ఆలయశిఖరం
ఆలయ శిఖరం 1983, మే 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ లలితా మూవీస్ పతాకంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, సుమలత ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.
ఆలయశిఖరం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | జి. జగదీష్ చంద్ర ప్రసాద్ |
తారాగణం | సుమలత, చిరంజీవి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
సంభాషణలు | గొల్లపూడి మారుతీరావు |
ఛాయాగ్రహణం | డి. ప్రసాద్ బాబు |
కూర్పు | బాలు |
నిర్మాణ సంస్థ | శ్రీ లలితా మూవీస్ |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చుగొల్లపుడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు (రంగనాథ్) ఆ కుటుంబంలో చదువుకున్న ఏకైక వ్యక్తి, నిరుద్యోగి, జూదగాడు. చిన్నవాడు (చిరంజీవి) జట్కా బండి నడుపుతుంటాడు. తన చదువును మధ్యలోనే ఆపేసి అన్న చదువుకోసం కష్టపడతాడు. రంగనాథ్, సత్యనారాయణకు చెందిన ఫ్యాక్టరీలో చేరి ఆ ఇంటికి అల్లుడిని అవ్వాలి అనుకుంటాడు. పువ్వులు అమ్మే సుమలత చిరంజీవిని ప్రేమిస్తుంది. చిరంజీవి తన అన్న, తండ్రి నుండి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు సుమతల, చిరంజీవికి అండగా నిలుస్తుంది. రంగనాథ్ కుటుంబాన్ని విడిచిపెట్టిన తరువాత, చిరంజీవి తన కుటుంబ బాధ్యతను స్వీకరించి, తన చెల్లెలు పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రంగనాథ్ తన కుటుంబ పరువు తీసి, బహిరంగంగా వారిని అవమానిస్తాడు. సత్యనారాయణ తన వ్యాపార సమస్యలను పరిష్కరించుకోవడానికి రంగనాథ్‌ను ఉపయోగించుకొని, ఆపై అతన్ని హత్య కేసులో ఇరికిస్తాడు. రంగనాథ్ కు తన కుటుంబం పట్ల ద్వేషం ఉన్నప్పటికీ, చిరంజీవి ఈ కేసు నుండి బయటపడటానికి రంగనాథ్ కు సహాయం చేసి, సత్యనారాయణ మోసాలను బయటపెడుతాడు. తరువాత రంగనాథ్, గొల్లపుడి తమ బాధ్యతలను గ్రహించుకొని, కుటుంబంతో కలుస్తారు.
తారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కథ, దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: జి. జగదీష్ చంద్ర ప్రసాద్
- సంభాషణలు: గొల్లపూడి మారుతీరావు
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: డి. ప్రసాద్ బాబు
- కూర్పు: బాలు
- పాటలు: ఉపద్రష్ట సాయి, సి.నారాయణరెడ్డి, ఆత్రేయ, గోపి
- గాయకులు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, ప్రకాష్
- కళ: కె.ఎల్. ధర్
- నృత్యం: రవి
పాటలు
మార్చుఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[1]
- ఇది ఆసలుస్తా
- నీ హృదయం
- కొండలెక్కిన
- నీ రూపు
- ఓ అమ్మకి చెల్ల
- తప్పేముందిరా
మూలాలు
మార్చు- ↑ Naa Songs, Songs (28 October 2018). "Aalaya Sikharam Songs". www.naaSongs.com.co. Retrieved 12 August 2020.