ఆమె (2019 సినిమా)
ఆమె 2019లో విడుదలైన తెలుగు సినిమా. ‘ఆడై’ పేరుతో తమిళంలో నిర్మించిన ఈ సినిమాను తెలుగులోకి ‘ఆమె’ పేరుతో చిత్ర తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రిత్వి క్రియేషన్స్ బ్యానర్ పై రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని నిర్మించారు.[1] రత్న కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమలా పాల్, రమ్య సుబ్రహ్మణ్యన్, శ్రీరంజని, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించగా 20 జూలై 2019న విడుదలైంది.
ఆమె | |
---|---|
దర్శకత్వం | రత్నకుమార్ |
రచన | రత్నకుమార్ |
నిర్మాత | రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని |
తారాగణం | అమలా పాల్ వివేక్ ప్రసన్న రమ్య సుబ్రహ్మణ్యన్ శ్రీరంజని |
ఛాయాగ్రహణం | విజయ్ కార్తీక్ కన్నన్ |
కూర్పు | షఫీక్ మహమ్మద్ అలీ |
సంగీతం | ప్రదీప్ కుమార్ |
విడుదల తేదీ | 20 జూలై 2019 |
సినిమా నిడివి | 141 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకామిని (అమలాపాల్) స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. ఆమె పూర్తిగా వెస్ట్రన్ కల్చర్‌ను ఫాలో అవుతూ తన స్నేహితురాళ్లతో ఎప్పుడూ ఏదో ఒక విషయమై బెట్ కడుతూ జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉంటుంది. కొన్ని కారణాలతో ఆమె పని చేసే ఆఫీస్ వేరే చోటికి మార్చాలని మేనేజ్మెంట్ నిర్ణయించడంతో ఆమె మిత్రులు కొందరు ఆ పాత ఆఫీస్ ని విడచిపోతున్నాం సందర్భంగా అక్కడ పార్టీ చేసుకుంటారు. ఆరోజు కామిని ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు కంప్లెయింట్ చేస్తుంది. ఆ తరువాత కామిని ఒక పాడుబడ్డ బంగ్లాలో ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపిస్తుంది. అసలు ఆమె ఆ బంగ్లాలో ఎందుకు ఉంది ? ఆమె నగ్నంగా ఎందుకు పడి ఉంది ? అసలు ఆ రోజు ఏం జరిగింది ? చివరకు కథ ఏమవుతుంది ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- అమలా పాల్
- వివేక్ ప్రసన్న
- రమ్య సుబ్రహ్మణ్యన్
- శ్రీరంజని
- సరిథిరన్
- రోహిత్ నంద కుమార్
- కిశోరె దేవ్
- అనన్య రమాప్రసాద్
- టి.ఎం. కార్తీక్
- అర్చన చంధోకే
- అదిరాజ్
- గోపి
- వెంకిట్ రామ్
- అరువి బాలాజీ
- సిటిజెన్ మణి
- టిఎస్సార్
- బిజిలి రమేష్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రిత్వి క్రియేషన్స్
- నిర్మాతలు: రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రత్నకుమార్
- సంగీతం: ప్రదీప్ కుమార్
- సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
- మాటలు: రాజేష్ ఎ మూర్తి
- పాటలు: భువన చంద్ర
- ఆర్ట్ డైరెక్టర్: విదేశ్
- సహ నిర్మాత: జె. ఫణీంద్ర కుమార్
మూలాలు
మార్చు- ↑ Zee Cinemalu (15 July 2019). "ఆమె" (in ఇంగ్లీష్). Archived from the original on 29 అక్టోబరు 2021. Retrieved 29 October 2021.
- ↑ The Times of India (19 July 2019). "A compelling watch that breaks stereotypes". Archived from the original on 29 అక్టోబరు 2021. Retrieved 29 October 2021.
- ↑ The Hans India (21 July 2019). "Amala Paul's Aame Movie Review & Rating". Archived from the original on 9 జూన్ 2020. Retrieved 29 October 2021.