ఆబోతుల వెంకటరావు

ఆబోతుల వెంకటరావు విజయనగరం జిల్లా జమ్మునారాయణపురం గ్రామానికి చెందిన జవాన్. అతను ఆత్మాహుతి ముష్కర మూకల్ని మట్టుబెట్టి భారత ప్రభుత్వ ‘శౌర్యచక్ర’ పురస్కారం అందుకోగలిగాడు.[1]

జీవిత విశేషాలు మార్చు

అతను విజయనగరం వద్ద జమ్మునారాయణపురం గ్రామానికి చెందినవాడు. ఇంటర్‌ మీడియట్‌ వరకూ చదివాడు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న ఆసక్తి వల్ల సాధన చేసేడు. ఇంటర్‌మీడియట్‌ పూర్తయిన సమయంలో తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో డాక్యుమెంటేషన్‌లో నెగ్గలేకపోయాడు. ఆ తర్వాత 2009లో విజయనగరం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఎంపికయ్యాడు. ప్రస్తుతం ప్రత్యేక విధుల్లో భాగంగా అతనిని యూఎన్‌ఓలో సభ్యత్వం పొందిన ఆఫ్రికాలోని సౌత్‌ సూడాన్‌కి పంపించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విధులు నిర్వరిస్తున్నాడు. 2013లో శ్యామలని వివాహం చేసుకున్నాడు.  మూడున్నరేళ్ల హరిణి, నాలుగునెలల ఈషా అతని సంతానం.[2]

సాహసం మార్చు

2016 అక్టోబర్‌ 6వ తేదీన అతను జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ నియంత్రణ రేఖలో విధులు నిర్వరిస్తున్నాడు. తానున్న 8 మద్రాస్‌ జనరల్‌ రెజిమెంట్‌ ముందు అలజడి జరిగింది. అతనిలో ఏదో జరుగుతోంది అనే అనుమానం మొదలయింది. వెంటనే శత్రువులు చొరబడ్డారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు మిలిటెంట్లు తచ్చాడుతున్నారు. వారు ఆర్మీ రెజిమెంట్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే సమయం లేనందున అప్రమత్తం కావాలని అతను సైన్యానికి సూచనలు ఇచ్చాడు. ఇది గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. క్యాంప్‌లోకి చొరబడి ఆత్మాహుతి చేసుకోవాలన్నది వారి పన్నాగం. అదే జరిగితే పది నిమిషాల్లో మొత్తం బూడిదయ్యేది. సుమారు 350 మంది సైనికులు బలయ్యేవారు. గతంలో కమాండ్‌ కంట్రోల్‌ కోర్సులో పొందిన శిక్షణ అతనికి ఎంతో ఉపయోగపడింది. ఏకే 47తో పాయింట్‌ వ్యూలో ఒకే షాట్‌లో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాడు. ఆ వెంటనే మూడో తీవ్రవాదిని కూడా మట్టుబెట్టాడు. డ్యూటీ పోస్టులో ఉన్న ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా కాకుండా కాపాడాడు.

శౌర్య చక్ర గ్రహీత మార్చు

అతను చేసిన ఈ సాహసానికి గుర్తింపుగా అతనికి రాష్ట్రపతి కోవింద్‌ నుంచి శౌర్య పురస్కారం లభించింది. 60 ఏళ్లలో వారి రెజిమెంట్‌కు వచ్చిన తొలి శౌర్య అవార్డు కావడం విశేషం.

మూలాలు మార్చు

  1. "VENKATARAO ABOTULA SHAURYA CHAKRA". Archived from the original on 2018-11-01. Retrieved 2018-07-17.
  2. "శౌర్యానికి ప్రతిరూపం".

బయటి లంకెలు మార్చు