ఆర్.రాధ

భరతనాట్య కళాకారిణి, నాట్యగురువు, సినిమా నటి

ఆర్.రాధ భరతనాట్య కళాకారిణి.[1]

ఆర్.రాధ
వ్యక్తిగత సమాచారం
జననం(1941-12-31)1941 డిసెంబరు 31
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్య కళాకారిణి,
భరతనాట్యం గురువు

విశేషాలు

మార్చు

ఈమె 1941, డిసెంబరు 31వ తేదీన ముంబైలో జన్మించింది. ఈమె మొదట వళువూర్ బి. రామయ్య పిళ్ళై వద్ద వళువూర్ బాణీలో భరతనాట్యం అభ్యసించింది. తరువాత వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంది. తరువాత ఆమె భరతనాట్యంలో శిక్షణను కొనసాగించి వళువూర్ బాణీ నృత్యంలో నైపుణ్యాన్ని సాధించింది. ఈమె తన సోదరీమణులు కమల, వాసంతితో కలిసి అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె తన సోదరీమణులతో కలిసి డ్వైట్ ఐసెన్‌హోవర్, ఎలిజబెత్ II, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారి సమక్షంలో నృత్యం చేసింది.[2] జపాన్, మలేసియా, ఐరోపా దేశాలలో తన సోదరీమణులతో కలిసి పర్యటించింది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో నర్తకిగా పలు పాటలలో నటించింది. కమల రెండవ వివాహం చేసుకుని వీరికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఈమె వాసంతి జంటగా కొంతకాలం ప్రదర్శనలు ఇచ్చారు. ఈమె రూపొందించిన త్యాగరాజ "నౌకాచరిత్రం" నృత్య రూపకం అనేక ప్రదర్శనలు పొంది దూరదర్శన్‌లో ప్రసారమయ్యింది. డి.వి.డిగా కూడా విడుదలయ్యింది.

ఈమె ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా అనేక ప్రాజెక్టులు చేపట్టి వళువూర్ పరంపరపై అనేక నృత్య కార్యక్రమాలను శృతి ఫౌండేషన్, చెన్నై కోసం, ఢిల్లీ దూరదర్శన్ కోసం రికార్డు చేసింది. భారతదేశంలోను, విదేశాలలోను అనేక వర్క్‌షాపులు, సెమినార్లు, ప్రసంగాలు చేసింది. ఈమె పుష్పాంజలి అనే నృత్యపాఠశాలను స్థాపించి అనేక మందికి వళువూర్ బాణీలో భరతనాట్యం నేర్పించింది.

సినిమా రంగం

మార్చు
ఆర్.రాధ నృత్యం చేసిన/నటించిన సినిమాలు
క్ర.సం. సినిమా పేరు భాష విడుదల సంవత్సరం పాత్ర వివరాలు
1 వేదల ఉలగం తమిళం 1948 రాధ తొలి సినిమా. 6 యేళ్ళ వయసులో నటించింది.
2 పెన్ తమిళం 1954 బిచ్చగత్తె
3 విలాయత్తు బొమ్మై తమిళం 1954 "కలై చెల్వమే వాళ్గవే" అనే పాటలో నృత్యం చేసింది
4 శివగంగై సీమై తమిళం 1959 "కన్నన్ గరుత కిలి" అనే పాటలో నర్తించింది
5 భక్త కుచేల మలయాళం/కన్నడ 1961 "విక్రమ రాజేంద్ర" పాటలో నర్తించింది
6 చెంద మలయాళం 1973

పురస్కారాలు

మార్చు

ఈమెను దేశవిదేశాలలోని అనేక సాంస్కృతిక సభలు సత్కరించాయి. 2003లో అమెరికాలోని భైరవి ఇండియన్ ఫైన్‌ ఆర్ట్స్ సొసైటీ "నృత్య రత్నాకర" బిరుదుతో సన్మానించింది. 2005లో ఈమెకు భరతనాట్యంలో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.

మూలాలు

మార్చు
  1. web master. "R Rhadha". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 28 April 2021.
  2. Minai. "All About Kamala's Sister Rhadha - The Other Dancer in Bhakta Kuchela!". Cinema Nritya. Retrieved 28 April 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్.రాధ&oldid=3337286" నుండి వెలికితీశారు