అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

అమలా పాల్
జననం (1991-10-26) 1991 అక్టోబరు 26 (వయస్సు: 28  సంవత్సరాలు)
కోచి, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుఅనఖ
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీలక సంవత్సరాలు2009 నుండి ఇప్పటివరకు

నేపధ్యముసవరించు

ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చిలో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచిలో పూర్తిచేసింది.

నట జీవితముసవరించు

2009 లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రవేశానికై ఒక సంవత్సరము విరామము తీసుకొంది. ఈ సమయంలో ఈవిడ చాయాచిత్రాలు చూసిని ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీల తామర లో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు. ఆచిత్రం విజయవంతము కానప్పటికి, అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తరువాత తమిళ హాస్యచిత్రం వికడకవి లో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి, ఈవిడ 6 వ చిత్రంగా విడుదలయ్యింది. ఈమధ్యలో వీర శేకరన్ , సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించింది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళిలో ఈమె పోషించిన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. తరువాత మైనా చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఘనవిజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

మూలాలుసవరించు

  1. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.

బయటి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అమలా_పాల్&oldid=2983184" నుండి వెలికితీశారు