ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. రాజకీయ నాయకుడు , ఆయన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ (గురుకులాల) కార్యదర్శిగా పనిచేశాడు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ | |||
మాజీ కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ | |||
పదవీ కాలం 2013 – 20 జులై 2021 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 23 నవంబర్ 1967 ఆలంపూర్, జోగులాంబ గద్వాల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | బహుజన్ సమాజ్ పార్టీ (2021 ఆగస్టు 8 - 2024 మార్చి 16) | ||
తల్లిదండ్రులు | ప్రేమమ్మ, బీఆర్ సవరన్న | ||
బంధువులు | మెతుకు ఆనంద్ | ||
పూర్వ విద్యార్థి | హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ | ||
వృత్తి | మాజీ ప్రభుత్వ ఉద్యోగి | ||
పురస్కారాలు | పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోం శాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్టిగేటర్) |
జననం, విద్యాభాస్యం
మార్చుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల్ జిల్లా, ఆలంపూర్ లో, 1967 నవంబరు 23న బీఆర్ సవరన్న, ప్రేమమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుండి వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్, అమెరికా, మసాచుసెట్స్ లోని హార్వర్డ్ వర్సిటీ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.[1]
వృత్తి జీవితం
మార్చు- కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2006)
- అనంతపూర్ జిల్లా ఎస్పీ
- గ్రేహౌండ్స్ ఐజీ
- హైదరాబాద్ - డీసీపీ (క్రైమ్),
- హైదరాబాద్ జాయింట్ సీపీ - (స్పెషల్ బ్రాంచ్)
- తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ) కార్యదర్శి ( 2013 - 20 జూలై 2021) [2][3]
- ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ (ఈఎంఆర్‌ఎస్‌ఎస్) కార్యదర్శిగా, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చైర్మన్‌గా పనిచేశాడు.[4]
2001 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్.పిగా పనిచేసినపుడు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. నక్సలిజాన్ని అణిచివేయడానికి చర్యలు తీసుకుంటూనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న ఊళ్ళోనే ఉండేలా ప్రోత్సహించాడు. భూమి లేని పేదలకు భూములు పంచడానికి కృషి చేశాడు.
హైదరాబాద్ పోలీసు నేరవిభాగంలో డిసిపిగా పనిచేస్తున్నపుడు పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సెల్, ఠాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు. వీటి ఆధారంగా తర్వాతి కాలంలో అక్కడ సైబర్ క్రైం సెల్ ఏర్పాటు అయ్యాయి. పోలీస్ వెబ్‌సైట్ సృష్టిలో కూడా ఆయన కృషి చేశాడు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ 2020 జూన్లో ఐజీ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి పొందాడు.[5] ఆయన తన 26 ఏళ్లు సర్వీస్ తరువాత 19 జూలై 2021న స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.[6][7][8] ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) ను[9] ప్రభుత్వం 20 జూలై 2021న ఆమోదించింది.
స్వేరో సంస్థ
మార్చుగురుకులాల్లో చదివిన పూర్వవిద్యార్థులతో ‘స్వేరో’ సంస్థను ఏర్పాటు చేశారు. వారు ఇచ్చిన విరాళాలను విద్యార్థుల శ్రేయస్సుకు ఖర్చు పెడతారు. ఇందులో సభ్యత్వం తీసుకున్నవారు ‘స్వేరో’ సిద్ధాంతాల మేరకు పనిచేయాలన్న షరతు పెట్టారు.
రాజకీయ జీవితం
మార్చుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ 2021 ఆగస్టు 8లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.[10][11] ఆయన లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి 44,646 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ 2024 మార్చి 16న బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేశాడు.[12]
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మార్చి 18న గజ్వేల్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఅర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[13]
మూలాలు
మార్చు- ↑ India Today (14 October 2020). "This IPS officer from Telangala is changing the fate of many underprivileged Tribal students" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ The Economic Times (14 August 2016). "I am comfortable with my identity today: RS Praveen Kumar, IPS". Archived from the original on 16 March 2021. Retrieved 20 July 2021.
- ↑ Sakshi (20 July 2021). "ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. గురుకులాలకు షాక్!". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Sakshi (18 June 2021). "సీఎం వద్ద ఫైల్: ఎప్పుడైనా ఐపీఎస్‌ల బదిలీలు". Sakshi. Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ TV9 Telugu (19 July 2021). "ప్రవీణ్‌కుమార్ పదవికి రాజీనామా.. కారణాలు ట్విట్టర్‌లో వెల్లడి.. - senior Indian Police Service Officer Praveen Kumar resigns from IPS services". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (19 July 2021). "ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయం: ఐపీఎస్ పదవికి రాజీనామా". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Namasthe Telangana (20 July 2021). "ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ ఆమోదం". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Sakshi (8 August 2021). "బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
- ↑ The New Indian Express (9 August 2021). "Former Telangana IPS officer RS Praveen Kumar joins Bahujan Samaj Party". Archived from the original on 10 August 2021. Retrieved 10 August 2021.
- ↑ Eenadu (16 March 2024). "బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా". Archived from the original on 16 March 2024. Retrieved 16 March 2024.
- ↑ Eenadu (18 March 2024). "భారాసలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్". Archived from the original on 18 March 2024. Retrieved 18 March 2024.