ఆరాధన (1976 సినిమా)

1976 సినిమా

ఆరాధన 1976 లో తెలుగు భాషా ప్రేమ కథా చిత్రం. శ్రీ భాస్కర చిత్ర బ్యానర్[3] లో అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించాడు. ఈ సినిమాకు బి. వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు.[4] ఇందులో ఎన్.టి.రామారావు, వాణిశ్రీ ప్రధాన పాత్రలలో [5] నటించారు. ఈ సినిమాకు సాలూరి హనుమంతరావు సంగీతాన్నందించాడు.[6] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా రికార్డ్ చేయబడింది.[7] ఈ చిత్రం హిందీ చిత్రం గీత్ (1970) కు రీమేక్. హిందీగాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.

ఆరాధన
గోడ పత్రిక
దర్శకత్వంబి. వి. ప్రసాద్
రచనగొల్లపూడి మారుతీరావు (మాటలు)
స్క్రీన్ ప్లేబి. వి. ప్రసాద్
కథరామానంద్ సాగర్
దీనిపై ఆధారితంగీత్ (1970)
నిర్మాతఎ. పుండరీకాక్షయ్య
తారాగణంఎన్. టి. రామారావు, వాణిశ్రీ
ఛాయాగ్రహణంజె. సత్యనారాయణ
కూర్పుకందస్వామి
సంగీతంసాలూరి హనుమంతరావు
నిర్మాణ
సంస్థ
శ్రీ భాస్కరచిత్ర[2]
విడుదల తేదీ
1976 మార్చి 12 (1976-03-12)[1]
సినిమా నిడివి
165 ని
దేశంభారత్
భాషతెలుగు

కథ సవరించు

ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది. ఆ గ్రామం పరిసరాలు అందమైన కొండ ప్రాంతంలో పచ్చదనంతో నిండి, దాని చుట్టూ నీటి వనరులతో కూడుకొని ఉంది. అక్కడ యువకుడు గోపి (ఎన్ ‌టి రామారావు) జీవనోపాధికై మేకలను పెంచుకొంటూ తన సోదరి జానకి (విజయ లలిత) తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. ఒకసారి ప్రముఖ రంగస్థల కళాకారిణి, గాయని అయిన రాధ (వాణిశ్రీ) ఆ ప్రాంతానికి వస్తుంది. గోపీకి సహజంగా ఏర్పడిన ప్రతిభతో వేణునాదం చేయడం చూసి అతనితో ప్రేమలో పడుతుంది. రాధ బయలుదేరే ముందు గోపిని తనతో పాటు రమ్మని అడుగుతుంది. తద్వారా అతని ప్రతిభ వృద్ధి చెంది డబ్బు కూడా సంపాదించవచ్చు అని చెబుతుంది. కానీ సంగీతం దేవుడిచ్చిన వరం అని గోపి చెప్తాడు. దానిని అమ్మేందుకు ఇష్టపడడు. కాబట్టి, రాధ తనతో పాటు గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకుంటుంది. తరువాత ఆమె తిరిగి వచ్చి తన కంపెనీ యజమాని అయిన సుధాకర్ (జగ్గయ్య) కు ఈ ప్రేమ వ్యవహారమంతా వివరిస్తూ, తనకు ఇంతకు పూర్వం సుధాకర్ ను వివాహం చేసుకుంటాననే ఉద్దేశ్యాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంతలో గోపీ తన సోదరి జానకికి వివాహాన్ని నిర్ణయిస్తాడు కానీ వరకట్నం కారణంగా ఆ వివాహం రద్దు అవుతుంది. అప్పుడు గోపి డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తాడు, అందుకే అతను రాధ సహాయం కోసం నగరానికి చేరుకుంటాడు. తరువాత పెద్ద స్టార్ అవుతాడు. చాలా డబ్బు సంపాదించి జానకి వివాహం చేస్తాడు. ఇప్పుడు గోపి, రాధ వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. రాధ తండ్రి దశరథరామయ్య (గుమ్మడి) కూడా దీనికి అంగీకరిస్తాడు. కానీ గోపీని చంపడానికి సుధాకర్ కుట్ర పన్నినప్పుడు జరిగిన ప్రమాదంలో గోపీ మూగవాడవుతాడు. అయినప్పటికీ, రాధ అతన్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది. కోపంతో ఉన్న సుధాకర్ మరింత ప్రణాళికలు వేసి దశరథరామయ్యను చంపి, గోపిపై నింద వేస్తాడు. గోపీని నిందితుడిని కానివ్వకుండా తప్పించేందుకు తనను రాధ వివాహం చేసుకోవాలనే షరతును సుధాకర్ పెడతాడు. దానికి రాధ అంగీకరిస్తుంది. కనుక గోపీని దూరంగా పంపుతుంది. అతను నిర్మాణ కార్మికుడిగా పనిచేయడం ప్రారంభిస్తాడు. అక్కడ అతని మధురమైన వేణునాదంవిన్న కాంట్రాక్టర్ (ప్రభాకర్ రెడ్డి) అతన్ని రేడియోలో సంగీత కార్యక్రమంలో అవకాశాన్నిస్తాడు. అది తెలుసుకున్న సుధాకర్ గోపీని అడ్డు తొలగించుకోవడానికి తన మనుషులను పంపుతాడు. కానీ గోపి తప్పించుకుంటాడు, ఈ ప్రక్రియలో అతని గొంతు తిరిగి వస్తుంది. తన గొంతును తిరిగి పొందడంతో అతను సుధాకర్‌ను పోలీసులకు అప్పగిస్తాడు. చివరకు గోపి, రాధ తిరిగి కలుసుకుని గ్రామానికి వెళతారు.

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పాటలు సవరించు

 1. గడసరి బుల్లోడో సొగసరి చిన్నోడా ఉన్నది నా మనసు - ఎస్. జానకి
 2. తీగని మాల్లెలు పూచినావే ఆగనా అల్లన పూజకు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
 3. నందకిషోరా బృందావిహారా రాధను మరిచేవా మాధవా - ఎస్. జానకి
 4. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై - మహమ్మద్ రఫీ - రచన: డా. సినారె
 5. నీకేల ఇంత నిరాశా.. నీమదిలోని వేదనలన్ని (బిట్) - మహమ్మద్ రఫీ - రచన: దాశరథి
 6. నీకేల ఇంత నిరాశా నీ కన్నుల కన్నీరేల అంతా దేవుని - ఎస్. జానకి - రచన: దాశరథి
 7. నేడే తెలిసింది ఈనాడే తెలిసింది కమ్మని - మహమ్మద్ రఫీ, ఎస్. జానకి - రచన: డా. సినారె
 8. లైలా నిరుపేద మనసునే మురిపించి నీవు - మహమ్మద్ రఫీ, ఎస్. జానకి

మూలాలు సవరించు

 1. "Aradhana (Preview)". Spicy Onion.
 2. "Aradhana (Overview)". IMDb.
 3. "Aradhana (Banner)". Chitr.com.[permanent dead link]
 4. "Aradhana (Direction)". Filmiclub.
 5. "Aradhana (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-19. Retrieved 2020-08-16.
 6. "Aradhana (Music)". Know Your Films.
 7. "Aradhana (Review)". The Cine Bay. Archived from the original on 2021-05-07. Retrieved 2020-08-16.

బాహ్య లంకెలు సవరించు