ఆర్.కొత్తపల్లి
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
ఆర్.కొత్తపల్లి ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఆర్.కొత్తపల్లి | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°30′44.460″N 79°7′18.696″E / 15.51235000°N 79.12186000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | బేస్తవారిపేట |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08406 ) |
పిన్‌కోడ్ | 523 346 |
మౌలిక వసతులు
మార్చుత్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో దాతల సహకారంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, ఆగస్టు-17వ తేదీ సోమవారం నాడు ప్రారంభించారు. [3]
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం "సలకలవీడు" గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/ఆలయాలు
మార్చుశ్రీ పట్టాభి రామస్వామివారి ఆలయం
మార్చు- గ్రామస్థుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, ఫిబ్రవరి-21వ తేదీ, శనివారం నాడు కన్నులపండువగా నిర్వహించారు. ఆదివారం నాడు, సీతారాముల విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. జలాధివాసంలో ఉంచిన విగ్రహాలకు రుద్రాభిషేకం నిర్వహించారు. మూడవ రోజు సోమవారంనాడు, మూలవిరాట్టులు, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తిశ్ర్ద్ధలతో నిర్వహించారు. ధ్వజస్తంభాన్ని గ్రామములో ఊరేగించారు. ఆలయప్రాంగణమంతా రామభజనలు, సంకీర్తనలతో మారుమ్రోగినది. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసినది.
- ఈ ఆలయంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠగావించి 16 రోజు జూలైన సందర్భంగా, 2015, మార్చ్-9వ తేదీ, సోమవారం నాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చనలు, సహస్రనామార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.