ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20[ఆధారం చూపాలి] చిత్రాలలో నటించింది. రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పెట్టింది.

ప్రియమణి
Priyamani.jpg
జన్మ నామంప్రియ వాసుదేవ్ మణి అయ్యర్
జననం (1984-06-04) 1984 జూన్ 4 (వయస్సు 37)
Indiaపాలక్కడ్,కేరళ,భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 2004 - ఇప్పటి వరకు

నేపధ్యముసవరించు

ప్రియమణి జూన్ 4న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. ఆమె అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే పొట్టిగా ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది.

నటజీవితముసవరించు

 • బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది.
 • తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ 'పెళ్ళైనకొత్తలో..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి.
 • ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది.
 • అలా నటిగా బాగా బిజీ అయ్యింది. అప్పట్నుంచి మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది.
 • కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే క్షేత్రం, చారులత, చండి.
 • ఈ రెండు సినిమాల్లోనూ చక్కటి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. విమర్శకులు సైతం వహ్వా అనేలా చేసింది. అందుకు ఉదాహరణ చారులతకు వచ్చిన అవార్డులే.
 • తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది.
 • ప్రియకి నార్త్ ఇండియన్ వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రవ్వదోశ. తీరిక సమయంలో సంగీతం వినడం, నృత్యం చేయడం ఈమె హాబీలు! ఇంకా చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, కుక్కపిల్లలు, పిల్లి పిల్లలంటే ఈ కేరళ కుట్టికి చాలా ఇష్టం.
 • కేవలం హీరోయిన్‌గానే కాకుండా రగడ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. కలెక్షన్ల వర్షంతో రికార్డులు సృష్టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో కూడా గెస్ట్‌గా ఒక పాటలో ఓ వెలుగు వెలిగింది.మలయాళంలో ఓ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

తమిళముసవరించు

కన్నడసవరించు

 • రామ్ (2010)
 • ఎనో ఒంతర
 • విష్ణువర్ధన
 • కో కో
 • అన్న బాండ్
 • చారులత
 • లక్ష్మి
 • అంబరీష

మళయాలంసవరించు

హిందీసవరించు

బయటి లింకులుసవరించు

 1. Andrajyothy (16 July 2021). "ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ..ఏమో". chitrajyothy. Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రియమణి&oldid=3270506" నుండి వెలికితీశారు