ఆర్టికల్ 370 (2024 హిందీ సినిమా)

ఆర్టికల్ 370 2024లో విడుదలైన హిందీ సినిమా. 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడి జ‌రిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశాన్ని ప్రధానంగా తీసుకొని జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ జంభ దర్శకత్వం వహించాడు. యామీ గౌత‌మ్, ప్రియమణి, రాజ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ సినిమా టీజర్‌ను జనవరి 20న[4], ట్రైలర్‌ను ఫిబ్ర‌వ‌రి 8న విడుదల చేసి[5] సినిమాను ఫిబ్ర‌వ‌రి 23న విడుదల చేశారు.

ఆర్టికల్ 370
దర్శకత్వంఆదిత్య సుహాస్ జంభ
స్క్రీన్ ప్లేఆదిత్య ధ‌ర్
ఆదిత్య సుహాస్ జంభ
అర్జున్ ధావన్
మోనాల్ థాకర్
కథఆదిత్య ధ‌ర్
మోనాల్ థాకర్
నిర్మాతజ్యోతి దేశ్‌పాండే
ఆదిత్య ధ‌ర్
లోకేష్ ధర్
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ దీనా వాసని
కూర్పుశివకుమార్ వీ. పనికర్
సంగీతంశాశ్వత్ సచ్‌దేవ్
నిర్మాణ
సంస్థ
B62 స్టూడియోస్
పంపిణీదార్లుజియో స్టూడియోస్
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)
సినిమా నిడివి
158 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹20 కోట్లు [2]
బాక్సాఫీసు₹72.93 కోట్లు [3]

ఈ సినిమా ఒక వ‌ర్గాన్ని మాత్ర‌మే అణచివేతకు గుర‌యిన‌ట్లు మ‌రో వ‌ర్గంను మొత్తం విల‌న్స్ అన్న‌ట్లు చూపించార‌ని అందుకే ఈ సినిమాపై గల్ఫ్‌ దేశాలన్నీ నిషేధం విధించాయి.[6]

నటీనటులు

మార్చు
  • యామీ గౌత‌మ్ - NIA ఏజెంట్ జూనీ హక్సర్‌, శ్రీనగర్‌లోని మాజీ ID ఫీల్డ్ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధారంగా)
  • ప్రియమణి - జాయింట్ సెక్రటరీ పీఎంఓ రాజేశ్వరి స్వామినాథన్
  • రాజ్ అర్జున్ - శ్రీనగర్ ఖావర్ అలీ, ID స్టేషన్ చీఫ్‌ (ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధారంగా)
  • శివమ్ ఖజురియా - బుర్హాన్ వనీ
  • వైభవ్ తత్వవాడి - డిప్యూటీ కమాండెంట్ CRPF యశ్ చౌహాన్
  • అరుణ్ గోవిల్ - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
  • రాజ్ జుత్షి - J&K మాజీ ముఖ్యమంత్రి సలావుద్దీన్ జలాల్ (ఒమర్ అబ్దుల్లా ఆధారంగా)
  • దివ్య సేథ్ - CM J&K పర్వీనా అంద్రబీ (మెహబూబా ముఫ్తీ ఆధారంగా)
  • కిరణ్ కర్మార్కర్ - హోం మంత్రిగా (అమిత్ షా ఆధారంగా)
  • సుమిత్ కౌల్ - యాకూబ్ షేక్‌ ( యాసిన్ మాలిక్ ఆధారంగా)
  • ఇరావతి హర్షే - బృందా కౌల్‌ ( నిధి రజ్దాన్ ఆధారంగా)
  • మోహన్ అగాషే - మాజీ J&K గవర్నర్ జగ్మోహన్ పాటిల్ (జగ్మోహన్ ఆధారంగా)
  • స్కంద్ సంజీవ్ ఠాకూర్ - వసీం అబ్బాసీ
  • అశ్విని కౌల్ - జాకీర్ నాయకూ
  • అశ్వినీ కుమార్ - అష్షిహ్ మట్టూ
  • అసిత్ రెడీజ్ - రోహిత్ థాపర్‌
  • జయ వీర్లే - ప్రాంజలి
  • సన్యా సాగర్ - నమితా చతుర్వేది
  • రాజీవ్ కుమార్ - షంషేర్ అబ్దాలీ
  • మిథిల్ షా - సిద్ధార్థ్‌
  • బి. శంతను - ఉపాధ్యక్షుడు
  • అజయ్ శంకర్ - గౌరంగ్ సేన్‌గుప్తా
  • తోషిర్ నల్వత్ - ప మొహ్సిన్‌
  • సుఖిత అయ్యర్ - అనురాధ పట్నాయక్‌
  • సందీప్ ఛటర్జీ - ISI చీఫ్‌

మూలాలు

మార్చు
  1. "Aricle 370 (12A)". British Board of Film Classification. 16 February 2024. Retrieved 16 February 2024.
  2. "Article 370 Box Office Collection Day 1: Good Start To Yami Gautam-Priyamani's Political Drama". English Jagran. 24 February 2024. Retrieved 24 February 2024.
  3. "Article 370 Box Office". Bollywood Hungama. 23 February 2024. Retrieved 24 February 2024.
  4. Namasthe Telangana (21 January 2024). "ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా యామి గౌతమ్.. ఆస‌క్తిక‌రంగా 'ఆర్టికల్ 370' టీజ‌ర్". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  5. Hindustan Times Telugu (8 February 2024). "ఇంట్రెస్టింగ్‍గా ఆర్టికల్ 370 ట్రైలర్.. "కశ్మీర్ మొత్తం ఇండియాదే'". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  6. Eenadu (26 February 2024). "'ఆర్టికల్‌ 370' చిత్రాన్ని నిషేధించిన గల్ఫ్‌ దేశాలు.. కారణమిదే". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.

బయటి లింకులు

మార్చు