ఆలంపూర్ మ్యూజియం

ఆలంపూర్ మ్యూజియం, తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ పట్టణంలో ఉన్న మ్యూజియం.[1] ఆలంపూర్ నవబ్రహ్మ దేవాలయాలలో ఉన్న ఈ మ్యూజియం భారత పురాతత్వ సర్వే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది.[2] బాల బ్రహ్మ దేవాలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న పురావస్తు మ్యూజియంలో అద్భుతమైన శిల్పాలు, శాసనాలు ఉన్నాయి.

ఆలంపూర్ మ్యూజియం
పటం
Established1952
Locationఆలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ, భారతదేశం.
Coordinates15°52′40″N 78°08′06″E / 15.8776398°N 78.134898°E / 15.8776398; 78.134898

చరిత్ర

మార్చు

7వ శతాబ్దం నాటి పురాతన నవబ్రహ్మ దేవాలయాలకు నిలయమైన ఆలంపూర్ పట్టణంలో జోగుళాంబ శక్తిపీఠం కూడా ఉంది. బాదామి చాళుక్యులు అలంపూర్ నవ బ్రహ్మ దేవాలయాలను నిర్మించారు. 6వ -7వ శతాబ్దానికి చెందిన ఈ అలంపూర్ సైట్ మ్యూజియం గతకాలపు హైబ్రిడ్ నిర్మాణ శైలికి ప్రతిబింబంగా ఉన్న పురావస్తు అవశేషాలను సంరక్షిస్తోంది. ఇక్కడి విగ్రహాలు, శిలాశాసనాలు ఆలంపురం క్షేత్రం చుట్టుపక్కల చేపట్టిన తవ్వకాల్లో బయటపడినవే. 1952 సంవత్సరంలో అప్పటి భారత ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ అలంపూర్ మ్యూజియాన్ని ప్రారంభించాడు.[3] దీని చుట్టూ నవ బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి.

సేకరణలు

మార్చు

పెద్ద గదిలో ఉన్న మ్యూజియం మధ్యలో ఒక ఓపెన్ ఎయిర్ సెక్షన్, తూర్పు వైపు ఒక చిన్న ఆవరణ ఉన్నాయి. కళాఖండాలన్నీ హాల్ అంతటా భద్రపరచబడ్డాయి. ఇందులో 124 కంటే ఎక్కువ రాతి శిల్పాలు, 26 శిలాఫలకాలు, 64 ఇతర శిల్పాలు ఉన్నాయి. 7వ శతాబ్దం చాళుక్య, 12వ శతాబ్దం కాకతీయుల, 16వ శతాబ్దం విజయనగర కాలం నాటి శాసనాలు ఉన్నాయి. అష్టదిగ్పాలకాలతో ఉన్న శివుని చిత్రాలు, నటరాజ చిత్రంతోపాటు ఎదురుగా నందిని కలిగి ఉన్న కాకతీయ చిత్రాలు ఉన్నాయి. వందలాది అందమైన రాతి బొమ్మలు, వాటిలో చాలావరకు పాలిష్ చేయబడిన నల్లరాయి బొమ్మలు ఉన్నాయి.[4]

ఈ మ్యూజియంలో సుబ్రహ్మణ్య, వల్లి రాతి చిత్రం, ప్రత్యేకమైన మహిషాసురమర్ధిని చిత్రం, బంధ రేణుకా దేవి నల్ల రాతి శిల్పం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పిల్లలు కోరుకునే మహిళలు రేణుకా దేవికి పూజలు చేస్తారు. గది మధ్యలో రెండు పెద్ద, చతురస్రాకార ఆకారంలో ఉన్న కాకతీయ సీలింగ్ ప్యానెల్స్ ఉన్నాయి. ఎడమ వైపునున్న మూడు వరుసలలో నాగ, ఇంద్ర, అగ్ని చిత్రాలు ఉన్నాయి. ఇందులోని రాతి శాసనాలు ఈ ప్రాంతపు చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి. ప్రారంభ శాసనాలు కన్నడ, తెలుగు లిపి మిశ్రమంగా ఉన్నాయి. మరికొన్ని శాసనాలు సూర్య, చంద్ర, శివలింగ, ఆవు, కత్తి డ్రాయింగ్‌లను కలిగి ఉన్నాయి.

ఇతర వివరాలు

మార్చు
 1. నటరాజ, మహిషాసుర మర్దిని, సూర్య, కార్తికేయ, నాగ శిల్పాలు ఇక్కడ నుండి లండన్, జర్మనీ, పారిస్ మొదలైన దేశాలలో జరిగిన అనేక అంతర్జాతీయ ప్రదర్శనలలో ప్రదర్శించబడ్డాయి.
 2. 1984లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ కళా ప్రదర్శనలో, ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో సూర్య శిల్పం పాల్గొని అనేక పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంసా పత్రాలను గెలుచుకుంది.[5]
 3. 1977లో నటరాజ విగ్రహం లండన్ ప్రదర్శనకు, 2008లో నాగ విగ్రహం బెల్జియం పంపించబడి మొదటి బహుమతి గెలుచుకున్నాయి.
 4. ఎన్. రమేసన్ సంపాదకత్వంలో అబ్దుల్ వహీద్ ఖాన్ స్టోన్ కల్పర్చ్స్ ఇన్ ది ఆలంపూర్ మ్యూజియం పేరుతో పుస్తకాన్ని ప్రచురించాడు.[6][7]

సందర్శన వివరాలు

మార్చు

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది. ప్రతిఏటా 20,000 మందికి పైగా సందర్శకులు వచ్చి ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు.

మూలాలు

మార్చు
 1. "ASI Museum, Alampur". Archived from the original on 16 December 2014. Retrieved 16 December 2014.
 2. "Alampur Museum : a pillar". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
 3. "Archeology Museum, Alampur - Timings, Entry Fee, History & Artifacts". Trawell.in. Retrieved 2021-09-23.
 4. Department of Heritage Telangana, Museum. "Alampur Site Museum". telangana heritage. Archived from the original on 18 September 2021. Retrieved 23 September 2021.
 5. ఈటివి భారత్ న్యూస్, తెలంగాణ (28 January 2021). "అలంపురం.. ప్రాచీన సంపదకు సజీవ సాక్ష్యం..!". ETV Bharat News. Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
 6. Khan, Abdul Waheed (1973). Stone sculptures in the Alampur Museum. Archaeological series - Government of Andhra Pradesh ; no. 39. Hyderabad: Government of Andhra Pradesh.
 7. Safrani, Nawab Shehbaz (1975-08-01). "Stone Sculptures in the Alampur Museum. By Md. Abdul Waheed Khan. Edited By N. Ramesan. Archaeological Series No. 39. Hyderabad: The Government of Andhra Pradesh, 1973. 131 pp. Illustrations, Bibliography, Glossary, Index, Appendices. Rs. 106.00". The Journal of Asian Studies (in ఇంగ్లీష్). 34 (4): 1065–1066. doi:10.2307/2054534. ISSN 1752-0401.