ హీంబర్గ్

ఎమిల్ హెల్బ్రాండ్

గెర్హార్డ్ బి. హెల్లర్

బ్రూనో హెల్మ్

రుడాల్ఫ్ హెర్మాన్

బ్రూనో హ్యూసింగర్

హన్స్ హ్యూటర్

Guenther Hintze

సిఘర్డ్ F. హోర్నర్

కర్ట్ హోహెనెంసెర్

ఆస్కార్ హోల్డరర్

హెల్మట్ హార్న్

హన్స్ హెన్నింగ్ హోసెంథియన్

డైటర్ హజెల్

వాల్టర్ జాకోబి

ఎరిచ్ కాస్చిగ్

ఎర్నెస్ట్ క్లాస్

థియోడర్ నాకే

సీగ్‌ఫ్రైడ్ మోకాలి

హీన్జ్-హెర్మాన్ కోయెల్

గుస్తావ్ క్రోల్

విల్లీ కుబెర్గ్

వెర్నర్ కుయర్స్

హెర్మన్ కుర్జ్వెగ్

హెర్మాన్ లాంగే

హన్స్ లిండెన్‌బర్గ్

హన్స్ లిండెన్‌మేయర్

అలెగ్జాండర్ మార్టిన్ లిప్పిష్

రాబర్ట్ లూసర్

హన్స్ మౌస్

హెల్ముట్ మెర్క్

జోసెఫ్ మిచెల్

హన్స్ మిల్డే

హీన్జ్ మిల్లింగర్

రుడాల్ఫ్ మిన్నింగ్

విలియం మ్రాజెక్

హన్స్ ముల్తాప్

ఎరిక్ న్యూబెర్ట్

గెర్హార్డ్ న్యూమాన్

హన్స్ వాన్ ఓహైన్ (జర్మన్ జెట్ ఇంజన్ల రూపకర్త)

రాబర్ట్ పేట్జ్

హన్స్ పలారో

కర్ట్ పాట్

హన్స్ పాల్

ఫ్రిట్జ్ పౌలి

ఆర్నాల్డ్ పీటర్

హెల్ముత్ ప్ఫాఫ్

థియోడర్ పాపెల్

వెర్నర్ రోసిన్స్కి

హెన్రిచ్ రోత్

లుడ్విగ్ రోత్

ఆర్థర్ రుడాల్ఫ్

ఫ్రెడరిక్ వాన్ సౌర్మ

ఎడ్గార్ షాఫెర్

మార్టిన్ షిల్లింగ్

హెల్ముట్ ష్లిట్

ఆల్బర్ట్ షులర్

ఆగస్ట్ షుల్జ్

వాల్టర్ ష్విడెట్జ్కీ

ఎర్నెస్ట్ స్టెయిన్‌హాఫ్

వోల్ఫ్‌గ్యాంగ్ స్టీరర్

హెన్రిచ్ స్ట్రక్

ఎర్నెస్ట్ స్టుహ్లింగర్

కర్ట్ ట్యాంక్

బెర్న్‌హార్డ్ టెస్మాన్

అడాల్ఫ్ థీల్

జార్జ్ వాన్ టైసెన్‌హౌసెన్

వెర్నర్ టిల్లర్

JG షింకెల్

ఆర్థర్ అర్బన్స్కీ

ఫ్రిట్జ్ వాండర్సీ

రిచర్డ్ వోగ్ట్

వోల్డెమార్ వోయిగ్ట్ (మెస్సర్స్మిట్ P.1101 రూపకర్త)

వెర్నర్ వోస్

థియోడర్ వావ్

హెర్బర్ట్ A. వాగ్నెర్

హెర్మన్ రుడాల్ఫ్ వాగ్నర్

హెర్మన్ వీడ్నర్

గుంటర్ వెండ్ట్

జార్జ్ రికీ

వాల్టర్ ఫ్రిట్జ్ వైస్మాన్

ఫిలిప్ వోల్ఫ్‌గ్యాంగ్ జెట్లర్-సీడెల్

ఆర్కిటెక్చర్
హీన్జ్ హిల్టెన్,[23] హన్నెస్ లుహర్సెన్.[24]
ఎలక్ట్రానిక్స్ - మార్గదర్శక వ్యవస్థలు, రాడార్, ఉపగ్రహాలతో సహా 

