ఆలమండ శాసనసభ నియోజకవర్గం
ఆలమండ శాసనసభ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఆలమండ శాసనసభ నియోజకవర్గం, 1955లో ఆంధ్ర రాష్ట్రంలో రద్దయ్యి రేవిడి శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1] 1952లో ఈ నియోజకవర్గం నుండి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మద్రాసు శాసనసభకు ఎన్నికైన కె.వి.ఆర్.ఎస్.పద్మనాభరాజు, ఆ తర్వాత కొద్దికాలానికే రాజీనామా చేసి, తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1953 (ఉప ఎన్నిక) | ఆలమండ | కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు | పు | ప్రజా సోషలిస్టు పార్టీ | ఏకగ్రీవం | ||||
1952 | ఆలమండ | కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు | పు | సోషలిస్టు పార్టీ | 32078 | జి.వి.అప్పారావు | పు | కాంగ్రేసు | 14616 |
మూలాలు
మార్చు- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 27.