ఆర్.బి. తిమ్మాపుర
రామప్ప బాలప్ప తిమ్మాపుర (జననం 1964) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[1]
ఆర్.బి. తిమ్మాపుర | |||
క్యాబినెట్ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 మే 27 | |||
గవర్నరు | థావర్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
ముందు | కే . గోపాలయ్య | ||
పదవీ కాలం 2018 డిసెంబరు 22 – 2019 జులై 23 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
పదవీ కాలం 2016 – 2018 | |||
గవర్నరు | వాజుభాయ్ వాలా | ||
ముందు | సతీష్ జర్కిహోళి | ||
తరువాత | హెచ్. డి. కుమారస్వామి | ||
ఎంఎల్ఏ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2023 | |||
ముందు | గోవింద్ కర్జోల్ | ||
నియోజకవర్గం | ముధోల్ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | గోవింద్ కర్జోల్ | ||
తరువాత | గోవింద్ కర్జోల్ | ||
నియోజకవర్గం | ముధోల్ | ||
పదవీ కాలం 1989 – 1994 | |||
ముందు | భీమప్ప జాంఖండి | ||
తరువాత | గోవింద్ కర్జోల్ | ||
నియోజకవర్గం | ముధోల్ | ||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 14 జూన్ 2016 – 13 జూన్ 2022 | |||
ముందు | ఆర్. వి. వెంకటేష్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 (age 59–60) ఉత్తుర్ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఆర్.బి. తిమ్మాపుర 1989లో ముధోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, కర్ణాటక చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పని చేసి 1999 ఉప ఎన్నికలో తిరిగి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏపీఎంసీ మంత్రిగా, 2002లో ఎస్.ఎం కృష్ణ మంత్రివర్గంలో ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2003లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. ఆర్.బి. తిమ్మాపుర 2016లో శాసనమండలి సభ్యునిగా ఎన్నికై 2017లో ఎక్సైజ్ మంత్రిగా ఆ తర్వాత పంచదార, ఓడరేవు, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ శాఖ మంత్రిగా పని చేశాడు.
మూలాలు
మార్చు- ↑ The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.