విల్హెల్మ్ ఏంజెల్ ఎర్నెస్ట్ బార్స్

జోసెఫ్ బోహ్మ్

హన్స్ ఫిచ్ట్నర్

హన్స్ ఫ్రెడ్రిచ్

ఎడ్వర్డ్ గెర్బెర్

జార్జ్ గౌబౌ

వాల్టర్ హ్యూస్సర్మాన్

ఒట్టో హెన్రిచ్ హిర్ష్లర్

ఒట్టో హోబర్గ్

రుడాల్ఫ్ హోల్కర్

హన్స్ హోల్మాన్

హెల్ముట్ హోల్జర్

హోర్స్ట్ కెడెస్డీ

కర్ట్ లెహోవెక్

కర్ట్ లిండ్నర్

JW ముహెల్నర్

ఫ్రిట్జ్ ముల్లర్

జోహన్నెస్ ప్లెండ్ల్

ఫ్రిట్జ్ కార్ల్ ప్రీక్స్చాట్

ఎబర్‌హార్డ్ రీస్

గెర్హార్డ్ రీసిగ్

హ్యారీ రూపే

హీన్జ్ ష్లికే

వెర్నర్ సైబర్

ఒత్మర్ స్టూట్జర్

ఆల్బిన్ విట్మాన్

హ్యూగో వోర్డెమాన్

ఆల్బర్ట్ జైలర్

హన్స్ కె. జీగ్లర్

పదార్థ శాస్త్రం (అధిక ఉష్ణోగ్రత)
క్లాజ్ షుఫెలెన్, రుడాల్ఫ్ ష్లిడ్ట్.[25][26]
ఔషధం – జీవ ఆయుధాలు, రసాయన ఆయుధాలు, అంతరిక్ష వైద్యం
థియోడర్ బెంజింజర్, రుడాల్ఫ్ బ్రిల్, కొన్రాడ్ జోహన్నెస్ కార్ల్ బట్నర్, రిచర్డ్ లిండెన్‌బర్గ్, వాల్టర్ ష్రెయిబర్, హుబెర్టస్ స్ట్రుగోల్డ్, హన్స్ జార్జ్ క్లామన్, ఎరిచ్ ట్రాబ్
భౌతికశాస్త్రం
గుంటెర్ గుట్టెయిన్, గెర్హార్డ్ ష్వేసింగర్, [27] గాట్‌ఫ్రైడ్ వెహ్నర్, హెల్ముట్ వీక్‌మాన్,[28] ఫ్రైడ్‌వార్డ్ వింటర్‌బర్గ్ .
కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్
హెల్ముట్ పిచ్లర్, లియోనార్డ్ ఆల్బర్ట్స్, ఎర్నెస్ట్ డోనాత్, హన్స్ షాపెర్ట్, మాక్స్ జోసెన్‌హాస్, కర్ట్ బ్రెట్‌ష్నీడర్, ఎరిచ్ ఫ్రేస్

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు  మార్చు

  1. Jacobsen, Annie (2014). Operation Paperclip: The Secret Intelligence Program to Bring Nazi Scientists to America. New York: Little, Brown and Company. p. Prologue, ix. ISBN 978-0-316-22105-4.
  2. "Operation "Osoaviakhim"". Russian space historian Anatoly Zak. Retrieved May 4, 2018.
  3. "Chapter XVII: Zone and Sector". history.army.mil. Retrieved 2021-05-02.
  4. The Paperclip Conspiracy: The Hunt for the Nazi Scientists, 1987, Tom Bower, et al. p. 178
  5. Jacobsen, pp. 229.
  6. Lasby, pp. 177.
  7. "The OSS and Project SAFEHAVEN — Central Intelligence Agency". www.cia.gov. Archived from the original on 2020-12-22. Retrieved 2023-07-11.
  8. Slany, William Z. (1997). U. s. and allied efforts to recover and restore gold and other assets stolen or hidden by ... [Place of publication not identified]: U S Govt. Printing Office. p. 37. ISBN 9997739213.
  9. O'REAGAN, DOUGLAS M. (2021). TAKING NAZI TECHNOLOGY : allied exploitation of german science after the second world war. [S.l.]: JOHNS HOPKINS UNIV PRESS. p. 82. ISBN 9781421439846.
  10. Denny, Mark (8 October 2019). Rocket science : from fireworks to the photon drive. Cham, Switzerland. p. 37. ISBN 9783030280802.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  11. Ten years of German unification : transfer, transformation, incorporation?. Birmingham, UK: University of Birmingham, University Press. 2002. ISBN 9781902459127.
  12. "U.S. Policy and German Scientists: The Early Cold War", Political Science Quarterly, Vol. 101, No. 3, (1986), pp. 433–451
  13. 13.0 13.1 Hunt, Linda (1991). Secret Agenda: The United States Government, Nazi Scientists, and Project Paperclip, 1945 to 1990. New York: St.Martin's Press. pp. 6, 21, 31, 17204, 259. ISBN 978-0-312-05510-3.
  14. McGovern, James (1964). Crossbow and Overcast. New York: W. Morrow. pp. 100, 104, 173, 207, 210, 242.
  15. Huzel, Dieter K (1960). Peenemünde to Canaveral. Englewood Cliffs NJ: Prentice Hall. pp. 27, 226.
  16. Laney, Monique (2015). German Rocketeers in the Heart of Dixie: Making Sense of the Nazi Past During the Civil Rights Era. New Haven and London: Yale University Press. pp. 26. ISBN 978-0-300-19803-4.
  17. Project Paperclip: German Scientists and the Cold War, 1975, Clarence G. Lasby, et al. p. 257
  18. "The End of World War II". (television show, Original Air Date: 2-17-05). A&E. Archived from the original on September 27, 2007. Retrieved June 4, 2007.
  19. Naimark. 206 (Naimark cites Gimbel, John Science Technology and Reparations: Exploitation and Plunder in Postwar Germany) The $10 billion compare to the 1948 US GDP $258 billion, and to the total Marshall plan (1948–52) expenditure of $13 billion, of which Germany received $1.4 billion (partly as loans).
  20. Harbaugh, Jennifer (2016-02-18). "Biography of Wernher Von Braun". NASA (in ఇంగ్లీష్). Retrieved 2018-05-01.
  21. AP. "Adolf Busemann, 85, Dead; Designer of the Swept Wing" (in ఇంగ్లీష్). Retrieved 2018-05-01.
  22. "Operation Paperclip | Defense Media Network". Defense Media Network (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-05-01.
  23. Roop, Lee (January 26, 2016). "Rare architect's drawings show Huntsville's change from cotton town to Rocket City". al.com.
  24. "Luehrsen". www.astronautix.com.
  25. "Scheufelen". www.astronautix.com.
  26. "Schlidt". www.astronautix.com.
  27. "Variable focal length focusing lens system and device therefor". google.com.
  28. "Historical Overview of NSSL: We build on the foundations established by our predecessors". www.nssl.noaa.gov.