ఆర్.గుండూరావు
ఆర్. గుండు రావు (27 సెప్టెంబర్ 1937 - 22 ఆగష్టు 1993) 1980 నుండి 1983 వరకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆర్.గుండూరావు | |
---|---|
కర్నాటక 2వ ముఖ్యమంత్రి | |
In office 12 జనవరి 1980 – 6 జనవరి 1983 | |
అంతకు ముందు వారు | దేవరాజ్ అర్స్ |
తరువాత వారు | రామకృష్ణ హెగ్డే |
లోక్ సభ సభ్యుడు | |
In office 1989-1991 | |
అంతకు ముందు వారు | వి.ఎస్.కృష్ణయ్యర్ |
తరువాత వారు | కె.వెంకటగిరి గౌడ |
నియోజకవర్గం | బెంగళూరు దక్షిణ నియోజకవర్గం |
కర్ణాటక ప్రభుత్వంలో రవాణా శాఖామంత్రి | |
In office 1975–1977 | |
నియోజకవర్గం | సోమవారపేట |
కర్ణాటక ప్రభుత్వంలో సమాచార శాఖామంత్రి [1] | |
In office 1973-1975 | |
నియోజకవర్గం | సోమవార పేట |
Assembly Member for సోమవారం పేట [2][3] | |
In office 1972–1983 | |
అంతకు ముందు వారు | జి.ఎం.మంజనాథయ |
తరువాత వారు | B. A. Jivijaya |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఫ్రాసెన్ పేట, నంజరాజపట్న తాలూకా, గోర్గ్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కుషాల్ నగర, కడగు జిల్లా, కర్ణాటక, భారతదేశం ) | 1937 ఏప్రిల్ 8
మరణం | 1993 ఆగస్టు 22 లండన్, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్ డం | (వయసు 56)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | వరలక్ష్మి |
సంతానం | 3; దినేష్ గుండూరావు తో సహా |
జీవిత విశేషాలు
మార్చుగుండూరావు 1937 ఏప్రిల్ 8 న బ్రిటీష్ ఇండియాలోని పూర్వపు కూర్గ్ ప్రావిన్స్ (ప్రస్తుతం కర్నాటకలోని కొడగు జిల్లాలో ) కుశలనగరలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో [4] [5] కె. రామారావు, చిన్నమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. గుండూరావు అమ్మతి ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను కొడగులో ప్రసిద్ధ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అతను అనేక ట్రోఫీలను గెలుచుకున్నాడు. [6]
రాజకీయ జీవితం
మార్చురావు తన రాజకీయ జీవితాన్ని కుశాలనగర్ టౌన్ మునిసిపాలిటీ అధ్యక్షుడిగా ప్రారంభించాడు. ఈ పదవిలో అతను పదేళ్లపాటు పనిచేశాడు. అనంతరం 1972, 1978లో సోమవారపేట నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను డి. దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వంలో మంత్రిగా, కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాడు.
దేవరాజ్ అర్స్ ప్రభుత్వం కూలిపోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాడు. బెంగుళూరులో కెంపెగౌడ బస్ స్టేషన్ అని పిలువబడే మెజెస్టిక్ బస్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రిగా గుండూరావు బాధ్యత వహించాడు. [7] అతను కర్ణాటకలో అనేక మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలను కూడా మంజూరు చేశాడు. ఆయన హయాంలో ఏడాదిన్నర వ్యవధిలో కావేరి రెండో దశ పూర్తయింది. మైసూరులో "కళా మందిర" నిర్మాణానికి కూడా బాధ్యత వహించాడు. [6]
కర్నాటక పరిపాలన , విద్యలో కన్నడకు ఆధిపత్యం కావాలని గోకాక్ ఆందోళనలు అలాగే నర్గుండ్, నవలగుండ్‌లలో రైతులపై పోలీసుల కాల్పులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగాయి. అతను సమర్థవంతమైన నిర్వాహకుడిగా గుర్తింపు పొందినప్పటికీ, అతను తన ఆడంబరత్వం, ధైర్యం, బహిరంగంగా మాట్లాడటం కోసం మరింతగుర్తింపు పొందాడు. [8] [9]
గుండూ రావు 1989 నుండి 1991 వరకు బెంగుళూరు దక్షిణ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు [10]
మరణం
మార్చుఅతను 56 సంవత్సరాల వయస్సులో 1993 ఆగస్టు 22న లండన్‌లో క్యాన్సర్‌తో మరణించాడు.
వ్యక్తిగత జీవితం
మార్చుఅతని కుమారుడు దినేష్ గుండు రావు ప్రస్తుతం బెంగళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా [11] కొనసాగుతున్నాడు. అతను ఆహార, పౌర సరఫరాల మంత్రిగా పనిచేస్తుసాడు.
మూలాలు
మార్చు- ↑ "I am here because of my party: R. Gundu Rao".
- ↑ "Previous Year's Election Results in Somwarpet, Karnataka". www.traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-04-14.
- ↑ "Somwarpet Assembly Constituency Election Result". www.resultuniversity.in.
- ↑ "RAHUL GANDHI APPOINTS DINESH GUNDU RAO AS KARNATAKA CONGRESS CHIEF". India Times. Retrieved 2 July 2018.
- ↑ "Members Bioprofile". Lok Sabha.
- ↑ 6.0 6.1 "The Charismatic Chief – Gundu Rao". Karnataka.com. 21 November 2011.
- ↑ "Profile of Late. Sri R Gundu Rao". Dinesh Gundu rao personal website. Archived from the original on 2012-08-17. Retrieved 2023-04-14.
- ↑ "Gundu Rao was known for his boldness". The Hindu. 26 February 2007. Archived from the original on 28 February 2007.
- ↑ "Achievements of Gundu Rao significant, says Ananthamurthy". The Hindu. 5 March 2006. Archived from the original on 20 April 2006.
- ↑ "The Charismatic Chief – Gundu Rao". Karnataka.com. 21 November 2011.
- ↑ and a former minister for food and civil supplies."Winning is all that ultimately matters to political parties". Rediff on the net.
బాహ్య లింకులు
మార్చు- kn:ఆర్. గుండూ రావ్ ఆర్.గుండు రావు కన్నడ జీవిత చరిత్ర
- గుండూరావు జీవిత చరిత్ర విడుదల